Balakrishna Birthday: బాలయ్య డైరెక్షన్ లో మోక్షజ్ఞ.. భారీ లాంచింగ్ కి రంగం సిద్ధం!
బాలయ్య అభిమానులను వెంటాడుతున్న నిరాశ మోక్షజ్ఞ ఎంట్రీ. నందమూరి కుటుంబం నుండి హీరోగా మారిన బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్... టీనేజ్ లోనే వెండితెరకు పరిచయమయ్యారు. మోక్షజ్ఞ మాత్రం 25 ఏళ్ళు వచ్చినా ముఖానికి రంగు వేసుకోలేదు.

నందమూరి ఫ్యాన్స్ లో రెండు వర్గాలు ఉన్నారు. వారు సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడిగా బాలయ్యను మాత్రమే చూస్తారు. ఎన్టీఆర్ ని ద్వేషిస్తారు. కాబట్టి వాళ్ల దృష్టి నందమూరి తారక రామారావు అసలైన మూడవ తరం వారసుడు మోక్షజ్ఞ మాత్రమే. ఎన్టీఆర్ టీడీపీకి దూరమయ్యాక మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఎదగాలన్న డిమాండ్ ఎక్కువైంది.
దీని కోసమే గుంటూరు విజయవాడ వంటి ప్రాంతాల్లో ప్రతి ఏడాది మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలకు ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని సార్లు మోక్షజ్ఞ స్వయంగా ఈ వేడుకలు హాజరయ్యారు. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలంటూ బాలకృష్ణపై అభిమానుల ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇంత వయసొచ్చినా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వకపోవడంతో కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
మోక్షజ్ఞకు నటనపై ఆసక్తిలేదట. అసలు హీరో కావాలనే కోరిక అతడికి లేదట. బిజినెస్ అంటే ఇష్టపడే మోక్షజ్ఞ అక్క బ్రహ్మణి వలె, వ్యాపార రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నాడట. చాలా కాలంగా ఈ న్యూస్ ప్రచారంలో ఉంది. మోక్షజ్ఞ తీరు చూసినా ఇదే నిజం అనిపిస్తుంది. హీరో కావాలని ఆశపడేవారు మంచి ఫిట్నెస్, అందమైన శరీరాకృతి మెయింటైన్ చేస్తారు. మోక్షజ్ఞ ఈ విషయంలో శ్రద్ధ చూపడం లేదు.
ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ వార్తలు రావడం, తీరా అలాంటి ప్రకటన రాకపోవడం పరిపాటిగా మారిపోయింది. కాగా మోక్షజ్ఞను లాంచ్ చేసే దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. అనిల్ రావిపూడి నుండి బోయపాటి శ్రీను వరకు అరడజను డైరెక్టర్స్ సిద్ధంగా ఉన్నారు.
అయితే తాజా బజ్ ప్రకారం మోక్షజ్ఞను బాలకృష్ణ స్వయంగా లాంచ్ చేయనున్నాడట. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా బాలకృష్ణ తల్లిదండ్రుల పేరిట.. ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశాడు. ఈ బ్యానర్ లో మోక్షజ్ఞ హీరోగా బాలకృష్ణ దర్శకత్వంలో మూవీ తెరకెక్కనుందని వినికిడి. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
అదే నిజమైతే బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఇంత కంటే పెద్ద న్యూస్ ఉండదు. బాలయ్య చాలా కాలంగా డైరెక్టర్ కావాలని ఆశపడుతున్నారు. ఆయన దర్శకత్వంలో నర్తనశాల టైటిల్ తో ఓ పౌరాణికి మూవీ తెరకెక్కించాలని ప్రయత్నం చేశారు. నర్తనశాల మూవీలో ద్రౌపది పాత్ర చేస్తున్న సౌందర్య ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించడంతో నర్తనాల ప్రాజెక్ట్ ని బాలకృష్ణ ఆపేశారు.
ఆ కోరికను మోక్షజ్ఞ మూవీతో తీర్చుకోవాలని బాలయ్య కోరుకుంటున్నారట. మరి ఈ క్రేజీ కంబినేషన్ సెట్ అయితే... అభిమానుల కోరిక నెరవేరుతుంది. అదే సమయంలో బాలయ్య, డైరెక్టర్ కోరికతో పాటు కొడుకుని లాంచ్ చేయాలన్న ఆశ తీరుతాయి.