MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • రష్మికకు గుణపాఠం చెప్పాలి.. ఎమ్మెల్యే ఫైర్, ఉప ముఖ్యమంత్రి కూడా

రష్మికకు గుణపాఠం చెప్పాలి.. ఎమ్మెల్యే ఫైర్, ఉప ముఖ్యమంత్రి కూడా

 Rashmika Mandanna : ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్ రష్మికపై కర్ణాటక ఎమ్మెల్యే రవి గనిగ మండిపడ్డారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమను గౌరవించడం లేదని, అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి హాజరు కాలేదని విమర్శించారు.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 03 2025, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Congress MLA threatens Rashmika Mandanna in telugu

Congress MLA threatens Rashmika Mandanna in telugu


 Rashmika Mandanna : ప్రస్తుతం ఆల్ ఇండియాలో  వన్ ఆఫ్ ది ట్రెండింగ్ హీరోయిన్ రష్మిక.  సక్సెస్, ఫెయిల్యూర్ కు సంభందం లేకుండా ఈమె గురించి జనాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. అప్పుడప్పుడూ  ఫన్నీ ట్రోల్స్ లాంటివి కూడా చేస్తుంటారు.

అల్లు అర్జున్ 'పుష్ప' రిలీజ్ తర్వాత మాత్రం ఈమెకు పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే దక్షిణాదితోపాటు హిందీలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అదే సమయంలో వివాదాల్లోనూ ఇరుక్కుంటోంది. తాజాగా ఆమెపై  పై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవి గనిగ మండిపడ్డారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Congress MLA threatens Rashmika Mandanna in telugu

Congress MLA threatens Rashmika Mandanna in telugu


రష్మిక  తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని తెలిపారు.

34
Congress MLA threatens Rashmika Mandanna in telugu

Congress MLA threatens Rashmika Mandanna in telugu


ఎమ్మల్యే రవి మాట్లాడుతూ..‘‘కిరిక్‌ పార్టీ’ అనే కన్నడ సినిమాతో ఈ రాష్ట్రంలోనే తన కెరీర్‌ను ప్రారంభించారు నటి రష్మిక. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరు కావాలని కోరుతూ గతేడాది మేము ఎన్నోసార్లు ఆమెను సంప్రదించాం. ఆమె రానని.. కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పింది.

అంతేకాకుండా, మా ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. కర్ణాటక ఎక్కడో నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడింది. నాకు తెలిసిన మరి కొంతమంది కూడా సుమారు పదిసార్లు ఆమెను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ ఆమె మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. కన్నడ చిత్రపరిశ్రమ, భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?’’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
 

44
Congress MLA threatens Rashmika Mandanna in telugu

Congress MLA threatens Rashmika Mandanna in telugu


మరో ప్రక్క బెంగళూరు వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో నటీనటులు పాల్గొనకపోవడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నటీనటులు, దర్శక నిర్మాతలు ఒకే తాటి మీదకు రావాలి. రాష్ట్రంలో జరిగిన కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలా కానిపక్షంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వల్ల ప్రయోజనం ఏమిటి? సినిమా పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు కూడా ఎంతో అవసరం అని అందరూ గుర్తుంచుకోవాలి’’ అని వ్యాఖ్యలు చేశారు. నటీనటుల తీరు మారకపోతే వారిని ఏవిధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసన్నారు.

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Recommended image2
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image3
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved