MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Comrade Kalyan: డైరెక్టర్‌ జీవితాన్నే మార్చేసిన కామ్రేడ్‌ కళ్యాణ్‌.. లేటెస్ట్ కలెక్షన్లు

Comrade Kalyan: డైరెక్టర్‌ జీవితాన్నే మార్చేసిన కామ్రేడ్‌ కళ్యాణ్‌.. లేటెస్ట్ కలెక్షన్లు

Comrade Kalyan: కామ్రేడ్‌ కళ్యాణ్‌ సినిమాతో విజయాన్ని అందుకున్నారు దర్శకుడు జానకీరామ్‌ మారెళ్ల. ఆయనకిది తొలి సినిమా. ఒక్క చిత్రంతోనే టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 18 2026, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దర్శకుడి లైఫ్‌ మార్చిన కామ్రేడ్‌ కళ్యాణ్‌
Image Credit : Asianet News

దర్శకుడి లైఫ్‌ మార్చిన కామ్రేడ్‌ కళ్యాణ్‌

సినిమా అనేది ఒక మ్యాజిక్‌. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ని చేస్తుంది. అదే స్టార్‌ని డౌన్‌ చేస్తుంది. సినిమా విజయంతో అన్ని లెక్కలు మారిపోతాయి. ఒక్క హిట్‌ హీరోహీరోయిన్‌, దర్శకుడు, నిర్మాతతోపాటు దానికి పనిచేసిన వారి జీవితాలు కూడా మారిపోతాయి. అందుకే సినిమా అనేది ఒక మ్యాజిక్‌. అయితే ఇప్పుడు ఆ మ్యాజిక్‌ కొత్త దర్శకుడు జానకీరామ్‌ మారెళ్ల లైఫ్‌ని మార్చేసింది. ఆయన ఇటీవల `కామ్రేడ్‌ కళ్యాణ్‌` మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంలో మహిమా నంబియార్‌ హీరోయిన్‌గా నటించింది. వీరితోపాటు రాధికా శరత్‌ కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమయే, సత్య, సుదర్శన్‌, వెన్నెల కిశోర్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, సాయి చంద్‌ కీలక పాత్రలు పోషించారు. కోన వెంకట్‌ సమర్పణలో స్కంధ వాహన మోషన్‌ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్‌ పతాకాలపై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బాక్సాఫీసు వద్ద అదరగొట్టిన కామ్రేడ్‌ కళ్యాణ్‌
Image Credit : Asianet News

బాక్సాఫీసు వద్ద అదరగొట్టిన కామ్రేడ్‌ కళ్యాణ్‌

గత వారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందింది. వసూళ్ల పరంగా మెప్పించింది. నిర్మాతలను గట్టెక్కించింది. మొదటి వారంలో ఈ చిత్రం రూ.28.4కోట్లు వసూలు చేసినట్టు టీమ్‌ అధికారికంగా వెల్లడించింది. వారి లెక్క ప్రకారం ఇది దాదాపు ముప్పై కోట్లకు దగ్గరలో ఉంది. సాక్నిల్క్ సైట్‌ ప్రకారం ఇది దాదాపు ఇరవై కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. ఓవరాల్‌గా మూవీ హిట్‌ అయ్యిందని టీమ్‌ తెలిపింది. ఇటీవలే సక్సెస్‌సెలబ్రేషన్‌ కూడా నిర్వహించారు. దీంతో దర్శకుడు జానకీరామ్‌ చర్చనీయాంశంగా మారారు. ఇప్పుడు ఒక సినిమాతో హిట్‌ కొట్టడం చాలా కష్టంగా మారుతుంది. చాలా వరకు కొత్త దర్శకులు మెప్పించలేకపోతున్నారు. కానీ జానకీరామ్‌ మాత్రం అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు.

33
కమర్షియల్‌ డైరెక్టర్‌గా నిలిచిన జానకీరామ్‌
Image Credit : Asianet News

కమర్షియల్‌ డైరెక్టర్‌గా నిలిచిన జానకీరామ్‌

`కామ్రేడ్‌ కళ్యాణ్‌` సినిమాలో దర్శకుడు జనకీరామ్‌ బలంగా చూపించిన అంశం కామెడీ టైమింగ్. సింపుల్ వన్‌లైనర్స్, సహజమైన సంభాషణలు, సందర్భానుసారంగా వచ్చే కామెడీతో థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించారు. భారీ కామెడీ సన్నివేశాలపై ఆధారపడకుండా, సాధారణ సన్నివేశాలతోనే వినోదాన్ని పంచడంలో సక్సెస్ అయ్యారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా అదిరిపోయేలా తెరకెక్కించారు. తన గురువు దర్శకుడు బాబీ తరహాలోనే యాక్షన్ సన్నివేశాలను రిచ్‌గా, ఆకట్టుకునే విజువల్స్‌తో రూపొందిస్తూ తనలోని టేకింగ్ స్కిల్‌ను చాటుకున్నారు. కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచుతూనే, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపడం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.

తొలి సినిమాతోనే వినోదానికి పెద్దపీట వేస్తూ, కథను ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానంతో జానకిరామ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకులను మెప్పించేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంలో తనకున్న పట్టును ప్రూవ్ చేసుకున్నారు. కామెడీ, యాక్షన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఇప్పుడు అంచనాలు పెరిగాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఈ మూవీ అస్సలు మిస్ కావద్దు.. హైకూపై హీరోయిన్ శ్రీదేవి కామెంట్స్
Recommended image2
Prabhas Movies: ప్రభాస్ అభిమానులకు షాక్, రెండు భారీ సినిమాలు వాయిదా.. స్పిరిట్ కొత్త రిలీజ్ డేట్ ఇదే
Recommended image3
Chiranjeevi: సందీప్ రెడ్డికే గూస్ బంప్స్ తెప్పించిన చిరంజీవి సీన్ గురించి తెలుసా.. కోటని గుర్తుపట్టలేం
Related Stories
Recommended image1
Brahmanandam: కోటీశ్వరులు కావడానికి ఈజీ మార్గం చెప్పిన బ్రహ్మానందం.. ఇలా చేస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు రావట
Recommended image2
Anirudh: కావ్య మారన్‌ని పెళ్లి చేసుకుంటే అనిరుధ్‌ కి ఎన్ని వేల కోట్లు వస్తాయో తెలుసా.. కొడితే కుంభస్థలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved