MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబులో ఉన్న కామన్‌ క్వాలిటీస్‌ ఏంటో తెలుసా? అంత పెద్ద స్టార్స్ అలా ఉండటమేంటి?

పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబులో ఉన్న కామన్‌ క్వాలిటీస్‌ ఏంటో తెలుసా? అంత పెద్ద స్టార్స్ అలా ఉండటమేంటి?

పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబులో సేమ్‌ క్వాలిటీస్‌ ఉన్నాయట. అవేంటో బయట పెట్టాడు దర్శకుడు త్రివిక్రమ్‌. వారి పర్సనల్‌ విషయాలను వెల్లడించారు.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 15 2024, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
pawan kalyan mahesh babu

pawan kalyan mahesh babu

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇండస్ట్రీలో వీరిద్దరు ఆల్మోస్ట్ సేమ్‌ ఇమేజ్‌, అదే రేంజ్‌ ఫ్యాన్ బేస్‌ ఉన్న హీరోలు. అయితే రాజకీయాల్లో ఉండటంతో పవన్‌ది ప్రత్యేకమైన బ్యాన్‌ బేస్‌ అని చెప్పొచ్చు. కానీ ఈ ఇద్దరిలో చాలా విషయాల్లో కామన్‌ క్వాలిటీస్‌ ఉన్నాయట. టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్స్ గా రాణిస్తున్న ఈ ఇద్దరిలో ఉన్న కామన్‌ క్వాలిటీస్‌ ఏంటి? ఇద్దరు ఏం కోరుకుంటారు? ఎలా ఉంటారనేది ఓ సారి చూస్తే..

Bigg Boss Telugu 8 Updates: మహానటితో పోల్చుతూ యష్మి గౌడపై ట్రోల్స్
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పవన్‌, మహేష్‌లో ఉన్న కామన్‌ క్వాలిటీస్‌ని దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ వెల్లడించడం విశేషం. ఓ సందర్భంలో మహేష్‌ తో ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు త్రివిక్రమ్‌. ఇద్దరిలో ఉన్న కామన్‌ క్వాలిటీస్‌ గురించి చెబుతూ, ఇద్దరిలో సింప్లిసిటీని తాను గమనించాడట.

ఇద్దరూ కాంప్లికేటెడ్‌ పీపుల్‌ కాదని చెప్పాడు త్రివిక్రమ్‌. బయటకు అది కనిపించదు కానీ, ఇద్దరిలోనూ కామన్‌ ఫీచర్ ఉందని, బహుశా ఈ ఇద్దరు తనతో కలవడానికి అదే కారణమని తాను నమ్ముతున్నట్టు తెలిపారు మాటల మాంత్రికుడు. అది ఈ ఇద్దరికి కూడా తెలిసి ఉండదన్నారు. 
 

37

సింప్లిసిటీగా ఉంటారని చెప్పిన త్రివిక్రమ్‌.. మహేష్‌ ని `అతడు` సినిమా సమయంలో చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. ఆయన వార్‌ట్రోబ్‌లో రెండు ప్యాంట్లు రెండు షర్ట్ లు ఉంటాయంతే. ఒక పెయిర్‌ షూ, ఒక పెయిర్‌ స్లిప్పర్స్ ఉంటాయి. అదే కారు, అది పెద్దదా? చిన్నదా అనేది పట్టించుకోరు. అది రిచ్‌ కారా? కోటి రూపాయలదా, పది లక్షలదా అనేది తెలియదు, అనవసరం కూడా. అలాగే ఉన్న ఇళ్లు పెద్దదా? చిన్నదా అనేది కూడా చూడరు. ఒక రూమ్‌ చాలు. అలాగే చూసుకోవడనికి సినిమాలుంటే చాలు, చదువుకోవడానికి బుక్స్ ఉంటే చాలు అంతే. 
 

47
Trivikram Srinivas

Trivikram Srinivas

సేమ్‌ క్వాలిటీ పవన్‌ కళ్యాణ్‌లోనూ చూశాను. ఆయనకు నాలుగు చెట్లు ఉన్నాయా? చాలు. చదువుకోవడానికి నాలుగు పుస్తకాలున్నాయా? చాలు. ఆయన అంతే రెండు ప్యాంట్లు, రెండు షర్ట్ లు. ఈ ఇద్దరు చాలా లీన్‌గా బతుకుతారు. పెద్దగా అవసరాలు ఉండవు. ఎంత ఉంటే అంతటితో అడ్జస్ట్ అయిపోతారు అని వెల్లడించారు త్రివిక్రమ్‌. బహుశా ఇది ఖలేజా సినిమా సమయంలో చెప్పిన విషయాలు అని తెలుస్తుంది. ఇప్పటికీ చాలా మారిపోయింది. ఇప్పుడు లగ్జరీ పెరిగింది. 
 

57

మహేష్‌ సొంతంగా లగ్జరీ ఇళ్లు, రేంజ్‌ రోవర్‌ కారు మెయింటేన్‌ చేస్తున్నారు. ప్రత్యేకంగా కార్‌ కలెక్షనే ఉంది. అయితే మహేష్‌కి మాత్రం రేంజ్‌ రోవర్‌ కారు అంటే ఇష్టమని తెలుస్తుంది. ఆయన గతంలో అదే కారు వాడారు. ఆ మధ్య కొత్తగానూ అదే కంపెనీ కారు కొన్నారు.

ఇక పవన్‌ కళ్యాణ్‌కి బెంజ్‌, బీఎండబ్ల్యూ కార్లు ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఆయన ఏపీకి డిప్యూటీ సీఎం అయిన విషయం తెలిసిందే. ఇంట్లోబెంజ్‌ కార్ ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన కార్లు వాడుతున్నారు. 
 

67
Mahesh Babu

Mahesh Babu

 సినిమాల విషయానికి వస్తే మహేష్‌ బాబు ఈ ఏడాది `గుంటూరు కారం` సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. పదేళ్లనాటి కమిట్‌ మెంట్‌ ఇప్పుడు కుదిరింది. `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో దీన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది.

ఈ సినిమాని ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో, అంతర్జాతీయ టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లతో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారు. ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో ఓ సాహసికుడి యాత్ర ప్రధానంగా సినిమా సాగుతుందని, దీని కోసం మహేష్‌ సరికొత్త మేకోవర్‌లోకి మారిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా ఓ కొత్త మహేష్‌ని చూస్తారని టాక్‌. 
 

77
Pawan Kalyan

Pawan Kalyan

ఎన్నికల కారణంగా సినిమాలను పక్కన పెట్టాడు పవన్‌ కళ్యాణ్‌. ప్రస్తుతం ఆయన చేతిలో `ఓజీ`, `హరిహరవీరమల్లు`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రాలున్నాయి. డిప్యూటీ సీఎం అయిన కారణంగా పవన్‌ బిజీగా ఉంటున్నాడు. త్వరలోనే ఆయన డేట్స్ అడ్జస్ట్ చేసుకుని షూటింగ్‌ల్లో పాల్గొనబోతున్నారట. కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు.

త్వరలోనే `హరిహర వీరమల్లు` షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీస్‌ని ఫినిష్‌ చేస్తారని సమాచారం. ఇవి పూర్తయిన తర్వాత సినిమాలు చేస్తాడా? మానేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image3
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved