అనసూయ ఇక ఆ హీరోని వదిలిపెట్టదా..తన పిల్లలకి ఎదురైన అవమానం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ
పండుగ వచ్చిందంటే బుల్లితెర సెలెబ్రిటీలు, యాంకర్లు, జబర్దస్త్ కమెడియన్లు కొత్త షోతో ముస్తాబై వచ్చేస్తారు. పండుగ సెలెబ్రేషన్స్ తో అదరగొడతారు. ఆటపాటలతో పాటు నవ్వించే స్కిట్స్ తో పెర్ఫామ్ చేస్తారు.
పండుగ వచ్చిందంటే బుల్లితెర సెలెబ్రిటీలు, యాంకర్లు, జబర్దస్త్ కమెడియన్లు కొత్త షోతో ముస్తాబై వచ్చేస్తారు. పండుగ సెలెబ్రేషన్స్ తో అదరగొడతారు. ఆటపాటలతో పాటు నవ్వించే స్కిట్స్ తో పెర్ఫామ్ చేస్తారు. ఈ దీపావళికి జబర్దస్త్ గ్యాంగ్, బుల్లితెర సెలెబ్రిటీలు 'ఈ దీపావళికి మోత మోగిపోద్ది' అనే ఈవెంట్ తో వచ్చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఈ షోలో మంచు లక్ష్మీ, అనసూయ లాంటి వారు అతిథులుగా పాల్గొన్నారు. ఎప్పటిలాగే హైపర్ ఆది, ఇమ్మాన్యూల్, ఆటో రాంప్రసాద్ తమ కామెడీతో సందడి చేశారు. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. పండుగ సెలెబ్రేషన్ ఒక ఊరేగింపులా గ్రాండ్ గా చేద్దాం అని పల్లవి ప్రశాంత్ అంటాడు. వెంటనే హైపర్ ఆది మాట్లాడుతూ.. ఒకసారి ఊరేగింపు చేస్తేనే అంత రచ్చ అయింది.. ఈ ఊరేగింపులు మనకెందుకురా బుజ్జి అంటూ సెటైర్ వేయడం నవ్వులు పూయించేలా ఉంది.
ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో పెద్దోడు పాత్రలో నటించిన ప్రసాద్ కూడా ఈ షోలో సందడి చేశాడు. ఇక్కడున్న అమ్మాయిలలో ప్రొపోజ్ చేయాలంటే ఎవరికి చేస్తావు అని శ్రీముఖి ప్రసాద్ ని అడిగింది. పొద్దున్న లేస్తే ఇంస్టాగ్రామ్లో అనసూయ వీడియోస్ చూస్తాను.. కాబట్టి ఆవిడకే ప్రొపోజ్ చేస్తాను అని షాకిచ్చాడు. దీనితో అనసూయ సిగ్గుపడిపోయింది. మోకాళ్లపై నిలబడి.. అనసూయగారు నాతో కాఫీ తాగడానికి డేట్ కి వస్తారా అని అడిగాడు.
మంచు లక్ష్మీ ఇంగ్లీష్ పై సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. దీనిపై చిన్న స్కిట్ చేశారు. మంచు లక్ష్మీ ఇంగ్లీష్ వల్ల ఆమె పిల్లలు స్కూల్ లో ఎలా అవమానాలకు గురవుతున్నారో స్కిట్ లో చూపించారు. అది చూసి మంచు లక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు.
అనసూయకి, విజయ్ దేవరకొండకి మధ్య విభేదాలు ఉన్నాయనేది వాస్తవం. ఎన్ని రోజులు గడిచినా ఆ వివాదానికి ముగింపు పడడం లేదు. ఈ షోలో కూడా శ్రీముఖి ఆ హీరో గురించి ప్రశ్నించింది. దీనితో అనసూయ తన వివరణ ఇచ్చారు. అనసూయ ఏం చెప్పింది అనేది కంప్లీట్ ఎపిసోడ్ లో తెలియనుంది. అక్టోబర్ 31న ఈ షో ప్రసారం కానుంది.