MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tolly wood: నెలరోజులు పస్తులుండి.. సూసైడ్‌ వరకు వెళ్లి.. బిగ్‌ హీరో అయిన సెలబ్రీటీ తెలుసా?

Tolly wood: నెలరోజులు పస్తులుండి.. సూసైడ్‌ వరకు వెళ్లి.. బిగ్‌ హీరో అయిన సెలబ్రీటీ తెలుసా?

Tolly wood: సినిమాల్లో అవకాశం రావాలంటే ఎంత టాలెంట్‌ ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ ఇవాళ్టి రోజుల్లో సోషల్‌ మీడియా ప్రభావం వల్ల సినిమా అవకాశాలు చాలా సులువుగా వస్తున్నాయి. కానీ ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ కాలాల్లో మూవీస్‌లో ఎలా అవకాశం వస్తుందో తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలిసేది కాదు.. స్టూడియోల చుట్టూ, నిర్మాత, దర్శకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ఆనాటి హీరోలు ఒక్క సినిమా అవకాశం కోసం ఎన్నో కష్టాలు, నిద్రలేని రాత్రులను గడిపారు. సరిగ్గా ఇలాంటి కష్టాలను ప్రస్తుతం అగ్రనాయకుడిగా పేరు తెచ్చుకున్న ఓ హీరో అనుభవించారు. సినిమా అవకాశాలు రాక.. నెలరోజులుగా పస్తులుండి.. జీవితం మీద విరక్తితో ఆఖరికి ఆత్మహత్య వరకు వెళ్లాడు ఆ హీరో.. కట్‌ చేస్తే అతని సినిమా ప్రతి ఇంట్లో ఆనందంగా నేడు చూస్తున్న పరిస్థితి ఎవరా హీరో తెలుసుకుందామా?   

3 Min read
Author : Bala Raju Telika
| Updated : Apr 13 2025, 11:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
rajendra prasad

rajendra prasad

హీరో, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ గురించి తెలియని వారు ఉండరు. ఆయన వెయ్యని వేషం లేదు. లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్, ఆ ఒక్కటి అడక్కు, అప్పు చేసి పప్పు కూడు, అప్పుల అప్పారావు వంటి కామెడి చిత్రాలు దూసుకుపోతుంటే రామానాయుడు జంధ్యాలను పెట్టి తీసిన ఆహనా పెళ్ళంట ఈ రోజుకీ ప్రతి ఇంట్లో నవ్వులు పూయిస్తూ.. రాజేంద్ర ప్రసాద్‌ కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ మూవీ. ఇప్పటికి ఆ సినిమా తరచూ యూట్యూబ్‌ ఇతర మాధ్యమాల్లో చూసేవారు ఉండటం విశేషం. ఇక మేడం అనే చిత్రంలో ఆడ వేషం వేయడంతోపాటు ఆయనే అమ్మాయిలాగా డబ్బింగ్ చెప్పి మరొక సంచలనం సృష్టించారు. రాజేంద్ర ప్రసాద్‌ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినీ కెరీర్‌ ఆరంభం, అనుభవాల గురించి వివరించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

హీరో రాజేంద్రప్రసాద్‌ది కృష్ణా జిల్లా నిమ్మకూరుట. సీనియర్‌ ఎన్టీఆర్‌ స్వగ్రామం కూడా అదేనంట. ఇక రామారావు రాజేంద్రప్రసాద్ వరుసకు మేమమామ అవుతారంట. అంతేకాదు.. రాజేంద్రప్రసాద్‌ ఇంట్లోనే ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కొన్నాళ్లు అద్దెకు ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే రాజేంద్ర ప్రసాద్‌ సినిమాల్లోకి రావడానికి ప్రేరణ మాత్రం ఎన్టీఆర్‌ అని చెబుతుంటారు. 

35

ఇక నటకిరీటి ఇంజనీరింగ్ పూర్తి చేసి.. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారంట. ఆ సమయంలో ఎన్టీఆర్‌ నటన చూసి సినిమాల పట్ల ఆకర్షణ మొదలై.. మద్రాస్ యాక్టింగ్ స్కూల్లో నటనలో శిక్షణ తీసుకున్నారంట. అదే స్కూల్‌లో తొలి బ్యాచ్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌,  రజనికాంత్, రెండో బ్యాచ్‌ రాజేంద్ర ప్రసాద్, మూడో బ్యాచ్‌ చిరంజీవి తదితరులు శిక్షణ పొందారంట. రాజేంద్ర ప్రసాద్‌ సీనియర్‌ కావడంతో అక్కడ మైమ్, మోనో, డ్యుయల్, డైలాగ్, డబ్బింగ్ ఇలా కొన్ని అంశాల మీద శిక్షణ తీసుకుని తనకంటే జూనియర్ అయిన చిరంజీవికి క్లాసెస్ చెప్పారంట. ఇక యాక్టింగ్‌లో ఇద్దరికీ కూడా ఏడాది మాత్రమే గ్యాప్‌ ఉంది. 

45

యాక్టింగ్‌ నేర్చుకున్న తర్వాత సినిమాల కోసం రాజేంద్ర ప్రసాద్‌ అనేక స్టూడియోలకు వెళ్లారంట. కానీ ఎక్కడ అవకాశాలు రాలేదట. అప్పటికే తెచ్చుకున్న డబ్బు అయిపోతుందని ఆందోళన, సినిమా అవకాశాలు రావడం లేదని బాధతో నిద్రలేని రాత్రులు గడిపినట్లు రాజేంద్రప్రసాద్‌ చెబుతున్నారు. కొన్నాళ్ళు అవకాశాలు రాకపోవడంతో ఇక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారంట.. ఒకరోజు ఆ విషయాన్నే పుండరీకాక్షయ్యతో చెప్పి.. తన జీవితం ముగిద్దాం అనుకున్నారట. దీంతోపాటు అప్పటికి నెల నుంచి ఒంటిపూట తింటూ అది కూడా అరటిపళ్లుతోనే కడుపు నింపుకున్నారంట. ఇక పుండరీకాక్షయ్య అదే సమయానికి ఏదో సినిమా డబ్బింగ్‌ గురించి చర్చ జరుగుతుండగా.. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్‌ వెళ్లారంట.. వెంటనే ఆయన రావయ్యా ప్రసాదు, ఈ డబ్బింగ్ నువ్వే చెప్పాలి అని ఒక అవకాశం ఇచ్చేశారంట. ఇక అక్కడి నుంచి మొదలు.. ఎడాపెడా కొత్తపాత అనే తేడా లేకుండా అందరికీ డబ్బింగ్ చెప్పుకుంటూ కేవలం డబ్బింగ్‌ వల్ల చెన్నైలో ఇల్లు కట్టేంత డబ్బు సంపాదించారట. 

 

55

ఇక సొంతూరికి రాజేంద్రప్రసాద్‌ ఒకసారి వచ్చిన సమయంలో ఎన్టీఆర్‌ కూడా ఆ గ్రామానికి వచ్చారని తెలుసుకుని వెళ్లి పెద్దాయన్ని కలిశారంట. ఏం ప్రసాద్ ఏం చేస్తున్నావ్‌ అని ఎన్టీఆర్‌ అడిగారంట. డబ్బింగ్ చెబుతున్నాను, హీరో అవుదాం అనుకుంటున్నట్లు నటకిరీటి అన్నారంట. వెంటనే ఎన్టీఆర్‌ గట్టిగా నవ్వి ఇప్పటికే చాలా మంది హీరోలు ఉన్నారు కదయ్యా, పౌరాణికాలకు నేను, ప్రేమ చిత్రాలకు నాగేశ్వరరావు, ఫైటింగులకు కృష్ణ, అందానికి శోభన్ బాబు ఉన్నారు కదా అన్నారంట. ఎవరి ప్రత్యేకత వారికి ఉంది, మరి నువ్వేం చేస్తావ్ అని అడగ్గా.. వెంటనే రాజేంద్రుడు టక్కున కామెడీ సినిమాలకు ఎవరూ లేరు అవి చేస్తానని అన్నారంట. సరే అయితే ప్రయత్నించి చూడు అని ఎన్టీఆర్‌ అన్నారంట. అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ కామెడీ పాత్రలను ఎంచుకుని అందరిలా నవ్వించడమే కాకుండా కామెడీ చేసే నటుడికి హీరో గుర్తింపు తీసుకొచ్చారు. అంతేకాదు క్విక్ గన్ మురుగన్ అనే సినిమాలో తెలుగు నుంచి మొదటి ఇంగ్లీష్ సినిమాలో నటించింది కూడా రాజేంద్రుడే కావడం విశేషం. ఇప్పటికీ విభిన్న పాత్రలతో ఆయన ప్రేక్షకులను మెప్పిస్తుండటం ప్రత్యేకం. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ
అక్కినేని నాగార్జున
దగ్గుబాటి వెంకటేష్
కృష్ణంరాజు
కృష్ణ ఘట్టమనేని
శోభన్ బాబు
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved