కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు ఆరోగ్యం బాగోలేదా..? వైరల్ న్యూస్ పై ఆయన ఏమన్నారంటే..?
ప్రముఖ కామెడీ స్టార్.. కామెడీ హీరో సంపూర్ణేష్ ఆరోగ్యం బాగోలేదా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులపై ఆయన ఏమని స్పందించారు..? ఏమని క్లారిటీ ఇచ్చారు.
sampoornesh babu
బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు సంపూర్ణేష్ బాబు. అప్పుడప్పుడు సినిమాలు చేసినా.. ఆయన ఇమేజ్ మాత్రం అలాగే ఉండిపోయింది. హీరోగా సినిమాలు చేస్తున్నా.. తన ఊరిలో సింపుల్ లైఫ్ గడిపేస్తూ ఉండే సంపూర్ణేష్ బాబుకు సబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Sampoornesh babu Accident
అప్పట్లో వరుస సినిమాలు చేసిన సంపూ.. ఈమధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సంపూర్ణేష్ బాబు సినిమాలకు దూరం కావడంతో ఈయన గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సంపూర్ణేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం ఇష్టం లేనటువంటి కొందరు ఆయనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు అంటూ కూడా ఒకానొక సందర్భంలో వార్తలు వచ్చాయి.
Sampoornesh Babu Burning Star
అంతే కాదు.. సంపూకి ఆరోగ్యం బాగోలేదని.. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అందుకే ఎలాంటి సినిమాలలో నటించలేదు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో అసలు ఏం జరుగుతుంది తన కెరీర్ లో.. అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు సంపూ.
సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈరోజు (అక్టోబర్ 27) విడుదల అయ్యింది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయనకు ఇవే ప్రశ్నలే ఎదురయ్యాయి.
Sampoornesh Babu
మీరు ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం మిమ్మల్ని ఇండస్ట్రీలో తొక్కేసే ప్రయత్నం చేశారంటూ వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం అనే ప్రశ్నించారు.ఈ ప్రశ్నలకు సంపూర్ణేష్ బాబు స్పందిస్తు నన్ను ఎవరు తొక్కేసే ప్రయత్నం చేయలేదని అలాగే నేను చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నానని తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఈయన తెలిపారు.
ఇక తాను మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో కూడా నటిస్తున్నానని మరో రెండు నెలల వ్యవధిలో ఈ రెండు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి అంటూ సంపూర్ణేష్ బాబు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హృదయ కాలేయం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు సంపూర్ణేష్ బాబు. మొదటి సినిమాతోనే తన కామెడీతో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు సంపూ.