అది ఆ కమెడియన్ రేంజ్.. స్టార్ హీరోలు కూడా తరలి వెళ్లారు, బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం సూపర్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇటీవల సూపర్ హిట్ గా నిలిచిన రజనీకాంత్ జైలర్ చిత్రంలో యోగిబాబు సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.
ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం సూపర్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇటీవల సూపర్ హిట్ గా నిలిచిన రజనీకాంత్ జైలర్ చిత్రంలో యోగిబాబు సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం యోగిబాబు మోస్ట్ వాంటెండ్ కమెడియన్ గా మారారు.
యోగిబాబు ప్రధాన పాత్రలో దర్శకనిర్మాతలు చిత్రాలు కూడా చేస్తుండడం విశేషం. అయితే తాజాగా యోగిబాబు తన ఇంట్లో తన ముద్దుల కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా సెలెబ్రేట్ చేశారు. సాధారణంగా కమెడియన్ ఇంట్లో వేడుక అంటే సెలెబ్రిటీలు చాలా తక్కువ మంది హాజరవుతారు.
కానీ యోగిబాబుకి ఉన్న క్రేజ్ వేరు. యోగిబాబు కుమార్తె పుట్టిన రోజుకు కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలంతా హాజరై సందడి చేశారు. స్టార్ హీరోలు, అప్ కమింగ్ హీరోలు, నటీమణులు, ఇతర ఆర్టిస్టులు యోగిబాబు కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరో సూర్య, కార్తీ, విశాల్, జయం రవి, విజయ్ సేతుపతి, నటి ఖుష్బూ దంపతులు, శింబు తండ్రి టి రాజేందర్, డైరెక్టర్ ఏఎల్ విజయ్ ఎలా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనితో యోగిబాబు కుమార్తె పుట్టిన రోజు వేడుక చాలా సందడిగా మారింది.
యోగిబాబుకి ప్రస్తుతం కోలీవుడ్ లో ఎంత డిమాండ్ ఉందో అదే స్థాయిలో విమర్శలు, వివాదాలు కూడా ఉన్నాయి. యోగిబాబు షూటింగ్స్ సరైన సమయానికి రారు అని.. కొన్నిసార్లు డుమ్మా కొడుతారు అని విమర్శించే నిర్మాతలు ఉన్నారు.
యోగిబాబు షూటింగ్స్ కి హాజరు కాకపోవడం వల్ల తమకి నష్టం వాటిల్లుతోంది అని ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ క్రమంలో కోలీవుడ్ నుంచి యోగిబాబుకి రెడ్ నోటీసులు కూడా అందినట్లు ప్రచారం జరిగింది.
అయితే యోగిబాబు షూటింగ్స్ కి హాజరు కారు అనేది గిట్టని వాళ్ళు చేసే ఆరోపణలు మాత్రమే అంటూ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తన కుటుంబ సభ్యులకు మెడికల్ ఎమెర్జన్సీ ఉన్నప్పటికీ యోగిబాబు ఆ కష్టాన్ని దిగమింగుతూ షూటింగ్స్ కి హాజరైన సందర్భాలు ఉన్నాయని వేణుగోపాల్ అన్నారు. నిర్మాతలకు నష్టం జరగకూడదు అని భావించే నటుడు యోగిబాబు అంటూ దర్శకుడు వేణుగోపాల్ ప్రశంసించారు.