హాస్పిటల్ బెడ్ పై యాదమ్మ రాజు, స్టార్ కమెడియన్ కు ఏమయ్యింది..?
సామాన్యుడి నుంచి స్టార్ కమెడియన్ గా మారాడు యాదమ్మ రాజు.. వెండితెరపై కమెడియన్ గా తన మార్క్ చూపించిన యాదమ్మ రాజు.. హాస్పిటల్ పాలు అయ్యాడు. ఇంతకీ ఆయనకు ఏమయ్యింది.
కామెన్ మెన్ నుంచి కమెడియన్ గా మారి.. స్టార్ ఇమేజ్ సాధించాడు యాదమ్మ రాజు. పటాస్ కామెడీ షో కామన్ ఆడియన్ గా వచ్చి.. సరదాగా చేసిన స్కిట్ రాు జీవితాన్నే మార్చేసింది. పటాస్ ద్వారా పరిచయమైన యాదమ్మ రాజు... తర్వాత వరుస ప్రోగ్రామ్స్ తో బుల్లితెర కామెడీ స్టార్ గా మారిపోయాడు. లేడీగెటప్ లు, తెలంగాణ యాసలో డైలాగ్స్ కు ఆయపెట్టింది పేరు. అమాయకంగా నటిస్తూనే పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు యాదమ్మ రాజు.
ప్రస్తుతం జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో తన కామెడితో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటు టెలివిజన్ షోలు చేస్తూ.. అటు సినిమా ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు యాదమ్మ రాజు. ఎప్పుడూ హుషారుగా.. జోరు చూపించే యాదమ్మ రాజు.. రీసెంట్ గా హాస్పిటల్ పాలు అయ్యాడు. తాజాగా యాదమ్మ రాజు ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన కాలుకు ఏమయ్యిందని రాజు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
ఇంతకీ రాజుకు ఏమయ్యిందంటే... ఆయన కాలుకు గాయం అయ్యింది. ఈ విషయం తెలిసి యాదమ్మ రాజు ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈ మధ్య వరకు బాగానే ఉన్నాడు.. సడెన్ గా కాలికి గాయం ఏంటీ అంటూ.. షాక్ తిన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో స్వయంగా యాదమ్మ రాజు ఇన్‌స్ట్రాగామ్ లో పోస్టు చేయడంతో ఏం జరిగిందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
యాదమ్మ రాజ్ పోస్ట్ చేసిన వీడియోలో కదల్లేకుండా ఉన్నాడు. పాదాలకు పెద్దగా కట్టుకొని ఉన్నాడు. మంచంపై నుంచి మెల్లిగా కాలు కిందకు పెట్టాడు. ఆ సమయంలో భార్య స్టెల్లా రాజును పట్టుకుని పైకి లేపి సహాయం చేస్తుంది. భర్తకు అతడికి తోడుగా ఉంది. ఈ మద్య కాలంలో ఏదైనా ప్రమాదం జరిగిందా? ఇంట్లో ఎక్కడైనా జారి పడ్డాడా? అనేది తెలియాల్సి ఉంది.
బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ గా యదలో ఒదిగే యదనే అనే పాట వస్తుంది. ఈ వీడియోని స్వయంగా యాదమ్మ రాజు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే తనకు ఏం జరిగింది? ఎలా జరిగింది? అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. ఒకవేళ కోలుకున్నాక అసలు విషయం బయటపెడతాడేమో చూడాలి.
య్యూటూబర్ స్టెల్లా రాజ్ ని గత ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో కామెడీ షోలు వచ్చాయి. అందులో జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ తర్వాత పటాస్ ప్రోగ్రామ్ బాగా అలరించింది. పటాస్ షో ద్వారా పరిచయం అయిన ఎంతోమంది ప్రస్తుతం స్టార్ కమెడియన్లుగా కొనసాగుతున్నారు.