- Home
- Entertainment
- సినిమాల్లోకి వేణు మాధవ్ కొడుకు, ఏం చేయబోతున్నాడు? స్టార్ కమెడియన్ ఫ్యామిలీ ఇప్పుడు ఏం చేస్తుంది?
సినిమాల్లోకి వేణు మాధవ్ కొడుకు, ఏం చేయబోతున్నాడు? స్టార్ కమెడియన్ ఫ్యామిలీ ఇప్పుడు ఏం చేస్తుంది?
వేణు మాధవ్ ఐదేళ్ల క్రితమే కన్నుమూశాడు. అయితే ఆయన ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉంది? పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం.

తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా రాణించారు వేణు మాధవ్. నల్లబాలు నల్లతాచు లెక్క అంటూ ఆయన చేసే కామెడీ వేరే లెవల్‌లో ఉంటుంది. చూడ్డానికి చిన్నగా ఉండి, పెద్ద స్థాయిలో హడావుడి చేయడం ఆయన ప్రత్యేకత. ఈక్రమంలో ఎదురుదెబ్బలు తిని నవ్వులు పూయించేవాడు. కామెడీని పంచడం కోసం తనని తాను తక్కువ చేసుకునే వాడు. అల్టీమేట్‌గా ఆడియెన్స్ కి మంచి వినోదాన్ని పంచి సక్సెస్ అయ్యారు వేణు మాధవ్.
`మాస్టర్` సినిమాతో బ్రేక్ అందుకున్నారు వేణు మాధవ్. `తొలి ప్రేమ`తో ఆయన స్టార్ కమెడియన్ అయిపోయారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. `లక్ష్మి`, `దిల్`, `సై` చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. హీరోకి ఫ్రెండ్ పాత్రలతో, హీరోని ఆటపట్టించి దొరికిపోయే పాత్రలతో ఆకట్టుకున్నాడు వేణు మాధవ్.
ముఖ్యంగా విలన్ల వద్ద ఎక్స్ ట్రాలు చేసి దొరికిపోవడం చాలా వరకు జరుగుతుంటుంది. దాదాదా ఇరవై ఏళ్లలో ఆయన ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఆద్యంతం నవ్వులు పూయించారు. కానీ ఉన్నట్టుండి సడెన్‌గా ఆయన ఆనారోగ్యానికి గురై ఐదేళ్ల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. కిడ్నీ, లివర్ సమస్యలతో ఆయన మరణించారు.
కోదాడకి చెందిన వేణు మాధవ్ అల్వాల్ ప్రాంతంలో ఉండేవారు. ఆయనకు భార్య శ్రీవాణి, కొడుకులు ప్రభాకర్, సవీకర్ ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారు? వాళ్ల పరిస్థితి ఎలా ఉందనేది చూస్తే, వేణు మాధవ్ చాలా వరకు దాన ధర్మాలు చేసేవాడు అంటారు. తన వద్దకు సాయం కోసం వచ్చిన వారిని కాదనకుండా ఇస్తారని అంటుంటారు.
అయితే ఎంత చేసినా తమ ఫ్యామిలీ కోసం కొంత వెనకేశారట. ఇళ్లు, ల్యాండ్‌లు ఉన్నాయట. వాటి ద్వారా ఇన్ కమ్ వస్తుందని తెలిపింది ఆయన భార్య శ్రీ వాణి. ఆయన తమ కోసం కూడా కొంత సేవ్ చేశాడని, ప్రాపర్టీస్ కొన్నాడని, అవే తమ జీవన ఆధారం అని తెలిపింది.
ఇక ఇద్దరు కొడుకులు ప్రభాకర్, సవీకర్‌లు ఇప్పుడు హైయ్యర్ స్టడీస్ చేస్తున్నారు. త్వరలోనే కెరీర్ పరంగా మరో దశకు వెళ్లబోతున్నారు. సవీకర్ ఇంటీరియర్ డిజైనర్ ని ఎంచుకున్నాడట. ఆ కోర్స్ నేర్చుకున్నాడట. దాన్నే తన కెరీర్‌గా ఎంచుకున్నాడట. ఆ దిశగా ఫోకస్ చేస్తున్నాడు.
మరోవైపు ప్రభాకర్ సినిమాల్లోకి రాబోతున్నాడట. డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఇందని, కథలు రాస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మైండ్‌లో ఉన్నాయని, వాటిని స్క్రిప్ట్ లుగా రాసి, ఇండస్ట్రీలోకి వస్తానని తెలిపారు. త్రివిక్రమ్ అంటే ఇష్టమని, ఆయన వద్ద పనిచేయాలనుకుంటున్నట్టు తెలిపాడు ప్రభాకర్.
సాధారణంగా చిన్న చిన్న ఆర్టిస్టులు మరణిస్తే వారి ఫ్యామిలీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. వచ్చిన వాటిని పోగు చేసుకుని లైఫ్ ని సెట్ చేసుకునే వాళ్లు తక్కువగానే ఉంటారు. కానీ వేణు మాధవ్ మాత్రం ఎంత ఖర్చులున్నా, ఫ్యామిలీ విషయంలోనే ముందు నుంచి జాగ్రత్తగానే ఉన్నాడట.
అలా అదే ఇప్పుడు ఫ్యామిలీ రిలాక్స్ గా ఉండేలా చేసిందని, ఆయన వల్లే తాము ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉన్నామని చెప్పింది ఆయన భార్య శ్రీవాణి. వేణు మాధవ్ చివరగా `రుద్రమదేవి` సినిమాలో మెరిశాడు.
read more:షూటింగ్ ప్రారంభమై ఆగిపోయిన సౌందర్య, వెంకటేష్‌ల సినిమా ఏంటో తెలుసా? కారణం ఎవరు? అసలేం జరిగిందంటే
also read: `ఫీయర్` మూవీ రివ్యూ, రేటింగ్.. వేదిక భయపెట్టిందా?