అవును రెమ్యునరేషన్ పెంచాను, నేను బ్రతకొద్దా.. సుహాస్ షాకింగ్ కామెంట్స్..
తను రెమ్యునరేషన్ పెంచిన విషయంపై కాస్త ఘాటుగానే స్పందించాడు టాలీవుడ్ హీరో కమ్ కమెడియన్ సుహాస్. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సుహాస్ ఏమన్నాడంటే..?

ఇండస్ట్రీలోకి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన సుహాస్. తన ఆటీట్యూడ్ తో, యాక్టింగ్ తో కట్టిపడేస్తున్నాడు. హీరోగా వచ్చిన ఒక్క అవకాశాలన్ని కరెక్ట్ గా ఉపమోగించుకున్న సుహాస్.. అంచలంచెలుగా ఎదుగుతున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు సుహాస్.
హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేతిలో చాలా సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి సుహాస్ కి. ఇటీవల అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు సుహాస్. ఇక త్వరలో ప్రసన్న వదనం సినిమాతో రాబోతున్నాడు. అయితే వెరీరీసెంట్ .. తన కొత్త సినిమా ప్రసన్న వదనం టీజర్ రిలీజయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో మీడియాతో సరదాగా ముచ్చటించాడు సుహాస్.
కొంత మంది మీడియా వారు అడిగిన ప్రశ్నలకు స్టైయిట్ గాసమాధానం చెప్పారు సుహాస్. అయితే ఒక విలేకరి ప్రశ్నిస్తూ.. తన రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇటీవల వరుస సక్సెస్ లు వస్తుండటంతో రెమ్యునరేషన్ పెంచారని వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడిగారు. దీనికి సుహాస్ సమాధానమిస్తూ.. అవును పెంచాను. ఏ నేను బతకొద్దా..? అని ముఖం మీదే ప్రశ్నించారు.
Writer Padhmabushan Review
నేను జూనియర్ ఆర్టిస్ట్ గా రోజుకు 100 రూపాయలు తీసుకునే దగ్గర్నుంచి ఇప్పుడు హీరోగా కష్టపడి ఎదిగాను, ప్రతీ మెట్టులో నా కష్టం దాగి ఉంది. అలాంటిప్పుడు రెమ్యునరేషన్ పెంచడంలో తప్పులేదు అని అన్నారు. అంతటితో ఆగలేదు.. మీరుు 3000 నుంచి 3 కోట్ల వరకు ఎదిగారు అని టాక్ వినిపిస్తుంది ఇందులో నిజం ఎంతా అని మరొకరు అడగ్గా.. సుహాస్ ఈ ప్రశ్నకు కూడా డిఫరెంట్ గా సమాధానం ఇచ్చారు... 1000 రూపాయల నుంచి 3 కోట్లు అనుకో.. అన్నారు.. కాని అసలు తాను మరీ అంత తీసుకోవట్లేదు అన్నారు.
అయితే సుహాస్ మాటలను బట్టి ఆయన రెమ్యునరేషన్ నిజంగానే పెంచారని తెలుస్తోంది. అయితే సినిమాకు సుహాస్ కోటి పైనే సుహాస్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఇండస్ట్రీలో 150 కోట్లకు పైగా తీసుకునే వారు ఉన్నారు.. కోటి రెండు కోట్లకు ఇంత సీన్ ఎందుకు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. కష్టపడి పైకి వచ్చి, సక్సెస్ లు కొట్టేవాళ్ళు ఆమత్రం తీసుకోకూడదా అని అంటున్నారు.