MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్షమించాలి ఆపుకోలేక అడిగేస్తున్నా... అనసూయకు రాహుల్ రామకృష్ణ సూటి ప్రశ్న!

క్షమించాలి ఆపుకోలేక అడిగేస్తున్నా... అనసూయకు రాహుల్ రామకృష్ణ సూటి ప్రశ్న!

అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో మధ్యలో రాహుల్ రామకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. ఆమెను సూటిగా ఓ ప్రశ్న అడిగారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 11 2023, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఫైర్ బ్రాండ్ అనసూయ అసలు తగ్గడం లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సై అంటే సై అంటుంది. మాటకు మాట, కౌంటర్ కి కౌంటర్ ఇచ్చేస్తుంది. నిన్న సోషల్ మీడియా వేదికగా రెండు పోస్ట్స్ పెట్టారు. ఓ వీడియో బైట్ విడుదల చేసిన అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని చేతకాని వాళ్ళు, అదుపు తప్పారని తిట్టిపోశారు. మీడియాకు ధైర్యం ఉంటే నిజాలు రాయాలంటూ మండిపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


అలాగే ఓ ట్వీట్ చేశారు. నన్ను తిడితే మీ నోళ్లు కంపు అవుతాయి. నాకు ఏమీ కాదు. నాది గొప్ప పెంపకం. ఏదైనా ధైర్యంగా మాట్లాడతాను. మీ పెంపకం ఎలాంటిదో మీరే తెలుసుకోండి. తిట్టే వాళ్ళు సిగ్గుపడాలి, తిట్టించుకున్న వాళ్ళు కాదు,  అని కామెంట్ చేశారు. అనసూయ ట్వీట్ కి నటుడు రాహుల్ రామకృష్ణ స్పందించారు. 
 

36


ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఇంతకీ ఈ గొడవేంటి? అని అనసూయ పోస్ట్ క్రింద కామెంట్ పెట్టాడు. ఇవ్వన్నీ మీరు ఎందుకు చేస్తున్నారని రాహుల్ రామకృష్ణ నేరుగా అనసూయను ప్రశ్నించారు. రాహుల్ రామకృష్ణ కామెంట్ వైరల్ గా మారింది. 
 

46


అయితే రాహుల్ రామకృష్ణ ప్రశ్నకు అనసూయ ఇంకా స్పందించలేదు. సాధారణంగా వెంటనే ఆమె రిప్లై ఇస్తుంది. కారణం తెలియదు కానీ... రాహుల్ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. ఫైర్ బ్రాండ్ అనసూయ ప్రముఖ నటుడు అడిగిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలని నెటిజెన్స్ ఆతృతగా ఎదురుచుస్తున్నారు. 

56


రాహుల్ రామకృష్ణ-విజయ్ దేవరకొండ మంచి ఫ్రెండ్స్. ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటి నుండి పరిచయం ఉంది. వీరిద్దరికీ ఫేమ్ తెచ్చిన మూవీ అర్జున్ రెడ్డి. రాహుల్ రామకృష్ణ ఆ చిత్రంలో విజయ్ ఫ్రెండ్ రోల్ చేశారు. రాహుల్ రామకృష్ణ రోల్ చాలా సహజంగా ఉంటుంది. అలాగే మంచి కామెడీ పంచుతుంది. 
 

66


తన ఫ్రెండ్ మీద అనసూయ సెటైర్స్ వేస్తున్న క్రమంలో రాహుల్ రామకృష్ణ కల్పించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. హీరో విజయ్ దేవరకొండ పేరు ముందు "The' అని పెట్టడాన్ని అనసూయ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఖుషి చిత్ర పోస్టర్స్ లో ది విజయ్ దేవరకొండ అని రాసిన నేపథ్యంలో అనసూయ స్పందించారు. పరోక్షంగా సెటైర్స్ వేశారు. దాంతో వివాదం రాజుకుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఆంటీ అంటూ సోషల్ మీడియా వేదికగా వేధింపులకు దిగారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani Festive Looks: పండగకి మెరిసిపోవాలా? కియారా బ్లింగ్ ఐడియాలు అదుర్స్..
Recommended image2
Sumanth: ఏఎన్నార్ నాస్తికుడు.. మరి ఆయన మనవడు సుమంత్ దేవుడిని నమ్ముతాడా?
Recommended image3
Agadha Trailer Review: గూస్‌ బంమ్స్ తెప్పించేలా అగధ ట్రైలర్‌.. ఎంఎస్‌ రాజు కమ్‌ బ్యాక్‌ పక్కా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved