- Home
- Entertainment
- తనని తిట్టిన కమెడియన్ కి మూవీలో ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రియాక్షన్
తనని తిట్టిన కమెడియన్ కి మూవీలో ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రియాక్షన్
తాను చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిత్రం లో నటించడం జరిగింది అని కమెడియన్ పృథ్వీ అన్నారు. అంతకు ముందు అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల్లో నటించాను.

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కమెడియన్ గా పృథ్వీ బాగా పాపులర్ అయ్యారు. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి. 2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు. ప్రచారం కోసం రాష్ట్రం మొత్తం తిరిగారు. ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు.
కానీ మహిళతో పృథ్వి జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడం, లైంగిక పరమైన వివాదంలో పృథ్వీ చిక్కుకోవడం అతడికి సమస్యలు తెచ్చిపెట్టింది. చైర్మన్ పదవిని కుఆ పృథ్వీ కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో పృథ్వీ జనసేన పార్టీకి మద్దతుదారుడిగా మారారు
మెగా బ్రదర్ నాగబాబు అండతో కమెడియన్ పృథ్వీ జనసేన పార్టీకి చేరువైనట్లు తెలుస్తోంది. తరచుగా పృథ్వీ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గురించి కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రాబోవు రోజుల్లో జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉంటానని అంటున్నారు. అయితే కమెడియన్ పృథ్వీ తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం 'కొత్త రంగుల ప్రపంచం'. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పృథ్వీ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాను చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిత్రం లో నటించడం జరిగింది అని కమెడియన్ పృథ్వీ అన్నారు. అంతకు ముందు అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల్లో నటించాను. చాలా రోజుల తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ గారి చిత్రంలో అవకాశం వచ్చింది అని పృథ్వీ అన్నారు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలసి నటిస్తున్న చిత్రంలో పృథ్వీ కూడా నటించారు.
అంతకు ముందు పవన్ ని, జనసేనాని తిట్టారు కాదు. పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ నటిస్తునపుడు ఆయన ఏమైనా కాట్లాడరా అని యాంకర్ ప్రశ్నించారు. అలాంటిదేమి లేదు.. ఆయన ఒక యోగి.. ఇలాంటి విషయాలు పట్టించుకోరు. నేను కలిసినప్పుడు దాదాపు 45 నిమిషాలు జీవితం గురించి మాట్లాడారు.
ప్రపంచాన్ని చదివిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో లక్షల మందితో కదలి వెళ్లడం చూశాం. కానీ సెట్స్ లో సామాన్యుడిలాగా మాతో మాట్లాడారు. అంత క్రేజ్ ఉండే వ్యక్తి ఏంటి ఇలా అని ఆశ్చర్యపోయాం. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు యోగి అని తెలిసింది. హ్యూమన్ రిలేషన్ ఉన్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. నన్ను ట్రోల్ చేసినా పర్వాలేదు.. ఇది వాస్తవం అని పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త రంగుల ప్రపంచం చిత్రంలో పృథ్వీ కుమార్తె శ్రీలు హీరోయిన్ గా నటిస్తోంది.