- Home
- Entertainment
- మా నాన్న రాజకీయం నాకు నచ్చదు..హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ కమెడియన్ పృథ్వీ కుమార్తె కామెంట్స్
మా నాన్న రాజకీయం నాకు నచ్చదు..హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ కమెడియన్ పృథ్వీ కుమార్తె కామెంట్స్
30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కమెడియన్ గా పృథ్వీ బాగా పాపులర్ అయ్యారు. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి.

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కమెడియన్ గా పృథ్వీ బాగా పాపులర్ అయ్యారు. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి. 2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు. ప్రచారం కోసం రాష్ట్రం మొత్తం తిరిగారు. ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు.
కానీ మహిళతో పృథ్వి జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడం, లైంగిక పరమైన వివాదంలో పృథ్వీ చిక్కుకోవడం అతడికి సమస్యలు తెచ్చిపెట్టింది. చైర్మన్ పదవిని కుఆ పృథ్వీ కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో పృథ్వీ జనసేన పార్టీకి మద్దతుదారుడిగా మారారు
మునుపటిలా పృథ్వీ కమెడియన్ గా యాక్టివ్ గా రోల్స్ రావడం లేదనే చెప్పాలి. కమెడియన్ పృథ్వీ డైరెక్టర్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నారు. హీరో క్రాంతి ప్రధాన పాత్రలో పృథ్వీ 'కొత్త రంగుల ప్రపంచం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో పృథ్వీ కుమార్తె శ్రీలు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
తాజాగా ఇంటర్వ్యూలో శ్రీలు తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాన్న ఓ చిత్రం డైరెక్ట్ చేయబోతున్నారని నాకు తెలియదు. ముందుగా హీరో క్రాంతిని సెలెక్ట్ చేసిన తర్వాతే నన్ను ఎంపిక చేశారు. ఆయన కుమార్తెగా నాకు ఈ అవకాశం ఇవ్వలేదు. ఆ పాత్రకు నేను సరిపోతానని నాన్నకి నమ్మకం కుదిరిన తర్వాతే నన్ను తీసుకున్నారు.
ఒక నటుడిగా నాన్నని ఎంతో ఇష్టపడతా. ఆయన పాత్రలని చాలాసార్లు ఎంజాయ్ చేశా. కానీ నాన్న చేసే రాజకీయం నాకు నచ్చదు. నాన్నకి పాలిటిక్స్ వద్దని చెప్పలేను. ఎందుకంటే పాలిటిక్స్ నాన్నకి ఇష్టం అని శ్రీలు కామెంట్ చేసింది.
ఇండస్ట్రీలో నీ ముందు వెనుక చాలా జరుగుతుంటాయి. అవేమి పట్టించుకోవద్దు.. నీ పని నువ్వు చేసుకో అని నాన్న నాకు సలహా ఇచ్చారు. ఇండస్ట్రీలో ఆయనే నాకు ఇన్సిపిరేషన్ అని శ్రీలు తెలిపింది. కమెడియన్ కుమార్తె హీరోయిన్ కావడం చాలా అరుదు. మరి శ్రీలు టాలీవుడ్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.