- Home
- Entertainment
- Comedian Prudhvi : ఎంత పని చేశావు పృథ్వీ.. నేను చూసి ఉంటే ఏం జరిగేదో తెలుసా, సారీ చెప్పిన విశ్వక్ సేన్
Comedian Prudhvi : ఎంత పని చేశావు పృథ్వీ.. నేను చూసి ఉంటే ఏం జరిగేదో తెలుసా, సారీ చెప్పిన విశ్వక్ సేన్
Comedian Prudhvi controversy: ఇటీవల కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా వివాదాలకు కారణం అవుతున్నాయి. ఈవెంట్ కి వచ్చిన అతిథులు ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం.. అది వివాదంగా మారడం కామన్ అయిపోయింది. కాకపోతే ఆ వివాదాల వల్ల చిత్ర యూనిట్ కి సమస్యలు ఎదురవుతుంటాయి.

Comedian Prudhvi, Vishwak Sen
Comedian Prudhvi controversy: ఇటీవల కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా వివాదాలకు కారణం అవుతున్నాయి. ఈవెంట్ కి వచ్చిన అతిథులు ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం.. అది వివాదంగా మారడం కామన్ అయిపోయింది. కాకపోతే ఆ వివాదాల వల్ల చిత్ర యూనిట్ కి సమస్యలు ఎదురవుతుంటాయి. తాజాగా విశ్వక్ సేన్ పరిస్థితి కూడా అంతే. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విశ్వక్ సేన్ నటించిన లైలా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
Vishwak Sen
ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో పొలిటికల్ కామెంట్స్ కూడా పడుతుంటాయి. అయితే కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు మాత్రం లైలా చిత్ర యూనిట్ కి పెద్ద సమస్య తీసుకునివచ్చాయి. పృథ్వీ పరోక్షంగా వైసిపిని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశార. సినిమా ప్రారంభంలో 150 గొర్రెలు ఉండేవి చివరికి 11 మిగిలాయి అని కామెంట్స్ చేశారు. ఇది వైసిపి పార్టీపై వేసిన సెటైర్లు. పృథ్వీ కామెంట్స్ తో ఒక్కసారిగా వైసిపి సోషల్ మీడియా భగ్గుమంది. బాయ్ కాట్ లైలా అంటూ వేలకొద్దీ ట్వీట్స్ తో నెగిటివ్ ట్రెండ్ మొదలు పెట్టారు.
వివాదం పెద్దది అవుతుండడంతో స్వయంగా విశ్వక్ సేన్, నిర్మాత సాహు రంగంలోకి దిగి క్షమాపణ చెప్పారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు తమకి సంబంధం లేదు అని విశ్వక్ సేన్ తెలిపారు. అయినప్పటికీ మా సినిమా ఈవెంట్ లో చేశారు కాబట్టి నేను క్షమాపణ కోరుతున్నా. పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం. నన్ను నా సినిమా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. కష్టపడి సినిమా చేశాం. దానిని చంపేయొద్దు.
పృథ్వీ వ్యాఖ్యలు మా కంట్రోల్ లో లేకుండా పోయాయి. పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు చిరంజీవిగారు వచ్చారు. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. అంతలోపు ఇది జరిగింది. ఒకవేళ నేను చూసి ఉంటే వెంటనే మైక్ లాక్కునేవాడిని అని విశ్వక్ సేన్ తెలిపారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించండి. ఎవరో చేసిన తప్పుకి మమ్మల్ని బలిచేయొద్దు అని కోరారు.