గబ్బర్ సింగ్ చిత్రానికి అవార్డు వచ్చింది కానీ తీసుకోలేదు, కమెడియన్ ప్రభాస్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. దీనితో అభిమానులు గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తూ థియేటర్స్ లో గోల గోల చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు.
దీనితో అభిమానులు గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తూ థియేటర్స్ లో గోల గోల చేస్తున్నారు. ఈ చిత్రం గురించి కమెడియన్ ప్రభాస్ శ్రీను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గబ్బర్ సింగ్ చిత్రంలో ప్రభాస్ శ్రీను నటించారు. ప్రభాస్ శ్రీను, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాయి.
ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారితో నటించడం ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే.. ఆ చిత్రానికి నాకు బెస్ట్ కమెడియన్ గా అవార్డు రావడం మరో అనుభూతి. నా కెరీర్ లో వచ్చిన ఏకైక అవార్డు అదే. బెస్ట్ కమెడియన్ గా సైమా అవార్డు వచ్చింది.
Pawan Kalyan
ముందుగా నేను నామినేట్ అయినప్పుడు నాతో పటు బ్రహ్మానందం గారు కూడా నామినేషన్ లో ఉన్నారు. బ్రహ్మానందం గారిని దాటుకుని మనకెందుకు వస్తుంది లే అని లైట్ తీసుకున్నా. కానీ ఒక రోజు సైమా వాళ్ళు ఫోన్ చేసి బెస్ట్ కమెడియన్ గా గబ్బర్ సింగ్ చిత్రానికి మీకు అవార్డు వచ్చింది అని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ అవార్డు నేను తీసుకోలేదు.
Pawan Kalyan
ఆ టైంలో బిజీగా ఉండడం వల్ల సైమా ఫంక్షన్ కి హాజరు కాలేదు. దీనితో నా తరుపున శృతి హాసన్ తీసుకున్నారు అని ప్రభాస్ శ్రీను తెలిపారు. పవన్ కళ్యాణ్ గారితో పొలాచ్చిలో జరిగిన షూటింగ్ మరచిపోలేము అని ప్రభాస్ శ్రీను తెలిపారు. అంత్యాక్షరి సీన్, కబడ్డీ సీన్ ని ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కామెడీ చేస్తుంటే నిజంగానే నవ్వేశారు. ఆయన జెన్యూన్ స్మైల్ ని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది.
Pawan Kalyan
కబడ్డీ సీన్ లో కేవలం సైలెంట్ గా నటించడమే అనుకున్నా. కానీ చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఇదేంటి అని హరీష్ శంకర్ ని అడిగితే నీ మీదే రాశాం ఈ సీన్ ని.. బాగా చేయాలి అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తూ నటించడానికి కాస్త ఇబ్బంది పడ్డా. కానీ సక్సెస్ ఫుల్ గా నటించా. కళ్యాణ్ గారు కూడా మెచ్చుకున్నారు అని ప్రభాస్ శ్రీను తెలిపారు.