MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Babu Mohan: చిరు అన్న అంటే అందుకే నాకు ఇష్టం, ఇద్దరినీ కూర్చోబెట్టి రిక్వస్ట్ చేశారు..దెబ్బకి మైండ్ పోయింది

Babu Mohan: చిరు అన్న అంటే అందుకే నాకు ఇష్టం, ఇద్దరినీ కూర్చోబెట్టి రిక్వస్ట్ చేశారు..దెబ్బకి మైండ్ పోయింది

చిరంజీవిపై బాబు మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో చిరంజీవి అంతటి వ్యక్తి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు అని బాబు మోహన్ అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 02 2026, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

సినిమా పట్ల చిరంజీవికి డెడికేషన్, క్రమశిక్షణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కోసం చిరంజీవి ఎంత కష్టానికైనా వెనుకాడరు. కెరీర్ బిగినింగ్ నుంచి తన ట్యాలెంట్ నిరూపించుకుంటూ కష్టపడ్డారు కాబట్టే చిరంజీవి టాలీవుడ్ లో నెంబర్ 1 గా దశాబ్దాల పాటు కొనసాగారు. చిరంజీవి గురించి ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ బాబు మోహన్ ఆసక్తికర సంఘటనని పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి మా కోసం ఎదురు చూశారు
Image Credit : Asianet News

చిరంజీవి మా కోసం ఎదురు చూశారు

చిరంజీవి గారికి అస్సలు కోపం అనేది రాదు. చిరంజీవి గారిని నేను ముద్దుగా చిరన్న పిలిస్తా. ముఠామేస్త్రి సినిమా సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. నేను, బ్రహ్మి, చిరన్న కాంబోలో సన్నివేశాలు ఉన్నాయి. కానీ మా ముగ్గురి డేట్లు ఒకేసారి కుదరడం లేదు. నేను రోజుకు ఆరు షిఫ్ట్స్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాను. బ్రహ్మానందం కూడా బిజీగా ఉన్నారు. దీనితో మా ఇద్దరి డేట్లు ఒకేసారి కుదిరితే షూటింగ్ పూర్తి చేయాలని చిరంజీవి గారు వెయిట్ చేస్తున్నారు.

Related Articles

Related image1
Jacqueline Fernandez: సుఖేష్ కేసులో జాక్వెలిన్‌కు బిగ్ షాక్.. ఛార్జ్‌షీట్ దాఖలుకు కోర్టు ఆదేశం
Related image2
Aamani: హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు..అడ్వాన్స్ తీసుకుంటే ఫైనాన్షియర్ దగ్గరకు కూడా వెళ్ళాలి
35
కమెడియన్స్ ని రిక్వస్ట్ చేసిన చిరు
Image Credit : our own

కమెడియన్స్ ని రిక్వస్ట్ చేసిన చిరు

రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కానీ.. మా డేట్లు అడ్జెస్ట్ కావడం లేదు. దీనితో చిరంజీవి గారు మా ఇద్దరినీ ఒక రోజు పిలిచారు. ఇద్దరినీ కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేశారు. ఒక రెండు గంటలు మీరిద్దరూ టైం అడ్జెస్ట్ చేస్తే షూటింగ్ పూర్తి చేద్దాం అని అన్నారు. మీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పండి అని అడిగారు. మేము బిజీగా ఉండడంతో ఎప్పుడు టైం ఇవ్వాలి అనేది అర్థం కాలేదు. దీనితో చిరన్నకి చిన్నపాటి అసహనం కలిగింది.

45
చిరంజీవికి చిరాకు తెప్పించారు
Image Credit : Asianet News

చిరంజీవికి చిరాకు తెప్పించారు

సరే కనీసం ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో టైం ఇస్తారా అని అడిగారు నేను ఆశ్చర్యపోయా. ఏంటి చిరంజీవి గారు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు షూటింగ్ కి రాగలరా అనే డౌట్ వచ్చింది. లేదు చిరన్న ఎర్లీ మార్నింగ్ మీకు ఇబ్బంది అవుతుందేమో ఇంకో డేట్ చూసుకుందాం అని అడిగా. లేదు బాబు మోహన్ నేనేం ఫీల్ కావట్లేదు. ఆ టైం నాకు ఓకె ఎలాంటి ఇబ్బంది లేదు అని అన్నారు.

55
చిరంజీవి గారికి అక్కడ చూసి మైండ్ పోయింది
Image Credit : Asianet News

చిరంజీవి గారికి అక్కడ చూసి మైండ్ పోయింది

నాకు ఆ రోజు కూడా వరుసగా షూటింగ్స్ ఉన్నాయి. ముఠామేస్త్రి షూటింగ్ కి కాస్త ముందుగా వెళ్లి అక్కడ చెట్టు పక్కన కాసేపు పడుకుందాం అని అనుకున్నా. చిరంజీవి గారు ఎలాగూ 4 గంటలకు రాలేరు. చిరన్న 4 గంటలకు ఎందుకు వస్తారు ఆలస్యం అవుతుందిలే. కాసేపు పడుకోవచ్చు అనుకున్నా. షూటింగ్ లొకేషన్ కి వెళ్లేసరికి మా అందరికంటే ముందే చిరన్న వచ్చి కాలుమీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నారు. నా మైండ్ పోయింది. మరోవైపు నుంచి బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వుతూ నేను ఆలస్యంగా వస్తానని అనుకున్నారా అని అన్నారు. అందుకే చిరన్న అంటే నాకు ఇష్టం. చిరంజీవి గారి క్రమశిక్షణ ఆ విధంగా ఉంటుంది అని బాబు మోహన్ ప్రశంసించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Recommended image2
Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్
Recommended image3
మ‌రో సెన్సేష‌న్ సాంగ్ లోడింగ్‌.. ఇక‌పై ప్ర‌తీ పెళ్లి బ‌రాత్‌లో ఈ పాట ఉండాల్సిందే, సౌండ్ ల‌గారే అనాల్సిందే
Related Stories
Recommended image1
Jacqueline Fernandez: సుఖేష్ కేసులో జాక్వెలిన్‌కు బిగ్ షాక్.. ఛార్జ్‌షీట్ దాఖలుకు కోర్టు ఆదేశం
Recommended image2
Aamani: హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు..అడ్వాన్స్ తీసుకుంటే ఫైనాన్షియర్ దగ్గరకు కూడా వెళ్ళాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved