MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా? తాజా పరిణామాలతో మరోసారి తెరపైకి!

మంచు బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా? తాజా పరిణామాలతో మరోసారి తెరపైకి!

మంచు బ్రదర్స్ విష్ణు-మనోజ్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుందని సోషల్ మీడియా టాక్. తాజా పరిణామాలతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 09 2024, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Manchu Vishnu

Manchu Vishnu


నటుడు మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ మధ్య వివాదాలు తలెత్తాయనే వాదన చాలా కాలంగా ఉంది. మనోజ్ ఆ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయాడు. చెన్నైలో మౌనికతో పాటు కొన్నాళ్ళు రహస్యంగా ఉన్నట్లు మనోజ్ ఓ షోలో స్వయంగా వెల్లడించారు.  భూమా మౌనిక రెడ్డిను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు, విష్ణుకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


మనోజ్ వివాహాన్ని అక్క మంచు లక్ష్మి దగ్గరుండి జరిపించింది. 2023 మార్చి నెలలో మౌనిక-మనోజ్ పెళ్లి చేసుకున్నారు. మంచు లక్ష్మి నివాసంలో ఈ పెళ్లి జరగ్గా... విష్ణు హాజరయ్యారు. అయితే ఆయన వెంటనే వెళ్లిపోయారని సమాచారం. మోహన్ బాబు సైతం చివరి నిమిషంలో వచ్చాడు. నూతన దంపతులను ఆశీర్వదించాడు. 
 

38

మనోజ్ వివాహం అనంతరం విష్ణు తన మనుషులపై దాడి చేస్తున్నాడని మనోజ్ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది క్షణాల్లో వైరల్ అయింది. మంచు బ్రదర్స్ మధ్య విబేధాల పుకార్లకు ఆ వీడియో బలం చేకూర్చింది. మనోజ్ వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. 

48

ఆ వీడియో ఓ గేమ్ షోలో భాగం, ఫ్రాంక్ అని మంచు విష్ణు తెలియజేశాడు. ఈ సంఘటన  జరిగి ఏడాది గడుస్తున్నా మంచు బ్రదర్స్ మధ్య ఏర్పడిన విబేధాలు సమసిపోలేదని సోషల్ మీడియా టాక్. మంచు మనోజ్ కి ఇటీవల అమ్మాయి పుట్టింది. ఆ పాపకు బారసాల నిర్వహించారు. 'దేవసేన శోభ ఎంఎం' అని నామకరణం చేశారు. 

58

ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులైన మోహన్ బాబు, నిర్మల, మంచు లక్ష్మికి మనోజ్ కృతజ్ఞతలు తెలిపాడు. విష్ణు పేరును మాత్రం విస్మరించాడు. సోషల్ మీడియా నోట్ లో విష్ణు ప్రస్తావన లేదు. కావాలనే మనోజ్ అన్నయ్య విష్ణు పేరు పొందుపరచలేదని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

68

అలాగే ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి చైల్డ్ అబ్యూస్ కి పాల్పడ్డాడు. దీని మీద సాయి ధరమ్ తేజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్ సైతం ప్రణీత్ హనుమంతు చర్యను ఖండిస్తూ ట్వీట్ చేశాడు. సాయి ధరమ్ ని బ్రదర్ అంటూ మెచ్చుకున్న మంచు విష్ణు, మనోజ్ ట్వీట్ పై స్పందించలేదు.

78
Manchu Vishnu

Manchu Vishnu


ఈ పరిణామాలు గమనించిన టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. మనస్పర్థలు అలానే ఉన్నాయని అంటున్నారు. అయితే ఇవన్నీ అపోహలు మాత్రమే. ప్రచారం జరుగుతున్నట్లు మంచు బ్రదర్స్ విడిపోలేదు. తమ తమ పనుల్లో బిజీగా ఉంటున్నారని, అందుకే కలవడం లేదంటున్నారు సన్నిహితులు. 

 

88


మంచు లక్ష్మి సైతం హైదరాబాద్ లో లేరు. ఆమె కెరీర్ కోసం ముంబై వెళ్లారు. ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నారు. ఇక మంచు విష్ణు తన కొత్త మూవీ కన్నప్ప మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. వాట్ ది ఫిష్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నట్లు సమాచారం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మంచు మనోజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Recommended image2
Ramba Oorvasi Menaka 4 Days Collections: రంభ ఊర్వశి మేనక సోమవారం కలెక్షన్లు.. అల్లరి నరేష్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి జడ్జిమెంట్ రాంగ్ అని నిరూపించిన అసిస్టెంట్.. జేబులో ఉన్న 10 వేలు ఇచ్చేసిన మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved