MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సీఎం రేవంత్ రెడ్డి భారీ షాక్!

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సీఎం రేవంత్ రెడ్డి భారీ షాక్!

అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి సర్కారు కుట్రపూరితంగా ఇరికించింది అంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అల్లు అర్జున్ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ పోస్టులు పెట్టగా, వారిపై చర్యలు తీసుకుంటున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 18 2024, 10:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరచారు. తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పేరు ఆయనకు టక్కున గుర్తుకు రాలేదు. ఈ పరిణామం సీఎం రేవంత్ రెడ్డి ఇగోని హర్ట్ చేసింది. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ కి తెరలేపారంటూ..  అభిమానులు కామెంట్స్ పోస్ట్స్ పెట్టారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు. అందుకే శుక్రవారం అరెస్ట్ చేయించారనే వాదన గట్టిగా వినిపించింది. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ, కించపరుస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పోస్ట్స్ పై తెలంగాణా సర్కార్ సీరియస్ అయ్యింది. ఐడీలను గుర్తించి సైబర్ కేసులు పెడుతున్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ తగినట్లు అయ్యింది.  

36

డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ పేరు ఏ11 గా చేర్చారు. డిసెంబర్ 12న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారు. 
 

46

ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. జైలుకు వెళ్లే పరిస్థితి నుండి అల్లు అర్జున్ బయటపడ్డారని భావించారు. అయితే ఒకరోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ గూడ జైలులో గడపాల్సి వచ్చింది. హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే.. కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ.. జైలు అధికారులకు అందాల్సి ఉంది. ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ ని జైలులో ఉంచారు. 

56

పేపర్ వర్క్ పూర్తి చేసి మరుసటి రోజు ఉదయం విడుదల చేశారు. అయితే అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా ఒక రాత్రి జైలులో ఉంచారనే విమర్శలు ఉన్నాయి. ఇక మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంది. జైలు నుండి విడుదలయ్యాక అల్లు అర్జున్ సమీపంలో గల మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వచ్చాడు. అక్కడ చాలా సమయం గడిపారు. 

 

66

దిల్ రాజుతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్ ని కలిశారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుండి నేరుగా అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళాడు. అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడారు. రేవతి మృతి దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. నేను బాగానే ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది నాకు, నా కుటుంబ సబ్యులకు కఠిన సమయం. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేనేమీ మాట్లాడలేను. నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు, అన్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image2
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image3
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved