MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • #SSMB29:మహేష్ కి విలన్ గా తమిళ స్టార్ హీరో, షాకింగ్ అప్డేట్

#SSMB29:మహేష్ కి విలన్ గా తమిళ స్టార్ హీరో, షాకింగ్ అప్డేట్

విలన్ పాత్ర పూర్తిగా డిఫరెంట్ లుక్, గెటప్ తో ఉండబోతోందని, అందుకు అలాంటి వెర్శటైల్ ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నారట. 

4 Min read
Author : Surya Prakash
Published : Jul 05 2024, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114


 మహేశ్‌బాబు (Mahesh Babu)తో  రాజమౌళి చేయబోయే చిత్రం అప్డేట్స్  గురించే సిని లవర్స్  ఎదురుచూస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ 29గా వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్‌ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంద‌ని రాజ‌మౌళి మొదట్లోనే చెప్పుకొచ్చారు.  అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.  ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌తో పాటు న‌టిన‌టుల ఎంపిక జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214


 ఈ మూవీలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్ న‌టించ‌బోతున్న‌ట్లు ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఫృధ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలకమైన పాత్రలో కనపడబోతున్నారు కానీ విలన్ మాత్రం కాదని తెలిసింది. అలాగే ఇంకా పృధ్వీరాజ్ ని  ఫైనల్ కూడా చేయలేదని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ ఎవరు కనిపించబోతున్నారు అంటే తమిళ స్టార్  అని తెలిసింది.
 

314


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ఈ సినిమాలో విల‌న్ పాత్ర కోసం విక్ర‌మ్ ని సంప్ర‌దించిన‌ట్టు టాక్‌. విలన్ పాత్ర పూర్తిగా డిఫరెంట్ లుక్, గెటప్ తో ఉండబోతోందని, అందుకు అలాంటి వెర్శటైల్ ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని విక్రమ్ ని సంప్రదిస్తున్నారట టీమ్. అయితే ఇంకా విక్రమ్ ఏమన్నారు. డేట్స్ ఎడ్జెస్ట్ మెంట్స్ వంటి విషయాలు చూసుకుని డిసైడ్ అవుతారట. ఏదైమైనా విక్రమ్ ఈ ప్రాజెక్టు ఓకే చేసేస్తారు అంటున్నారు.  కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.
 

414

SSMB29 చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని   ఎదురుచూస్తున్నారు. కాగా, సినిమా గురించి ఎప్పటికప్పుడు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నారు. ఇప్పటికే భారీ అడ్వెంచర్ గా రాబోతుందని, మహేశ్ బాబు మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలడని హైప్ పెంచిన విషయం తెలిసిందే.

 
 

514


ఇక ఈ చిత్రాన్ని మొదట  జూన్ నుంచి షూటింగ్ మొదలు అయ్యేలా ప్లాన్ చేసారు. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. లొకేషన్ హంట్ బాగా లేటైందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కు షూట్ మొదలెడతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు డిసెంబర్ వరకూ షూట్ వాయిదా  పడిందని తెలుస్తోంది. డిసెంబర్ రెండవ వారంలో ఈ చిత్రం షూట్ ని రాజమౌళి కూల్ గా మొదలు పెట్టనున్నారట. అదీ కాకపోతే కొత్త సంవత్సరంలోనే.  అయితే ఎందుకు లేటు అవుతోంది. ప్లాన్స్ ఎందుకు తారు మారు అయ్యాయి. 

614


ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్టు లాక్ చేసి లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అలాగే మహేష్ బాబు రెండు  పెద్ద వర్క్ షాప్ లకు హాజరు కానున్నారు. అవి రెండు నెలలు పైగానే పడతాయంటున్నారు. ఈ వర్క్ షాప్ లో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ నుంచి మొత్తం మార్చి ప్రాక్టీస్ చేయస్తారని తెలుస్తోంది. మహేష్ ..వర్క్ షాప్ లకు హాజరు కావటం అనేది ఇదే తొలి సారి అంటున్నారు. దాంతో ఆయన కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారట. ముఖ్యంగా పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించారు. లుక్‌ టెస్ట్‌లో భాగంగానే ఈ చిత్ర టీమ్  దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం.

714

 భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. మహేశ్‌కు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్‌ రెడీ చేసినట్లు టాక్‌. 
 

814


అలాగే ఇప్పటిదాకా  ఫస్ట్ లుక్ ని వదలకపోవటానికి కారణం ఈ సినిమా ఇప్పుడిప్పుడే పూర్తి కాదు.  ఇప్పుడు వరకు ఉన్న ప్లానింగ్  ప్రకారం అయితే 2026లో విడుదల  అవుతుంది. అయితే రాజమౌళి  సినిమాలు ముందు ప్లాన్ చేసిన టైమ్ కు  రావడం చూడటం అరుదు. కాబట్టి ఇప్పటినుంచి పబ్లిసిటీ ఎందుకనేది కూడా ఓ కారణం అంటున్నారు. 
 

914


 ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలై శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం మల్టిఫుల్ సెట్స్ హైదరాబాద్ లో వేస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం క్రూ మొత్తాన్ని రాజమౌళి సెట్ చేసారని అంటున్నారు.  అలాగే ఈ చిత్రం భారీ బడ్జెట్ కావటంతో వేరే నిర్మాతలు కూడా ఇన్వాన్వ్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది.
. 

1014


ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి- మహేశ్‌ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నట్లు సమాచారం.  అడ్వేంచర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు  సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో  ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలా ఈ ప్రాజెక్టులోకి సహ నిర్మాతగా Netflix చేసేందుకు డీల్ జరుగుతోందని అంటున్నారు.  అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. 
 

1114


మహేష్ బావ హీరో సుధీర్ బాబు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... మహేష్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎట్ లీస్ట్ త్రీ ఇయర్స్ పట్టొచ్చు. ఆ స్పేస్ నేను పూర్తి చేస్తానని చెప్పడం లేదు. అది ఏ హీరో వల్ల సాధ్యం కాదు. మహేష్ సినిమా ఫుల్ బాటిల్ కిక్ ఇస్తుంది అన్నారు. ఈ మాటలు విన్న మహేష్ అభిమానులు ఫుల్ బాటిల్ కిక్ ఆల్రెడీ వచ్చేసిందంటున్నారు. 

1214


 మహేశ్‌బాబు మాట్లాడుతూ...‘ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్‌ ఇండియా మూవీ అవుతుంది. జాతీయ స్థాయిలో సరిహద్దులను ఈ చిత్రం చెరిపేస్తుంది’’ అని అన్నారు. 

1314


ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఇందుకు  కథని  సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్‌బాండ్‌ తరహాలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది.  

1414


ఈ  ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు వి.విజయేంద్ర ప్రసాద్ క‌థ‌ను అందిస్తుండ‌గా.. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ.. వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా ఆర్‌.సి.కమల్ కణ్ణన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్‌గా రమా రాజమౌళి ప‌ని చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.  ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ ఇందులో హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయి.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: మా నాన్న ఆ రోజు ఇచ్చిన వార్నింగ్‌ విలువేంటో తెలిసొచ్చింది.. గూండా సినిమా టైమ్‌లో సంఘటన బయటపెట్టిన చిరంజీవి
Recommended image2
Klin Kaara: రామ్‌ చరణ్‌ పేరు మర్చిపోయిన క్లీంకార.. వార్నింగ్‌ ఇచ్చినా వదలని చిరంజీవి మనవరాలు
Recommended image3
Maa Inti Bangaram 5 Days Collections: బాక్సాఫీసు వద్ద సమంత ర్యాంపేజ్‌.. 5 రోజుల్లో మా ఇంటి బంగారంకి అదిరిపోయే వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved