- Home
- Entertainment
- చిరంజీవి సినిమా చేయాలనుకుంటున్న రూ.1200కోట్ల డైరెక్టర్ ఎవరో తెలుసా? కుదిరితే సంచలనమే!
చిరంజీవి సినిమా చేయాలనుకుంటున్న రూ.1200కోట్ల డైరెక్టర్ ఎవరో తెలుసా? కుదిరితే సంచలనమే!
మెగాస్టార్ చిరంజీవి వెంట చాలా మంది దర్శకులు క్యూ కడుతున్నారు. కానీ ఆయన మాత్రం ఓ పాన్ ఇండియా దర్శకుడితో మూవీ చేయాలనుకుంటున్నారట. ఆయనెవరు అంటే?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల లైనప్ గట్టిగానే ఉంది. ఆయన తన రేంజ్‌లో నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. ఇవి ఆల్‌రెడీ కన్ఫమ్ అయ్యాయి. మరికొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయట. చాలా మంది దర్శకులు కథలు నెరేట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరు చేస్తున్న మూవీస్‌లో అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి.
ప్రస్తుతం వశిష్టతో `విశ్వంభర` సినిమా చేస్తున్నారు. ఇది సోషియో ఫాంటసీ మూవీ. భారీ బడ్జెట్‌తో ప్రాపర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఇది ఈ సమ్మర్‌లోనే విడుదల కాబోతుంది. అనంతరం అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కబోతుంది. ఫుల్ కమర్షియల్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదలకు ప్లాన్ చేస్తున్నారట.
అలాగే `దసరా` ఫేమ్ ఓడెల శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇది పూర్తి యాక్షన్ మూవీ అని తెలుస్తుంది. హీరోయిన్ కూడా ఉండరని టాక్.
దీంతోపాటు తనకు `వాల్తేర్ వీరయ్య` వంటి బ్లాక్ బస్టర్‌ని అందించిన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు చిరు. కానీ వీరంతా కాదు, మెగాస్టార్ ఓ దర్శకుడితో వర్క్ చేయాలనుకుంటున్నారట. అందరు చిరు వెంటపడిగెడుతుంటే, చిరు మాత్రం ఓ దర్శకుడిని కోరుకుంటున్నారు.
మరి చిరు కోరుకుంటున్న దర్శకుడెవరు అనేది చూస్తే ఆయన నాగ్ అశ్విన్. ఇటీవల `కల్కి 2898 ఏడీ` సినిమాతో ఆయన పాన్‌ఇండియాని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ రూ.1250కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీసు ని షేక్ చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్‌ని అందించిన నాగ్ అశ్విన్ ఇప్పుడు దీనికి సీక్వెల్‌పై వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది `కల్కి 2`స్టార్ట్ కాబోతుంది.
ఇక తాను చిరంజీవితో పనిచేయాలని ఉందని నాగ్ అశ్విన్ తన మనసులో మాట వెల్లడించారు. చిరంజీవి నటించిన సినిమాల్లో నచ్చిన మూవీస్ గురించి కూడా చెప్పారు. ఇటీవల `బ్రహ్మా ఆనందం` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని చెప్పారు. అనంతర చిరంజీవి కూడా మాట్లాడుతూ, నాగ్ అశ్విన్‌తో సినిమా చేయాలని ఉందని, ఇలాంటి యంగ్ డైరెక్టర్‌తో పనిచేస్తే తమలో కూడా జోష్ పెరుగుతుందని తెలిపారు.
త్వరగా `కల్కి 2` కంప్లీట్ చేసి నా సంగతి చూడు అంటూ వెల్లడించారు. ఈ లెక్కన చిరు.. నాగ్ అశ్విన్‌తో వర్క్ చేయాలని కోరుకుంటున్నారనే విషయం స్పష్టమవుతుంది. మరి నిజంగానే వీరి కాంబినేషన్ సెట్ అయితే మాత్రం అది సంచలనాత్మక ప్రాజెక్ట్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
read more: జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ చేసే ధైర్యం ఉన్న హీరో ఎవరో తెలుసా?