MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • హీరో అని కూడా చూడకుండా మెగాస్టార్‌ని రోజంతా ఎండలో నిల్చోబెట్టిన నిర్మాత, చిరు ఆ రోజే డిసైడ్‌ అయ్యాడు

హీరో అని కూడా చూడకుండా మెగాస్టార్‌ని రోజంతా ఎండలో నిల్చోబెట్టిన నిర్మాత, చిరు ఆ రోజే డిసైడ్‌ అయ్యాడు

మెగాస్టార్‌ చిరంజీవికి దారుణమై అవమానం జరిగింది. ఓ నిర్మాత ఏకంగా రోజంతా ఎండలో నిల్చోబెట్టాడు. లేట్‌గా వచ్చాడని దారుణమైన పనిష్‌మెంట్‌ ఇచ్చాడు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 09 2024, 09:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చిరంజీవి ఊరికే మెగాస్టార్‌ అయిపోలేదు. ఈ జర్నీ వెనకాల ఎంతో కష్టం ఉంది, హార్డ్ వర్క్ ఉంది. ప్రతిభ ఉంది, సేవ ఉంది, ప్రేమ ఉంది. గొప్పతనం చాటుకున్న సందర్భాలు కోకోల్లలు. అందుకే చాలా మంది ఆయనతో పనిచేసిన దర్శక, నిర్మాతలు, ఆర్టిస్టులు గానీ అంటుంటారు చిరంజీవి ఊరికే మెగాస్టార్‌ అయిపోలేదు అని. తనని తాను నటుడిగా చెక్కుకుంటే, స్టార్‌గా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఎన్నోఆటుపోట్లు, అవమానాలను ఫేస్‌ చేశాడు. ప్రారంభంలో కొంత మంది చిరంజీవిని ప్రోత్సహించాలని చూశారు, ఆయన టాలెంట్‌ని చూసి ఆశ్చర్యపోయి ఎంకరేజ్‌ చేశారు. ఈ ప్రాసెస్‌లో తెలియకుండానే కొంత మంది తొక్కేసే ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు. బయటకు రానివి చాలా జరిగే ఉంటాయి. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే ప్రారంభంలో చిరంజీవికి జరిగిన అవమానం బయటకు వచ్చింది. ఓ నిర్మాత చిరంజీవి ఎండలో రోజంతా నిలబెట్టిన ఘటన కూడా ఉందట. షూటింగ్‌కి లేట్‌గా వచ్చాడని ఆ మూవీకి హీరో అని కూడా చూడకుండా ఆ నిర్మాత చిరుకి పనిష్‌మెంట్‌ ఇచ్చాడట. దాని వల్ల రోజంతా ఎండలోనే నిల్చున్నాడట మెగాస్టార్. అది అందరిని కలిచి వేసిందట. టైమ్ అంటే చిరు, చిరు అంటే టైమ్‌ అనేది అప్పట్నుంచే అలవర్చుకున్నారట. మరి ఇంతకి ఏ సినిమా టైమ్‌లో ఇది జరిగింది? అాలా చేసిన నిర్మాత ఎవరనేది చూస్తే, షాక్‌ అవ్వాల్సిందే. 

35

చిరంజీవి ఈ అవమానం ఫేస్‌ చేసింది `కోతలరాయుడు` సినిమా సమయంలో అట. 1979లో వచ్చిన ఈ సినిమాకి కే వాసు దర్శకుడు. ఇందులో చిరంజీవి హీరోగా నటించారు. మాధవి ఆయనకు జోడీగా చేసింది. గిరిబాబు, హేమ సుందర, చక్రపాణి, కేవీ చలం, నిర్మలమ్మ, మంజు భార్గవి, ఆర్‌ నారాయణ మూర్తి, బేబీ తులసి నటించారు. నటి తులసి ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం విశేషం.  ఓ రోజు సినిమా షూటింగ్‌కి చిరంజీవి లేట్‌గా వచ్చాడట. ఆయన కోసం టీమ అంతా వెయిట్‌ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనే హీరో. ఆయనపైనే సన్నివేశాలు తీయాల్సి ఉంది. చిరంజీవి లేట్‌గా రావడంతో నిర్మాతకు కోపం వచ్చింది. మండిపోయిన నిర్మాత చిరుని ఎండలోనే ఉండాలని ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడట. 
 

45

అలాగే ఆ రోజు మొత్తం ఎండలోనే నిల్చున్నాడని తెలిపింది నటి తులసి. ఆమె ఇందులో బాలనటిగా నటించడమే కాదు, చిరంజీవి నటించిన సత్యం పాత్రకి ఆమె మేనకోడలు పాత్రని పోషించింది. వీరిద్దరి మధ్య చాలా సన్నివేశాలున్నాయి. ఆ టైమ్‌లో జరిగిన సంఘటనని ఆ మధ్య ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది తులసి. చిరంజీవి ఎంత గొప్పవారు, ఆయన మెగాస్టార్ ఎందుకయ్యాడో చెబుతూ ఈ విషయాన్ని తెలిపింది. అప్పుడు చిరంజీవిని తులసి అన్నయ్య అని పిలిచేదట. ఇప్పటికీ అలానే పిలుస్తానని తెలిపింది. ఇటీవలే ఓ సారి చిరంజీవి కలిసినప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసిందట. అయితే దాన్ని చిరంజీవి మర్చిపోయినట్టు తెలిపింది తులసి. అది చిరంజీవి గొప్ప మనసుకి నిదర్శనం, ఎదగడం అంటే ఏజ్‌లోనో ఆస్తిలోనే కాదు, మనసులో ఎదగాలని తెలిపారు తులిసి. 
 

55

మరి చిరంజీవికి పనిష్‌మెంట్‌ ఇచ్చిన ఆ నిర్మాత ఎవరో కాదు దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కావడం విశేషం. ఎందుకంటే ఆ మూవీకి ఆయన నిర్మాత. తులసి చెప్పినదాని ప్రకారం ఆ సినిమా నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజనే ఆ పని చేసి ఉంటాడని అర్థమవుతుంది. ప్రస్తుతం తమ్మారెడ్డి సినిమాలు చేయడం లేదు. ఒకప్పుడు నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా సినిమాల్లో నటుడిగా కనిపిస్తున్నాడు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image2
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image3
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved