- Home
- Entertainment
- చిన్నపిల్లాడు వద్దని చెప్పినా వినలేదు, పట్టుపట్టిన చిరంజీవి..కట్ చేస్తే ఇండియన్ సినిమా షేక్ అయ్యేలా..
చిన్నపిల్లాడు వద్దని చెప్పినా వినలేదు, పట్టుపట్టిన చిరంజీవి..కట్ చేస్తే ఇండియన్ సినిమా షేక్ అయ్యేలా..
మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినిమాలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. అతడెవరు.. ఏంటా సంగతులు అనేది ఇప్పుడు చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us

జగదేకవీరుడు అతిలోకసుందరి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని దృశ్య కావ్యం లాంటి చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించారు.
లంకేశ్వరుడు చిత్రంలో..
ఈ చిత్రం గురించి చిరు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు అయిన ప్రభుదేవా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుదేవాని ఫాన్స్ ముద్దుగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు. డ్యాన్స్ లో ప్రభుదేవా ఆ స్థాయిలో ప్రతిభ చూపించారు. తాను తొలిసారి ప్రభుదేవా కి లంకేశ్వరుడు చిత్రంలో అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అప్పటికి ప్రభుదేవా వయసు పదహారేళ్లు కూడా నిండలేదు. చిన్నపిల్లాడు అయినప్పటికీ అతని టాలెంట్ నేను గమనించాను.
చిన్న పిల్లాడు వాడికి ఏం తెలుసు
తన చిత్రంలో సాంగ్స్ కి డాన్స్ కొరియోగ్రఫీ చేయమని అడిగాను. అక్కడే ఉన్న అతడి తండ్రి సుందరం మాస్టర్.. వాడికి ఏం తెలుసు సార్ చిన్న పిల్లాడు అని అన్నారు. కానీ నేను బలవంతంగా ప్రభుదేవా అని కొరియోగ్రఫీ చేయమని చెప్పాను. ఆ తర్వాత స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం కోసం మలేషియా తీసుకెళ్లాను. ఆ టైంలో కనీసం వీసా అని పలకడం చేతకాని చిన్న పిల్లాడు ప్రభుదేవా.
బంగారు కోడిపెట్ట సాంగ్
జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో అబ్బనీ తీయని దెబ్బ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది కూడా అతడే. ఆ తర్వాత ఘరానా మొగుడు చిత్రంలో బంగారు కోడిపెట్ట సాంగ్ కి డ్యాన్స్ కొరియోగ్రఫీ అదరగొట్టేశాడు. ఇప్పుడు ప్రభుదేవా స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందనంత ఎత్తులో ఉన్నాడు.
చిరంజీవి ప్రశంసలు
ఆరోజు అందరూ చిన్నపిల్లాడు వద్దని చెబుతున్నా ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు ఇండియన్ సినిమాలో డ్యాన్స్ అంటే ప్రభుదేవా.. ప్రభుదేవా అంటే డ్యాన్స్ అనేంతలా ఎదిగినట్లు చిరంజీవి ప్రశంసించారు.