ఠాగూర్‌గా పవన్‌, ఇంద్రగా ప్రభాస్‌, గ్యాంగ్‌లీడర్‌గా ఎన్టీఆర్‌.. `వేట` చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాః చిరు

First Published Dec 26, 2020, 6:46 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ఫస్ట్‌ టైమ్‌ ఓ డిజిటల్‌ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన `ఆహా`లో ప్రసారమయ్యే `సామ్‌జామ్‌` టాక్‌ షోలో పాల్గొన్నాడు. క్రిస్మస్‌ కానుకగా ఇది డిసెంబర్‌ 25 నుంచి ప్రసారమవుతుంది. అయితే ఇందులో చిరంజీవి అనేక ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. అనేక కదిలించే విషయాలను షేర్‌ చేసుకున్నారు. 

కె.విశ్వనాథ్‌ రూపొందించిన `శంకరాభరణం` సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట. `కోతలరాయుడు` సినిమాలో తనతో నటించిన మంజు భార్గవి ఈ చిత్రంలో  నటించింది. ఆమె కోసం చిరంజీవి `శంకరాభరణం` ప్రీమియర్‌ చూడ్డానికి వెళ్లాడట. అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చారట.

సినిమా క్లైమాక్స్ లో తనకి కన్నీళ్లు ఆగలేదట. లైట్స్ ఆన్‌ చేస్తే తాను ఏడుస్తున్న విషయం తెలిసిపోతుందని, అందుకు ముందే తన కర్చీఫ్‌ కోసం వెతికాడట. కానీ మంజు  భార్గవి అది గమనించి తన చీర కొంగుని అందించిందట. తాను కన్నీళ్ళు తుడుచుకున్నానో లేదో సరిగ్గా అదే సమయానికి లైట్స్ ఆన్ అయ్యాయి. అప్పుడు మంజుభార్గవి చీర  కొంగు నా చేతిలో ఉంది. ఆ సమయంలో తనకు ఏదోలా అనిపించిందన్నారు.

`శంకరాభరణం` సినిమా విడుదలైన కొన్నిరోజులకు నాకు సురేఖకు పెళ్ళి చేయాలని పెద్దలు అనుకున్నారు. కానీ `శంకరాభరణం` ప్రిమియర్ షో సమయంలో తను నన్ను  చూసే ఉంటుందేమో.. నాతో పెళ్ళికి తను ఒప్పుకోదేమో అని చాలా కంగారు పడ్డాను. కానీ తను నన్ను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించిందని మెగాస్టార్ తెలిపారు.

అలాగే తాను `ఖైదీ` తర్వాత నటించిన `వేట` సినిమా పరాజయం చెందినప్పుడు కూడా ఎమోషనల్‌ అయ్యారట. ఆ సినిమాపై ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్నానని, అది  ఫ్లాప్‌ కావడంతో ఇంట్లో దుప్పటి కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చినట్టు చిరంజీవి తెలిపారు. దీంతోపాటు `విజేత` సినిమా చూసినప్పుడల్లా తనకు కన్నీళ్లు వస్తాయని తెలిపారు  చిరంజీవి.

ఇక మీరు నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాలు ఇప్పటి హీరోల్లో ఎవరు చేస్తే బాగుంటుందన్న ప్రశ్నకి చిరు స్పందిస్తూ, పవన్‌ కళ్యాణ్‌ `ఠాగూర్‌` చిత్రానికి బాగా సూట్‌  అవుతున్నారట. ప్రభాస్‌తో `ఇంద్ర` సినిమా చేయొచ్చని, పర్‌ఫెక్ట్ యాప్ట్ అని చెప్పారు. ఇక `గ్యాంగ్‌లీడర్‌` చిత్రాన్ని రామ్‌చరణ్‌తోగానీ, ఎన్టీఆర్‌తోగాని చేయొచ్చన్నారు. ఇలా వరుసగా మహేష్‌, విజయ్‌ దేవరకొండ, రవితేజ వంటి పేర్లు కూడా వెల్లడించారు.

రాజకీయాల గురించి చెబుతూ, రాజకీయాలు తనకు సెట్‌ కాలేదన్నారు. నటుడిగా హ్యాపీగా ఉన్నట్టు చెప్పారు. ఇకపై రాజకీయాల జోలికి వెళ్లనని వెల్లడించారు. చిరంజీవి సినీ  జీవితాన్ని చూశారు, రాజకీయ లైఫ్‌ని చూశారు. ఈ రెండింటిలో సినిమా జీవితమే బాగా నచ్చిందట. మరో జన్మంటూ ఉంటే నటుడిగానే పుట్టాలని కోరుకుంటానని తెలిపారు.  పవన్‌ కళ్యాణ్‌ గురించి చెబుతూ, పవన్‌ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని, కచ్చితంగా విజయం సాధిస్తాడని తెలిపారు.

ఈ సందర్భంగా తనని తాను సక్సెస్‏గా అభివర్ణించుకుంటానని తెలిపారు. అంతేకాకుండా ఆటోబయోగ్రఫీ రాయాలని, దాని ద్వారా కొద్దిమందిలోనైనా ప్రేరణ తీసుకురావాలని  తనకు ఆశ ఉందని తెలిపారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?