చిరంజీవి పేరు వెనుక ఉన్న రహస్యం, స్వయంగా వెల్లడించిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి అలియాస్ శివశంకర్ వరప్రసాద్. చిరంజీవి మెగాస్టార్ గా మారడం అంత ఈజీగా జరగలేదు. దాని వెనకు ఎన్నో ఏళ్ళ కష్టం దాగి ఉంది. అంతే కాదు చిరంజీవి పేరు వెనుక కూడా ఓ రహస్యం దాగి ఉంది. ఇంతకీ మెగాస్టార్ స్వయంగా చెప్పిన ఆ రహస్యం ఏంటో తెలుసా..?
తెలుగు సినీపరిశ్రమలో వారసులు జోరు చాలా ఎక్కువ. అటువంటి టైమ్ లోకూడా ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటుడిగా మారి..ఇండస్ట్రీపై పట్టు సాధించి.. టాలీవుడ్ మెగాస్టార్ గా ఎదగడం అంత ఆషామాషీ పని కాదు. అంతే కాదు వారసులను దాటుకుని స్టార్ హీరో అవ్వడమే కాదు.. ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్దన్నలా మారాడు చిరంజీవి.
Also Read: సౌందర్య 100 కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్న టాలీవుడ్ సీనియర్ హీరో ఎవరో తెలుసా..?
తెలుగు సినిమాకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ మందుకు వచ్చి.. ఇండస్ట్రీని కాపాడుతూ వస్తున్నారు. అంతే కాదు నేను పెద్దను కాదు.. ఇండస్ట్రీకి బిడ్డను అంటూ ఏమాత్రం గర్వం లేకుండా చెప్పుకుంటారు మెగాస్టార్. అంతే కాదు ఎటువంటి సినిమా నేపధ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు.
Also Read:యంగ్ హీరోతో నిహారిక కొణిదెల పెళ్ళి, మెగా డాటర్ చేసుకోబోయేది ఎవరినో తెలుసా..?
చిరంజీవి ఇంటి నుంచి నలుగురు పాన్ ఇండియా హీరోలతో పాటు మరో నలుగురు హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. తెలుగులో మెగా హీరోలు తమ సత్తాచాటుతున్నారు. ఇక చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్. సినిమాల కోసం ఎన్నో కష్టాలుపడిన ఆయన తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. అయితే ఈ పేరు మార్చుకోవడం వెనుక ఓ రహస్యం ఉందని మెగాస్టార్ ఓ సందర్భంలో చెప్పు కోచ్చారు.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ తినే విధానంపై మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్, అలా అనేశావేం బ్రో..
కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి సినిమాలు చేస్తున్న సందర్భంలో శివ శంకర్ వర ప్రసాద్ అనేపేరు స్క్రీన్ కు చాలా పెద్దగా ఉంటుంది అని ఆలోచించారట.మరి ఏ పేరు పెట్టాలి అని అనుకుంటున్న సందర్భంలో శివశంకర్ అంటే చాలా మంది ఉన్నారు. శంకర్ బాబు అంటే బాబు అనేది తనకు నచ్చదు. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైమ్ లో చిరంజీవికి ఓ కల వచ్చిందట.
Chiranjeevi
ఎక్కడో గుడి బయట ఉంటే.. గుళ్లో నుంచి చిరంజీవి ఇటు రా అని పిలిచినట్టుగా అనిపించిందట. ఈ మాట తన తల్లి అంజనాదేవికి చెప్పాడట మెగాస్టార్. దేవుడి అనుగ్రహంతో మంచి పేరు వచ్చింది. చిరంజీవిని మించిన పేరు ఇంకేముంటుంది అని.. చిరంజీవి అనే పేరును ఫిక్స్ చేశారట. అలా స్క్రీన్ నేమ్ గా చిరంజీవి తెరమీదకు వచ్చింది.
Mohan Babu
దేవుడు నామకరణం చేశాడు అని నమ్మినట్టుగానే మెగాస్టార్ గా ఈ పొజిషన్ లో ఉన్నారు మెగాస్టార్. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా హాలీవుడ్ రేంజ్ ను అందుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. ఇలా చిరంజీవి తన పేరు వెనక ఉన్న రహస్యాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.