- Home
- Entertainment
- రాంచరణ్ హీరోగా పనికొస్తాడని చిరు నమ్మింది ఎప్పుడంటే, రజనీకాంత్ ఫస్ట్ రియాక్షన్ షాకింగ్
రాంచరణ్ హీరోగా పనికొస్తాడని చిరు నమ్మింది ఎప్పుడంటే, రజనీకాంత్ ఫస్ట్ రియాక్షన్ షాకింగ్
హీరో కావాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. చరణ్ లో కాన్ఫిడెన్స్ ని గమనించాను. హీరోగా పనికొస్తాడు అని ఒక టైంలో అనిపించినట్లు చిరంజీవి తెలిపారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rajinikanth
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు చరణ్ తనని తాను ప్రూవ్ చేసుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఎంత చిరంజీవి కొడుకు అయినా ప్రేక్షకుల హృదయాలు దోచుకోకుంటే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం. చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చరణ్ ని హీరో చేయాలనే ఆలోచన తనకి ఎప్పుడు కలిగింది అనే విషయాన్ని బయట పెట్టారు.
chiranjeevi
చిన్న తనంలో బన్నీ, అల్లు అర్జున్, శిరీష్ వీళ్లంతా సరదాగా బర్త్ డే పార్టీల్లో డ్యాన్స్ చేసేవారు. ఆ టైం చరణ్ సరదాగా డ్యాన్స్ చేస్తున్నాడు అని అనుకున్నాను తప్ప హీరో అవుతాడనే ఆలోచన లేదు. నా కుమార్తె సుస్మిత పెళ్లి సంగీత్ వేడుక జరుగుతోంది. టాలీవుడ్ నుంచి చాలా మంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. వారితో కలసి చరణ్ ఏమాత్రం బెదురు లేకుండా పర్ఫెక్ట్ టైమింగ్ తో డ్యాన్స్ చేశాడు. హీరో కావాలంటే అలాంటి కాన్ఫిడెన్స్ ఉండాలి. చరణ్ లో అప్పుడు కాన్ఫిడెన్స్ ని గమనించాను. హీరోగా పనికొస్తాడు అని ఆ టైంలో అనిపించినట్లు చిరంజీవి తెలిపారు.
Ram Charan
ఆ తర్వాత కొంత కాలానికి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చిరుత చిత్రంతో రాంచరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిరుత మూవీ మంచి హిట్ అయింది. చరణ్ డ్యాన్సులు, ఫైట్స్ అదరగొట్టేశాడు. వాస్తవానికి తొలి చిత్రంతో రాంచరణ్ పాస్ మార్కులు చేయించుకుంటే చాలు. మిగిలినది ఆ తర్వాత చిత్రాల్లో చూసుకోవచ్చు అని చిరంజీవి అనుకున్నారట.
ram charan
కానీ చిరుత చిత్రంతో చరణ్ పెర్ఫామెన్స్ కి ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. రజనీకాంత్ చిరుత చిత్రం చూసి, నీ కొడుకు పాస్ మార్కులు తెచ్చుకోవడం కాలేదు డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు అని అభినందించారట. నాగార్జున కూడా అదే మాట అన్నారట. షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు చాలా మంది చరణ్ ని టెన్షన్ పెట్టేవారట. మీ నాన్న గారి పేరు నిలబెట్టాలి జాగ్రత్తగా చేయి అని చెప్పేవారట. అంత ఒత్తిడిలో కూడా చరణ్ చిరుత చిత్రంలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చిరంజీవి అభినందించారు.
ఆ తర్వాత మగధీర, రంగస్థలం చిత్రాలు రాంచరణ్ స్థాయిని పెంచుతూ వచ్చాయి. ఇక ఆరఆర్ఆర్ చిత్రంతో రాంచరణ్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రస్తుతం రాంచరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నారు.