- Home
- Entertainment
- Chiranjeevi Marriage Secret: బట్టలు చిరిగితే తాళి కట్టలేనా?.. చిరంజీవి ఆన్సర్‌కి షాకైనా సురేఖ.. ఏం జరిగిందంటే?
Chiranjeevi Marriage Secret: బట్టలు చిరిగితే తాళి కట్టలేనా?.. చిరంజీవి ఆన్సర్‌కి షాకైనా సురేఖ.. ఏం జరిగిందంటే?
చిరంజీవి.. ప్రస్తుతం మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఉన్నారు. కానీ మ్యారేజ్ సమయంలో ఆయన చిరిగిన దుస్తుల్లో కనిపించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. నెట్టింట హాట్ న్యూస్‌గా మారింది.

చిరంజీవి(Chiranjeevi) స్వయంకృషితో ఎదిగారు. తన కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. `పునాది రాళ్లు` చిత్రంతో నటుడిగా కెరీర్‌ని ప్రారంభించిన చిరంజీవి ఇప్పుడు 155 చిత్రాల వరకు చేరుకున్నారు. ఈ ఏజ్‌లోనూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి మ్యారేజ్‌కి సంబంధించిన ఓ అరుదైన, ఆసక్తికర వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. Chiranjeevi Marriage.
ఇందులో చిరంజీవి.. సురేఖతో మ్యారేజ్ రోజు చిరిగిన దుస్తుల్లో ఉన్నారనేది ఈ వార్త సారాంశం. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. ఆదివారంతో వీరి వైవాహిక జీవితానికి 42ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా వీరి మ్యారేజ్‌కి సంబంధించిన సీక్రెట్ ఒకటి బయటకు వచ్చింది. పలు సినిమాల్లో చిరంజీవి నటన చూసిన లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య.. చిరు నటనకు, క్రమశిక్షణకి ఇంప్రెస్ అయి చిరంజీవి పెద్ద హీరో అవుతాడనే నమ్మకంతో తన కూతురు సురేఖతో మ్యారేజ్ చేయాలనుకున్నారు. అయితే చిరంజీవికి సురేఖని ఇవ్వడంపై అప్పట్లో కొందరు సన్నిహితులు వ్యతిరేకించారట. కానీ చిరుపై నమ్మకంతో సురేఖని ఇవ్వాలనుకున్నారు.
ఓ సందర్భంలో రామలింగయ్య మందుతాగుతూ నువ్వు కూడా తీసుకోవచ్చు కదయ్యా అని అడగ్గా, నాకలాంటి అలవాట్లు లేవండి.. నేను ఆంజనేయ స్వామి భక్తుడ్ని అని చిరంజీవి చెబితే రామలింగయ్య నవ్వుకున్నాడట. చిరంజీవికి, అల్లు రామలింగయ్యకి కామన్ ఫ్రెండ్ అయిన జయకృష్ణగారిని అరవింద్ కలుసుకుని అసలు విషయం చెప్పాడట. అప్పుడు జయకృష్ణ సరేనని చెప్పి, రెండు కుటుంబాల వారిని పిలిచి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడట.
అయితే చిరంజీవి పెళ్లి చూపులకు నేనెందుకు రావడం మీరు చూడండి చాలు అని అన్నాడట. దానికి చిరంజీవి తల్లిదండ్రులు ఒప్పుకోకుండా చిరంజీవిని కూడా తీసుకెళ్లారట. అయితే సురేఖ చిరంజీవిని.. `మనవూరి పాండవులు` ప్రివ్యూ వేసినప్పుడు, `తయారమ్మ బంగారయ్య` శతదినోత్సవ వేడుకల్లో చూసి ఉండటంతో.. ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లి జరిగిపోయింది.
ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి నాటి సంగతులను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఇందులో ఓ సీక్రెట్ బయటపడింది. పెళ్లి సమయానికి చిరు `తాతయ్య ప్రేమ లీలలు` అనే సినిమా చేస్తున్నారట. అందులో నూతన్ ప్రసాద్‌తో చిరుకి కీలక సన్నివేశాలున్నాయి. ఆయన ఫుల్ బిజీ ఆర్టిస్టు కావడంతో డేట్స్ కోసం పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని అనుకున్నారట. కానీ నిర్మాత షూటింగ్‌ని వాయిదా వేసి చిరు పెళ్లికి టైమిచ్చారట. అయితే పెళ్లి పీటల మీద కూర్చొనేటప్పటికి చిరంజీవి చొక్కా చిరిగిపోయిందట. అది చూసి సురేఖ వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని అడిగిందట. దానికి చిరంజీవి స్పందిస్తూ, ఏం బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అంటూ చమత్కరించి అలానే తాళి కట్టేశాడట. దీంతో ఇప్పుడా న్యూస్ చిరు అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఇక చిరంజీవి, సురేఖ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రీ, కుమారుడు రామ్‌చరణ్ ఉన్నారు. చరణ్ స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి నటించిన `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగాఉంది. మరోవైపు `గాడ్‌ఫాదర్`, `భోళాశంకర్`, `మెగా154`తోపాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. అత్యంత బిజీయెస్ట్ యాక్టర్‌గా ఉన్నారు.