MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజశేఖర్‌ విలన్‌గా చేస్తానంటే రిజెక్ట్ చేసిన చిరంజీవి.. ఏకంగా రెండు సార్లు స్టార్‌ హీరోకి ఝలక్, కారణం ఇదే

రాజశేఖర్‌ విలన్‌గా చేస్తానంటే రిజెక్ట్ చేసిన చిరంజీవి.. ఏకంగా రెండు సార్లు స్టార్‌ హీరోకి ఝలక్, కారణం ఇదే

విలన్‌గా నటిస్తానని రాజశేఖర్‌ ముందుకు వస్తే కాదు పొమ్మన్నారు చిరంజీవి. ఒక్కసారి కాదు, రెండు సార్లు ఇదే అనుభవాన్ని రాజశేఖర్‌ ఫేస్‌ చేయాల్సి వచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 04 2025, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజశేఖర్‌ని రిజెక్ట్ చేసిన చిరంజీవి
Image Credit : our own

రాజశేఖర్‌ని రిజెక్ట్ చేసిన చిరంజీవి

హీరో రాజశేఖర్‌, మెగాస్టార్‌ చిరంజీవికి ఆ మధ్య గొడవలు అయ్యాయి. చిరుని రాజకీయంగా విభేదించారు రాజశేఖర్‌. ఆయనపై పలు ఆరోపణలు చేయడంతో గొడవలకు కారణమయ్యింది. ఆ తర్వాత అన్నీ సెట్‌ అయ్యాయి. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారని టాక్‌. ఆ మధ్య తనకు చిరు హెల్ప్ కూడా చేశారని రాజశేఖరే పలు ఇంటర్వ్యూస్‌లో తెలిపారు. అయితే సినిమాల పరంగా ఒకప్పుడు ఇద్దరి మధ్య పోటీ ఉండేది. ఇద్దరూ యాక్షన్‌ హీరోలుగా చేసిన నేపథ్యంలో ఇద్దరి మధ్య బాక్సాఫీసు వద్ద పోటీ నడిచింది. అయితే ఆ మధ్య ఓ సారి తాను విలన్‌ రోల్‌ చేస్తానంటే చిరంజీవి రిజెక్ట్ చేశారట. అంతేకాదు గతంలోనూ ఆయనతో ఓ మూవీ చేస్తానని ఆసక్తి చూపినా నో చెప్పినట్టు వెల్లడించారు రాజశేఖర్‌.

25
క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అయిన రాజశేఖర్‌
Image Credit : youtube/shreyas media

క్యారెక్టర్స్ చేసేందుకు రెడీ అయిన రాజశేఖర్‌

రాజశేఖర్‌ ఇప్పుడు హీరోగానే కాదు బలమైన క్యారెక్టర్స్ చేసేందుకు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన ఆ మధ్య `ఎక్స్ టార్డినరీ మ్యాన్‌` చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. నితిన్‌ హీరోగా వచ్చిన ఈ మూవీ ఆడలేదు. దీంతో ఆలోచనలో పడ్డారు రాజశేఖర్‌. ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతున్నారు. అయితే ఈ సారి బలమైన పాత్రలతో బౌన్స్ బ్యాక్‌ అయ్యేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం `బైకర్‌` అనే చిత్రంలో నటించారు. శర్వానంద్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజశేఖర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శర్వానంద్‌కి ఫాదర్‌ రోల్‌ అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Related image1
భరణితో నన్ను లింక్ చేసిన వాడు అమ్మకే పుట్టలేదు.. దివ్వెల మాధురి ఫైర్.. నాగబాబుని ఇరికించిందిగా
Related image2
చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన అమ్మ అంజనాదేవి వార్నింగ్‌, లేకపోతే మెగాస్టార్‌గా చూసేవాళ్లం కాదా!
35
ధృవలో విలన్‌ పాత్రకోసం చిరుని అప్రోచ్‌ అయిన రాజశేఖర్‌
Image Credit : fb

ధృవలో విలన్‌ పాత్రకోసం చిరుని అప్రోచ్‌ అయిన రాజశేఖర్‌

ఇదిలా ఉంటే ఇప్పుడు కాదు తొమ్మిదేళ్ల క్రితమే విలన్‌గా చేసేందుకు రెడీ అయ్యారు రాజశేఖర్‌. కానీ చిరంజీవి వల్లే వెనక్కి తగ్గారట. 2016లో రామ్‌ చరణ్‌ హీరోగా `ధృవ` మూవీ వచ్చింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తమిళంలో వచ్చిన `తని ఒరువన్`కి రీమేక్‌. అల్లు అరవింద్‌, ఎన్వీ ప్రసాద్ తెలుగులో నిర్మించారు. ఈ సినిమాలో విలన్‌గా అరవింద స్వామి నటించారు. తమిళంలోనూ ఆయనే విలన్‌. తెలుగులోనూ ఆయన్నే తీసుకున్నారు. అయితే తెలుగు వెర్షన్‌ విలన్‌ పాత్రని చేసేందుకు ఆసక్తి చూపించారు హీరో రాజశేఖర్‌. చిరంజీవికి తన ఇంట్రెస్ట్ ని వెల్లడించారు.

45
ఈ కారణంతో రాజశేఖర్‌ని రిజెక్ట్ చేసిన చిరంజీవి
Image Credit : goldmines comedy

ఈ కారణంతో రాజశేఖర్‌ని రిజెక్ట్ చేసిన చిరంజీవి

`తని ఒరువన్‌`లో అరవింద స్వామి పాత్ర చాలా బలంగా ఉంటుంది. హీరో రేంజ్‌ రోల్‌ అని చెప్పొచ్చు. చాలా కూల్‌గా, స్టయిలీష్‌గా ఉంటుంది. ఫోన్‌లోనే విలనిజం చూపిస్తుంటారు. హీరోకి చుక్కలు చూపించే పాత్ర సినిమాలో బాగా హైలైట్‌ అయ్యింది.  ఆ రోల్‌ నచ్చి తాను చేసేందుకు సిద్దమయ్యాడు రాజశేఖర్‌. కానీ అందులో హీరోతో లేని విలన్‌ సింగిల్‌ సీన్లు చాలా ఉన్నాయి. వాటిని యదాతథంగా తెలుగు రీమేక్‌లో వాడుకోవచ్చని భావించిన చిరు అండ్‌ టీమ్‌ రాజశేఖర్‌కి నో చెప్పారట. కొత్తగా రాజశేఖర్‌ని తీసుకుంటే ఆయా సీన్లు అన్నీ మళ్లీ షూట్‌ చేయాలి. అప్పుడు బడ్జెట్‌ పెరిగిపోతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే తమిళ మూవీలోని సీన్లని వాడుకుంటే కలిసి వస్తుందని భావించిన చిరు అండ్‌ టీమ్‌, రాజశేఖర్‌ కి నో చెప్పారట. ఆయనకు కూడా ఈ విషయాన్ని వివరించడంతో అర్థం చేసుకుని తప్పుకున్నారట. ఈ విషయాన్ని రాజశేఖర్‌ స్వయంగా ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

55
స్నేహం కోసం మూవీ విషయంలోనూ అదే జరిగింది
Image Credit : prime video

స్నేహం కోసం మూవీ విషయంలోనూ అదే జరిగింది

ఇప్పుడే కాదు, గతంలోనూ ఓ సారి చిరంజీవితో కలిసి నటించేందుకు రాజశేఖర్‌ ఆసక్తి చూపించారు. `స్నేహం కోసం` సినిమాలో విజయ్‌ కుమార్‌ నటించిన పాత్రని రాజశేఖర్‌ అడిగారు. అది వయసు పరంగా పెద్దగా ఉండే రోల్‌, ఏజ్‌లో రాజశేఖర్‌ తనకంటే చిన్నవాడు కావడంతో ఆ పాత్రకి సూట్‌ కావని చెప్పి రిజెక్ట్ చేశారట చిరు. అలా రెండు సార్లు రాజశేఖర్‌ ని రిజెక్ట్ చేశారు మెగాస్టార్‌. ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ తప్పేం లేదు.. ఆ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే: కృష్ణవంశీ
Recommended image2
Top 10 Netflix Movies : నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపిన టాప్ 10 సినిమాలు.. నంబర్ 1 ఏదో తెలుసా?
Recommended image3
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Related Stories
Recommended image1
భరణితో నన్ను లింక్ చేసిన వాడు అమ్మకే పుట్టలేదు.. దివ్వెల మాధురి ఫైర్.. నాగబాబుని ఇరికించిందిగా
Recommended image2
చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన అమ్మ అంజనాదేవి వార్నింగ్‌, లేకపోతే మెగాస్టార్‌గా చూసేవాళ్లం కాదా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved