MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anushka: ఇకపై టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ సమంత.. మా ఇంటి బంగారంతో అనుష్క రికార్డ్‌ బ్రేక్‌

Anushka: ఇకపై టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ సమంత.. మా ఇంటి బంగారంతో అనుష్క రికార్డ్‌ బ్రేక్‌

అనుష్క పేరుతో ఉన్న అరుదైన రికార్డ్ ఇప్పుడు బ్రేక్‌ అయ్యింది. 17 ఏళ్ల తర్వాత సమంత దాన్ని బ్రేక్‌ చేసింది. `మా ఇంటి బంగారం`తో రచ్చ చేసింది. తనే లేడీ సూపర్‌ స్టార్‌ అయిపోయింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 30 2026, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అనుష్క శెట్టి రికార్డు బ్రేక్‌ చేసిన సమంత
Image Credit : stockPhoto

అనుష్క శెట్టి రికార్డు బ్రేక్‌ చేసిన సమంత

సమంత మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ఇటీవల `మా ఇంటి బంగారం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. మహిళా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఊహించని విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద అరుదైన రికార్డుని క్రియేట్‌ చేసింది. మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో `మా ఇంటి బంగారం` మూవీ టాలీవుడ్‌లో అనుష్క పేరుతో ఉన్న రికార్డుని బ్రేక్‌ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అరుంధతితో అనుష్క అరుదైన రికార్డ్
Image Credit : Asianet News

అరుంధతితో అనుష్క అరుదైన రికార్డ్

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో అనుష్క నటించిన `అరుంధతి` మూవీ అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. కోడి రామకృష్ణ రూపొందించిన ఈ మూవీ 2009లో విడుదలైంది. సూపర్ నేచ్చురల్‌ హర్రర్‌ ఫాంటసీగా యాక్షన్‌ మూవీగా ఇది రూపొందింది. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సోనూ సూద్‌ విలన్‌గా నటించాడు. 17ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ అప్పట్లోనే అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఏకంగా రూ.70కోట్లు వసూలు చేసి అరుదైన రికార్డు ని క్రియేట్‌ చేసింది అనుష్క. 

34
అరుంధతి రికార్డుని బ్రేక్‌ చేసిన సమంత మా ఇంటి బంగారం
Image Credit : Asianet News

అరుంధతి రికార్డుని బ్రేక్‌ చేసిన సమంత మా ఇంటి బంగారం

తాజాగా అనుష్క `అరుంధతి` మూవీ రికార్డుని బ్రేక్‌ చేసింది సమంత. 17 ఏళ్ల అరుదైన రికార్డుని సామ్‌ బద్దలు కొట్టడం విశేషం. సామ్‌ నటించిన `మా ఇంటి బంగారం` మూవీ `అరుంధతి` రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం. సమంత కమ్‌ బ్యాక్‌ ఇస్తూ నటించిన ఈ మూవీ రెండు వారాల క్రితం విడుదలైన విషయం తెలిసిందే.   ఈమూవీ  ఇప్పటి వరకు రూ.78కోట్లు వసూలు చేసింది. ఎనభై కోట్లకు చేరువలో ఉంది. ఈ రోజుతో ఆ టార్గెట్‌ని కంప్లీట్‌ చేస్తుంది. దీంతో ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. `అరుంధతి` పేరుతో ఉన్న రికార్డ్ ని బ్రేక్‌ చేయడం విశేషం. దీంతో ఇప్పటివరకు తెలుగులో లేడీ సూపర్‌ స్టార్‌గా రాణిస్తోంది అనుష్క. ఆమె స్థానాన్ని ఇప్పుడు సమంత తీసుకోవడం విశేషం. ఈ సినిమా వంద కోట్లు వసూళ్లు చేస్తుందని టీమ్‌ భావించింది. కానీ అది సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ తెలుగులో మాత్రం సమంత ఇప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌గా అవతరించిందని చెప్పొచ్చు.

44
భర్తతో కలిసి మా ఇంటి బంగారంని నిర్మించిన సమంత
Image Credit : Asianet News

భర్తతో కలిసి మా ఇంటి బంగారంని నిర్మించిన సమంత

సమంత హీరోయిన్‌గా నటించిన `మా ఇంటి బంగారం` మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్‌ నిడిమోరు కథ, స్క్రీన్‌ ప్లే అందించారు. డైరెక్షన్‌లోనూ ఆయన కూడా ఇన్‌వాల్వ్ అయ్యారు. ట్రాలాల పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్‌ నిడిమోరు కలిసి నిర్మించడం విశేషం. ఈ మూవీలో సమంతతోపాటు గుల్షన్‌ దేవయ్యా, దిగంత్‌, శ్రీముఖి, చైతన్యకృష్ణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
అనుష్క శెట్టి
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇళయరాజాకు అరుదైన గౌరవం.. పోస్టల్ స్టాంప్ రిలీజ్
Recommended image2
kayadu lohar: కయాదు లోహర్ పేరులో ఇంత అర్థం ఉందా? జెన్ జీ బ్యూటీలో మైథాలజీ యాంగిల్
Recommended image3
Mahaveer Karna First Look: పౌరాణిక యోధుడిగా రాఘవ లారెన్స్.. ఫస్ట్ లుక్ ఎలా ఉంది, రిలీజ్ ఎప్పుడంటే?
Related Stories
Recommended image1
Lenin Trailer Review: సాలిడ్‌ కంటెంట్‌తో వస్తోన్న అఖిల్‌, ఫస్ట్ హిట్‌ పక్కా.. లెనిన్‌ ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Sridevi: మూడు నెలలు స్టార్‌ హీరోతో శ్రీదేవి కాపురం, విడిపోవడానికి కారణమిదే.. జర్నలిస్ట్ సంచలన నిజాలు వెల్లడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved