చిరంజీవి-బాలయ్య మధ్య పోటీ.. రజినీకాంత్ జైలర్ 2 లో నటించబోయేది ఎవరంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 సినిమా త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఈసారి ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో కూడా నటించబోతున్నాడట.. మరి అందులో తలైవాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోయేది ఎవరు..? చిరంజీవినా.. లేక బాలయ్య బాబా...?

Rajinikanth
రీసెంట్ గా ఒకే స్టేజ్ పై సందడి చేశారు సూపర్ స్టార్ రజినీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి... నట సింహం నందమూరి బాలయ్య.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి.. రజనీకాంత్ సతీసమేతంగా హాజరయ్యారు. ఉత్సవ వేదికపై రజనీ పక్కన మెగాస్టార్ చిరంజీవితో పాటు.. నందమూరి నటసింహం బాలయ్య కూడా సందడి చేశారు. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మహేష్ బాబు 100 సార్లు చూసిన సినిమా ఏదో తెలుసా..? ఆసినిమా అంటే అంత పిచ్చి ఎందుకు..?
ఈ కార్యక్రమంలో చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సహా పలువురు తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఆమె ఒకే వేదికపై సూపర్ స్టార్లు కుర్చున్న సందర్భంతో పాటు.. ఈ అరుదైన సందర్భం.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తోంది. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ పక్కపక్కనే కూర్చున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లావణ్య త్రిపాఠికి ఏమయ్యింది.. టెన్షన్ లో మెగా ఫ్యామిలీ, అందుకే పవన్ ప్రమాణస్వీకారానికి రాలేదా...?
ఈసందర్భంగా.. ఈముగ్గురు స్టార్టకు సబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. జైలర్ 2లో రజనీకాంత్ తో పాటు.. తెలుగు నుంచి కూడా స్టార్ హీరో ఒకరు నటించబోతున్నారట. ఇప్పటికే జైలర్ లో కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలాళం నుంచి మోహన్ లాల్ నటించారు. తెలుగు నుంచి మాత్రం జైలర్ లో నటించలేదు. కాని ఈసారి జైలర్ 2 లో తెలుగు స్టార్ సీనియర్ నటుడు అందులో సందడి చేయబోతున్నారట.
పవన్ కళ్యాణ్, చిరంజీవి, రోజా.. మంత్రులుగా సంచలనం సృష్టించిన సినిమా తారలు ఇంకెవరంటే..?
అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ దాగి ఉంది.. అదేంటంటే.. ఈసినిమాల నటించబోయేది ఎవరు అని..? చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరిలో ఎవరు ఈసినిమాలో నటించబోతున్నారు అనేది సస్పెన్స్ గా ఉంది. అంతే కాదు మరికొందరి వాదన ఏంటంటే.. రజనీకాంత్‌తో జైలర్ 2లో ఇద్దరూ నటించే అవకాశం ఉందని సమాచారం.
Jailer
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న సినిమా అయిపోయిన తరువాత నెల్సన్ దిలీప్ జైలర్ 2 నుస్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో తలైవాతో నటించబోయేది ఎవరు అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అటు అభిమానులు మాత్రం రజినీకాంత్ తో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ నటిస్తే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.