కేక పెట్టించేలా మెగాస్టార్ కొత్త లుక్.. వైరల్ అవుతున్న ఫోటో షూట్!
First Published Aug 4, 2019, 1:11 PM IST
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరక్కుతోంది. ప్రస్తుతం సైరా సందడి మొదలైనట్లే కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.

మెగా కోడలు ఉపాసన తాజాగా షేర్ చేసిన చిరంజీవి ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవి కళ్ళజోడు ధరించి స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశారు.

ఉపాసన బి పాజిటివ్ అనే మ్యాగజైన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాగజైన్ కోసం చిరు ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ ఫోటో షాట్ లో చిరంజీవి చిరునవ్వు చూస్తుంటే చంటబ్బాయి సమయంలో యంగ్ చిరు గుర్తొస్తున్నాడు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?