MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి హీరోగా శ్రీదేవి నిర్మాతగా చిత్రం, 30 మంది బతిమాలినా ఆమెతో మూవీ చేయని ఏకైక స్టార్ డైరెక్టర్

చిరంజీవి హీరోగా శ్రీదేవి నిర్మాతగా చిత్రం, 30 మంది బతిమాలినా ఆమెతో మూవీ చేయని ఏకైక స్టార్ డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మాస్ ప్రేక్షకులు ఎగబడితే వసూళ్లు ఎలా ఉంటాయో చూపించిన హీరో చిరంజీవి. చిరంజీవితో ఎంతో మంది హీరోయిన్లు, దర్శకులు పనిచేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 28 2025, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
megastar chiranjeevi

megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మాస్ ప్రేక్షకులు ఎగబడితే వసూళ్లు ఎలా ఉంటాయో చూపించిన హీరో చిరంజీవి. చిరంజీవితో ఎంతో మంది హీరోయిన్లు, దర్శకులు పనిచేశారు. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ అంటే ముందుగా ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చే చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ మూవీ కాకుండా మరికొన్ని చిత్రాల్లో శ్రీదేవి, చిరంజీవి కలసి నటించారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో మొదలైన ఒక చిత్రం ప్రారంభ దశలోనే ఆగిపోయింది. ఆ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలని అప్పటి స్టార్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఎందుకంటే ఆ చిత్రం ప్రారంభమైంది ఆయన దర్శకత్వంలోనే. చిరంజీవి హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా కోదండ రామిరెడ్డి ఒక చిత్రాన్ని ప్రారంభించారు. విశేషం ఏంటంటే ఆ చిత్రానికి నిర్మాత శ్రీదేవి. శ్రీదేవి ఎంతో ఇష్టపడి తనకి, చిరంజీవికి అయితే ఈ మూవీ బావుంటుంది అని సొంతంగా నిర్మించేందుకు రెడీ అయింది. 

 

35
sridevi

sridevi

చిరంజీవితో అనేక సూపర్ హిట్స్ తెరకెక్కించిన కోదండరామిరెడ్డిని దర్శకుడిగా పెట్టుకుంది.  షూటింగ్ ప్రారంభించారు. ఆ చిత్రానికి వజ్రాల వేట అనే టైటిల్ అనుకున్నారు. అడ్వెంచర్ యాక్షన్ చిత్రం అది. రెండు పాటలు, కొన్ని సన్నివేశాల షూటింగ్ పూర్తయింది. అప్పుడు కోదండ రామిరెడ్డికి ఏదో తేడా కొడుతున్నట్లు అనిపించింది. శ్రీదేవిని పిలిచి అమ్మా ఈ కథ నీకు, చిరంజీవికి సెట్ అయ్యే కథ కాదు. మీ ఇద్దరి కాంబినేషన్ లో నేను అనుకున్నట్లు సినిమా రావడం లేదు అని చెప్పారట. 

 

45
sridevi

sridevi

దీనితో శ్రీదేవి అయితే కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం సార్ అని చెప్పిందట. అలా ఆగిపోయిన ఆ మూవీ తిరిగి ప్రారంభం కాలేదు. కోదండరామిరెడ్డి, శ్రీదేవి కాంబినేషన్ లో ఆ తర్వాత ఒక్క చిత్రం కూడా రాలేదు. అంతకు ముందు కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి నటించలేదు. శ్రీదేవితో సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని కోదండ రామిరెడ్డి తెలిపారు. 

 

55
Kodanda Ramireddy

Kodanda Ramireddy

ఆ తర్వాత తన సినిమా చేయమని శ్రీదేవి ఎంతో బతిమాలుకుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలని తన బాలీవుడ్ లో రీమేక్ చేయమని రిక్వస్ట్ చేసింది. కనీసం 30 మంది నిర్మాతలని అడ్వాన్స్ ఇచ్చి నా దగ్గరకి పంపింది. కానీ శ్రీదేవితో సినిమా చేయడం కుదర్లేదు అని కోదండ రామిరెడ్డి తెలిపారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavya Maran Wedding: అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Recommended image2
OG Universe : ఓజీ 2 కథలో సుభాష్ చంద్రబోస్ ట్విస్ట్.. కరెక్ట్ గా కుదిరితే రికార్డులు బద్దలే ?
Recommended image3
Nithyananda: భార్య తిడుతున్నా వినలేదు, రాసలీలల నిత్యానంద స్వామిని ఇంటికి పిలిచి మరీ టోపీ పెట్టిన డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved