MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి సినిమా టికెట్‌ ధర 800.. ముప్పై ఏళ్ల క్రితం మెగాస్టార్‌ రేంజ్‌ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

చిరంజీవి సినిమా టికెట్‌ ధర 800.. ముప్పై ఏళ్ల క్రితం మెగాస్టార్‌ రేంజ్‌ తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

మెగాస్టార్‌ చిరంజీవి ఇరవై ఏళ్ల క్రితం టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ స్టార్‌. కాస్త ముందుకెళ్తే  అత్యధిక పారితోషికం అందుకున్న ఇండియన్‌ స్టార్‌గా నిలిచారు. అప్పట్లో ఆయన సినిమాల రేంజ్‌ తెలిపే ఓ పేపర్‌ క్లిప్పు వైరల్‌ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 10 2024, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన హీరో. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా తనని తాను నటుడిగా మలుచుకుంటూ రాణించాడు. వెండితెరపై తన నటన, డాన్సులు, ఫైట్లతో మ్యాజిక్‌ చేస్తూ కమర్షియల్‌ హీరోగా ఎదిగాడు. తెలుగు సినిమాని కమర్షియల్‌ బాట పట్టించాడు. సుప్రీం స్టార్‌ నుంచి సూపర్‌ స్టార్‌, అట్నుంచి మెగాస్టార్‌ గా ఎదిగారు. గత మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా శాషిస్తున్నాడు. ఇప్పుడు తర్వాత తరం హీరోలు పాన్‌ ఇండియా బాటలో దూసుకుపోతున్నా, తన క్రేజ్‌, తన రేంజ్‌ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే చిరంజీవి క్రేజ్‌ ముప్పై ఏళ్ల క్రితం మరింత పీక్‌లో ఉంది. అప్పట్లో ఆయనే టాలీవుడ్‌లో బిగ్‌ స్టార్‌గా రాణించారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ అలాగే కృష్ణ వంటి హీరోలున్నా చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్‌ మామూలు కాదు. 90ఫ్యాన్స్ లెక్క వేరే లెవల్‌. ఆ అభిమానాన్ని చూపించారు. అయితే అప్పట్లో చిరంజీవి నటించిన సినిమా టికెట్‌ ధర ఏకంగా 800 పలకడం విశేషం. అది ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతేకాదే చివరికి విషయం తెలిసి మెగాస్టార్‌ కూడా సర్‌ప్రైజ్‌ కావడం విశేషం. 
 

36

ఆ వివరాల్లోకి వెళితే.. `ముఠామేస్త్రీ` మూవీ రిలీజ్‌ అయిన రోజు. 1993 జనవరి 17న ఈ మూవీ రిలీజ్‌ అయ్యింది. పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అయ్యింది. రోజు రోజుకి సినిమాకి క్రేజ్‌ పెరిగింది. అయితే అప్పట్లో చిరంజీవికి హార్డ్ కోర్‌ ఫ్యాన్స్ బాగా ఉండేవారు. ఓ అభిమాని చిరంజీవిపై అభిమానాన్ని చూపించాడు. ఒక్క టికెట్‌ ఏకంగా 800లకు కొనుగోలు చేసి సినిమా చూశాడు. అప్పట్లో ఆ రేట్‌ అంటే ఇప్పుడు ఈజీగా ఎనభై వేలుగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఓ పేపర్‌ క్లిప్పు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 

46

`ముఠామేస్త్రీ` థియేటర్లో బాగా ఆడుతుంది. ఆ సమయంలో రాజమండ్రిలో కొందరు అభిమానులు సరదాగా వేలం పాట వేసుకున్నారట. ఇందులో ఓ అభిమాని 800లకు టికెట్ ని దక్కించుకున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఓ పత్రిక దాన్ని వార్తగా ప్రచురించింది. అయితే ఆ విషయాన్ని బాబుమోహన్‌కి తెలియడంతో చిరంజీవికి చెప్పారట. అది విన్న మెగాస్టార్ ఆశ్చర్యపోయారట. ఆ అభిమాని ఎవరో కన్నుక్కొమని చెప్పగా, వివరాలు తెలియరాలేదని చెప్పారట. కానీ ఈ సంఘటన చూసి మెగాస్టార్‌ మురిసిపోయారని టాక్‌. 
 

56

ఇక కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ మూవీలో చిరంజీవికి జోడీగా మీనా, రోజా నటించారు. రాజ్‌ కోటి సంగీతం అందించారు. కేసీ శేఖర్‌ బాబు, డీ శివ ప్రసాద్‌రెడ్డి నిర్మించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇది ఒక మార్కెట్‌ బేస్డ్ గా సాగే కథ. ఆ మార్కెట్‌లో ముఠాలకు మేస్త్రీగా పనిచేస్తుంటాడు చిరు. వారి హక్కుల కోసం పోరాడతాడు. అయితే వారికి వ్యతిరేకంగా, ఆ మార్కెట్‌ని తన వశం చేసుకోవాలని విలన్‌ ప్రయత్నిస్తుంటాడు. దీంతో సీఎం కోరిక మేరకు చిరు రాజకీయాల్లోకి వస్తాడు. మంత్రి అయి విలన్ల అంతు చూడటం ఈ మూవీ కథ. 
 

66

ఇక ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఈ మూవీ రూపొందుతుంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌. ప్రస్తుతం ఇది చిత్రీకరణలో ఉంది. వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved