- Home
- Entertainment
- Chiranjeevi-Mohanlal మూవీ కథ లీక్.. బాక్సాఫీసుని షేక్ చేసే బ్యాక్ డ్రాప్ సెట్ చేసిన బాబీ
Chiranjeevi-Mohanlal మూవీ కథ లీక్.. బాక్సాఫీసుని షేక్ చేసే బ్యాక్ డ్రాప్ సెట్ చేసిన బాబీ
చిరంజీవి, మోహన్ లాల్ కాంబినేషన్‌లో మొదటి సారి సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన కథ, బ్యాక్ గ్రౌండ్ ఏంటనేది లీక్ అయ్యింది. నిజమైతే మాత్రం బాక్సాఫీసు షేక్ అయిపోతుంది.

చిరంజీవి, మోహన్‌లాల్ కాంబోలో మూవీ
చిరంజీవి, మోహన్ లాల్ కాంబినేషన్‌లో మొదటిసారి సినిమా రాబోతుంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు. `మెగా 158` పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించబోతున్నారు. అయితే ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ తెలుస్తోన్న సమాచారం మేరకు చిరంజీవి మూవీలో మోహన్ లాల్ కన్ఫమ్ అయ్యారట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్ డేట్ రాబోతున్నట్టు సమాచారం.
చిరంజీవి-బాబీ మూవీ బ్యాక్ డ్రాప్
చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ రూపొందించబోతున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందనేది తెలిసింది. స్టోరీకి సంబంధించిన మెయిన్ ఫ్లాట్ లీక్ అయ్యింది. క్రేజీ కాన్సెప్ట్ తో మూవీని రూపొందిస్తున్నారట. ఇటీవల కాలంలో ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేసే జోనర్‌లో మూవీ చేస్తున్నారట. గ్యాంగ్ స్టర్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. అంతేకాదు కోల్ కతా బ్యాక్‌ట్రాప్‌లో ఈ గ్యాంగ్ స్టర్ కథ రన్ అవుతుందట. గ్యాంగ్ స్టర్ కథలు ఇప్పుడు విశేష ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే.
తండ్రి కూతురుల మధ్య బాండింగ్
కోల్ కతా బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా ప్రయారిటీ ఉంటుందని, వాటిని ప్రధానంగా చేసుకుని సినిమా స్టోరీ నడుస్తుందని అంటున్నారు. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయని, ముఖ్యంగా తండ్రి కూతురు మధ్య బాండింగ్ ఇందులో హైలైట్‌గా ఉంటుందట. అదే సినిమాకి ప్రధాన బలం అని తెలుస్తోంది. ఇందులో మోహన్ లాల్ పాత్ర చాలా బలంగా ఉంటుందని, సినిమాని మలుపుతిప్పేలా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇదే నిజమైతే మాత్రం బాక్సాఫీసుకి పూనకాలు పక్కా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
చిరంజీవి సినిమాల లైనప్
ప్రస్తుతం చిరంజీవి `మన శంకరవరప్రసాద్ గారు` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా, వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. ఆయనది గెస్ట్ రోల్. అయితే ఈ ఇద్దరు ఇలా పూర్తి స్థాయి సినిమా చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈమూవీ విడుదల కానుంది. దీంతోపాటు `విశ్వంభర` కూడా ఈ ఏడాది రాబోతుంది. అలాగే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు చిరంజీవి.
దృశ్యం 3తో బిజీగా మోహన్ లాల్
ఇక మోహన్ లాల్.. గతేడాది దాదాపు ఐదు సినిమాలతో ఆడియెన్స్ ని అలరించారు. అందులో `ఎల్ 2 ఎంపురాన్` తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. అలాగే `కన్నప్ప`లో గెస్ట్ గా మెరిశారు. ఇప్పుడు ఆయన `దృశ్యం 3` చేస్తున్నారు. అలాగే `పేట్రియాట్` అనే మూవీలో నటిస్తున్నారు మోహన్ లాల్.

