MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవితో మూవీ, అలిగి వెళ్లిపోయిన డైరెక్టర్.. చివరికి అల్లు అర్జున్ వల్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్

చిరంజీవితో మూవీ, అలిగి వెళ్లిపోయిన డైరెక్టర్.. చివరికి అల్లు అర్జున్ వల్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్

చిరంజీవి నటించిన ఓ చిత్రం సూపర్ హిట్ కావడానికి పరోక్షంగా అల్లు అర్జున్ కారణం అయ్యాడు. ఆ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్న టైంలో డైరెక్టర్ అలిగి వెళ్లిపోయారట. ఆ మూవీ ఏంటి, ఆ దర్శకుడు ఎవరు అనే విశేషాలు ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 02 2025, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి 'బావగారు బాగున్నారా' మూవీ
Image Credit : Eenadu

చిరంజీవి 'బావగారు బాగున్నారా' మూవీ

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ కాంబినేషన్ లో బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. జయంత్ సి పరాన్జీ ఓ ఇంటర్వ్యూలో బావగారు బాగున్నారా చిత్రం తెరవెనుక జరిగిన సంగతులని పంచుకున్నారు. ఆ చిత్రం ప్రారంభం కావడానికి ముందు చాలా పెద్ద హంగామానే జరిగిందట. 

DID YOU
KNOW
?
ఆ మూవీ చేయొద్దని చిరంజీవికి చెప్పిన డైరెక్టర్
చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి కూడా జయంత్ సి పరాన్జీనే దర్శకుడు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే శంకర్ దాదా జిందాబాద్ చిత్రానికి మాత్రం ప్రభుదేవా డైరెక్టర్. శంకర్ దాదా జిందాబాద్ వర్కౌట్ కాదని, చేయవద్దని జయంత్ చిరంజీవికి ముందుగానే చెప్పారు. 
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అలిగి వెళ్లిపోయిన డైరెక్టర్
Image Credit : Youtube/ Telugu one

అలిగి వెళ్లిపోయిన డైరెక్టర్

జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ.. పరుచూరి బ్రదర్స్ కథ రెడీ చేశారు. అయితే వాళ్ళు చెప్పిన వెర్షన్ నాకు ఏమాత్రం నచ్చలేదు. చాలా ఆర్గుమెంట్ జరిగింది. చివరికి ఈ కథతో నేను సినిమా చేయలేను అని చెప్పి అలిగి వెళ్ళిపోయాను. మళ్ళీ చిరంజీవి గారు నన్ను పిలిపించారు. అలా అలిగి వెళ్ళిపోతే ఎలా.. నీకు ఏం నచ్చలేదో చెప్పు మార్పులు చేద్దాం అని అన్నారు. కథ చెప్పిన విధానం చాలా పాత పంథాలో ఉన్నట్లు ఉంది.. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా లేదు అని చెప్పా.

35
కథలో మార్పులు
Image Credit : prime video

కథలో మార్పులు

ఆ తర్వాత కథని న్యూజిలాండ్ బ్యాక్ డ్రాప్ లోకి తీసుకువెళదాం అని చెప్పాను. పరుచూరి బ్రదర్స్ చెప్పిన వెర్షన్ లో బ్రహ్మానందం కామెడీ సీన్స్ కూడా లేవు. అది కూడా నేనే యాడ్ చేశాను. నేను సూచించిన మార్పులకు చిరంజీవి గారు ఒకే చెప్పారు. ఆ మూవీలో చిరంజీవి గారు చెక్ పాంట్స్ ధరించారు. సౌత్ లో అలాంటి ప్యాంట్స్ ధరించిన మొదటి హీరో చిరంజీవి గారే. ఆ టైంలో బాలీవుడ్ లో ఒకరిద్దరు మాత్రమే అలాంటి ప్యాంట్స్ ధరించేవారు.

45
జోకర్ ని చేయాలనుకుంటున్నావా ?
Image Credit : Youtube/ Telugu one

జోకర్ ని చేయాలనుకుంటున్నావా ?

చెక్ ప్యాంట్స్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఈ మూవీలో మీరు ఆ ప్యాంట్స్ వేసుకోవాలి అని చిరంజీవి గారికి చెప్పా. ఆయన వెంటనే ఏంటి నన్ను జోకర్ ని చేయాలనుకుంటున్నావా అని అరిచారు. చిరంజీవి గారిని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్న టైం ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అప్పుడే అల్లు అర్జున్ ఆస్ట్రేలియా నుంచి ల్యాండ్ అయి చిరంజీవి గారి ఇంటికి వచ్చాడు.

55
పరోక్షంగా కారణమైన అల్లు అర్జున్
Image Credit : IMDB

పరోక్షంగా కారణమైన అల్లు అర్జున్

బన్నీ ఆ టైంలో కాలేజీలో చదువుకుంటున్న కుర్రాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బన్నీ చెక్ ప్యాంట్ ధరించి కనిపించాడు. వెంటనే చిరంజీవి గారికి చూపించి చూడండి సార్.. ఇప్పుడు యంగ్ స్టర్స్ అందరూ ఇలాంటి ప్యాంట్స్ వేసుకుంటున్నారు అని చెప్పా. దీనితో చిరంజీవి అంగీకరించారు. ఆ విధంగా జయంత్ సి పరాన్జీ సూచించిన మార్పుల వల్ల బావగారు బాగున్నారా చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో రంభ, రచన బెనర్జీ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చిరంజీవి డూప్ లేకుండా బంగీ జంప్ చేయడం విశేషం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
అల్లు అర్జున్
 
5th T20 • NZ vs IND 2026
Live
NZNZ
(16.3 ov)180/3
INDIND
(20.0 ov)191/8
NZ need 12 runs in 21 balls
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Sridevi: పెళ్లయిన వ్యక్తిని చేసుకోను అన్న శ్రీదేవి.. ఇద్దరు పిల్లల తండ్రికి భార్య ఎలా అయిందంటే!
Recommended image2
Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!
Recommended image3
Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే
Related Stories
Recommended image1
చిరంజీవి, మహేష్, బాలయ్య తప్పించుకోలేకపోయారు.. వాళ్ళేదో తోపులు అని గుడ్డిగా నమ్మేశారు
Recommended image2
అర్ధ రూపాయి జీతం నుంచి 3 వేల కోట్లకుపైగా ఆస్తులు.. ఆ కుటుంబానికి ఎలా సాధ్యమైంది, అగ్ర హీరో బయటపెట్టిన నిజాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved