Acharya: తన పెళ్లిపై చిరు ఫన్నీ కామెంట్స్.. సురేఖ అనుకుంటే జరిగిపోవాలి అంతే..
గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ఆచార్య త్రయం చిరంజీవి, రాంచరణ్, కొరటాల శివ లని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ సరదాగా సాగింది.

Acharya
కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు.స్వయంగా చిరంజీవి ఆచార్య ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ఆచార్య త్రయం చిరంజీవి, రాంచరణ్, కొరటాల శివ లని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ సరదాగా సాగింది. తాను, రాంచరణ్ కలిసి నటించాలనేది సురేఖ కోరిక అని చిరంజీవి గతంలో కూడా చెప్పారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన వచ్చింది.
దీనిపై చిరంజీవి మాట్లాడుతూ.. రాంచరణ్ హీరో అయ్యే సమయానికి నేను పాలిటిక్స్ లోకి వెళ్లాను. ఆ టైంలో సురేఖ తరచుగా బాధపడుతూ ఉండేది. రాంచరణ్ తో మీరు కంప్లీట్ గా ఒక సినిమాలో నటిస్తే బావుండేది.. కానీ మీరు పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు అని అంటూ ఉండేది. నేను తిరిగి రీఎంట్రీ ఇచ్చాక సురేఖ కోరికలకు మళ్ళీ రెక్కలొచ్చాయి అని చిరంజీవి అన్నారు.
ఇప్పుడు ఇలా మేమిద్దరం కలిసి ఆచార్యలో నటించాం అని చిరంజీవి అన్నారు. అమ్మది బలమైన కోరిక అని రాంచరణ్ తెలిపాడు.. వెంటనే చిరు అందుకుని చాలా బలమైన కోరిక నాన్నా.. తను అనుకుంటే అయిపోతుంది. మనవూరి పాండవులు చిత్రం చూసి ఎవరీ సైకిల్ అబ్బాయి చాలా బావున్నాడే అని అనుకుందట.. అంతే ఫినిష్ .. బొక్క బోర్లా పడ్డాను. ఆ టైం లో నేను అప్పుడే పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటాను. కానీ అయిపోయింది అని చిరు ఫన్నీ కామెంట్స్ చేశారు.
Acharya
మేమిద్దరం కలిసి నటించాలి కాబట్టి ఆచార్య చిత్రంలో సిద్ద పాత్రని సృష్టించలేదు. కొరటాల శివ రాసిన కథ నుంచే సిద్ద పాత్ర పుట్టింది. ఆ పాత్ర నచ్చడంతో రాంచరణ్ నటించారు అని తెలిపారు.
Acharya
ఆచార్య చిత్రంలో రాంచరణ్ కి జోడిగా హాట్ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్న చిత్రం ఇది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించడం మరో హైలైట్.