- Home
- Entertainment
- అల్లు అర్జున్ `పుష్ప 2` సక్సెస్‌పై చిరంజీవి ఊహించని కామెంట్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ వార్‌పై సెటైర్లు
అల్లు అర్జున్ `పుష్ప 2` సక్సెస్‌పై చిరంజీవి ఊహించని కామెంట్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ వార్‌పై సెటైర్లు
మెగా, అల్లు ఫ్యామిలీలు దూరమవుతున్నాయనే రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` సినిమాపై చిరంజీవి స్పందించారు. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

chiranjeevi, allu arjun, pushpa2
మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` సినిమాపై స్పందించారు. `పుష్ప 2` మూవీ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో తాజాగా చిరంజీవి స్పందించారు. ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. చిత్ర పరిశ్రమలో కాంపౌండ్లు లేవని తెలిపారు. నందమూరి కాంపౌండ్, మెగా కాంపౌండ్ అనేది లేదని, అంతా ఒక్కటే అని, ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా సక్సెస్ అయినా అందరం సంతోషించాలి. ఎందుకంటే ఆ నిర్మాత మళ్లీ మాతో సినిమా చేస్తాడు అని తెలిపారు చిరంజీవి.
ఈ క్రమంలోనే మా ఇంట్లో చాలా మంది హీరోలున్నారని, అందరం కలిసిమెలిసి ఉంటాం, కలివిడిగా ఉంటాం. అలాగని మా ఇమేజ్‌లు తక్కువా?.. ఏవీలో పవన్ కళ్యాణ్ కనిపించగానే అంతా అరుపులు చూసి నేను గర్వపడాలి అంటూనే అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` ప్రస్తావన తెచ్చారు. అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` పెద్ద హిట్ అయ్యింది, దానికి నేను గర్విస్తాను.
కొన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని ఆడవు, కానీ ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడిందంటే ప్రతి ఒక్కరు సంతోషించాలని తెలిపారు చిరంజీవి. చాలా రోజుల తర్వాత, `పుష్ప 2` పెద్ద హిట్ కావడం, అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు చోటు చేసుకున్నఅనంతరం మొదటి సారి చిరంజీవి `పుష్ప 2` ప్రస్తావన తేవడం, సంతోషంగా ఉందని చెప్పడం విశేషమనే చెప్పాలి.
ఎందుకంటే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వేరు అవుతున్నారని, విడిపోతున్నారనే రూమర్స్ వస్తున్న నేపథ్యంలో చిరంజీవి పరోక్షంగా తాము కలిసే ఉంటామని తెలిపారు. ఎప్పుడూ కలుస్తామని, తమ మధ్య ఈగోలు లేవని, ఇతర హీరోల సినిమాల సక్సెస్‌ని గర్విస్తామని చెప్పడం విశేషం.
విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన `లైలా` చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం `లైలా` ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వించారు. దీనికి చిరంజీవి గెస్ట్ గా వెళ్లారు. ఇందులో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందులోనే మెగా, నందమూరి కాంపౌండ్ల గురించి చిరంజీవి స్పందించారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి మాట్లాడుతూ, `విశ్వక్ సేన్ ఫంక్షన్ కి వెళ్తున్నావా? అని అడిగారు. ఏం ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, బాలకృష్ణ.. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులంటే వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా?
మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన వాడి ఫంక్షన్ కి నేను వెళ్ళకూడదా? విశ్వక్ కి ఈ ప్రశ్న అడగడం నేను చూశాను. దానికి విశ్వక్ చాలా చక్కని సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు అన్నాడు. నిజంగా తనని అభినందిస్తున్నాను.
అభిమానులు వాల్ పోస్టర్లు చింపుకోవడం నేను చూశాను. నెల్లూరు లో మా కజిన్స్ ఒకరు రామరావు గారిని, ఒకరు ఏఎన్ఆర్ గారి అభిమానించి ఒకరిని ఒకరు కొట్టుకునేవారు. హీరోలు బాగానే వుంటారు. అభిమానులు కొట్టుకుంటున్నారనే ఆలోచన ఆ రోజు నుంచే నాకు మొదలైయింది. నేను ఫిల్మ్ యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య సక్యత సహ్రుద్బావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను.
మద్రాస్ లో హనీ హౌస్ లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్ళం. ఈ రోజుకి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మేమంతా కలసికట్టుగా వుంటాం. బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు నేను వెళ్లాను. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. అందరం కలివిడిగా వుండాలి.
ఇండస్ట్రీ ఒకటే కాంపౌండ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో అనగారిపోయిన కోరిక గబుక్కున పెళ్ళుబికింది. లైలా గెటప్ లో విశ్వక్ కసక్ లా అనిపిస్తున్నాడు(నవ్వుతూ). విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయివుంటే గుండెజారి గల్లంతయ్యేది(నవ్వుతూ). అంతగ్లామర్ గా వున్నాడు.
నేను, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లేడి గెటప్స్ వేశాం. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. లైలా కూడా హిట్ గ్యారెంటీ. తప్పకుండ ఈ సినిమాకి ఆడియన్స్ వెళ్తారు. ఎంజాయ్ చేస్తారు. విశ్వక్ మాస్ క్లాస్ ఇటు అమ్మాయిగా అద్భుతంగా చేశాడు. దర్శకుడు రామ్ చాలా ఎంటర్ టైన్మెంట్ తో తీశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్.
విశ్వక్ చాలా ప్రతిభావంతుడు. తన ఇండస్ట్రీలో జెండా పాతాలి. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో మగవాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు. అభిమన్యు సింగ్, పృద్వీ, ఆకాంక్ష, కామక్షి అందరూ చక్కగా పెర్ఫార్ చేశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.
సాహు నిర్మాతగా ఇప్పుడే బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. ఇది సమ్మర్ లో ప్రారంభం కాబోతోంది. ఇది ఆద్యంతం కామెడీగా వుంటుంది. ఎప్పుడు సెట్స్ లోకి వెళ్లి నటిస్తానా అనే ఉత్సాహం వుంది. సాహు, గోల్డ్ బాక్స్ కొణిదెల సుస్మిత కలసి ఈ సినిమాని నిర్మిస్తారు` అని తెలిపారు చిరంజీవి.
also read: Akhanda 2 ` గూస్‌బంమ్స్ అప్‌డేట్.. బాలయ్యకి విలన్‌గా ఆదిపినిశెట్టిని తీసుకోవడం వెనుక అసలు కారణం?