MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అట్టర్ ఫ్లాప్ నుంచి చిరంజీవి జస్ట్ మిస్, చివరికి బలైంది బాలయ్య.. ఎగ్జైట్మెంట్ తో విజిల్ కొట్టిన జూ.ఎన్టీఆర్

అట్టర్ ఫ్లాప్ నుంచి చిరంజీవి జస్ట్ మిస్, చివరికి బలైంది బాలయ్య.. ఎగ్జైట్మెంట్ తో విజిల్ కొట్టిన జూ.ఎన్టీఆర్

ఠాగూర్ తర్వాత చిరంజీవి ఒక భారీ ఫ్లాప్ చిత్రం నుంచి తప్పించుకున్నారు. కానీ బాలకృష్ణ అదే కథాంశంతో మూవీ చేసి భారీ ఫ్లాప్ సొంతం చేసుకున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 20 2025, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi, Balakrishna

Chiranjeevi, Balakrishna

ఠాగూర్ లాంటి భారీ హిట్ తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రానికి సంబంధించిన చర్చల్లో ఉన్నారు. ఠాగూర్ తర్వాత ఎలాంటి మూవీ చేయాలి అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. 2002లో సల్మాన్ ఖాన్ తుమ్ కో న బౌల్ పాయేంగే అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ హాలీవుడ్ చిత్రం ది లాంగ్ కిస్ గుడ్ నైట్ అనే మూవీ ఇన్సిపిరేషన్ తో వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ ఒక సీక్రెట్ ఏజెంట్. తలకి గాయం కావడం వల్ల గతం మరచిపోతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Balakrishna

Balakrishna

కానీ ఆమె అలవాట్లు, నేర్చుకున్న విషయాలు తనకే తెలియకుండా అప్లై చేస్తూ ఉంటుంది. ఆమె షార్ప్ షూటర్. గతం మరచిపోయిన తర్వాత కూడా షూటింగ్ మరచిపోదు. ఈ పాయింట్ తో చిరంజీవి కోసం ఒక కథ రాస్తే ఎలా ఉంటుంది అనే చర్చలు జరిగాయట. హీరో గతం మరచిపోతాడు. కానీ అప్పటి అలవాట్లు మాత్రం అలాగే ఉంటాయి. చిరంజీవికి కూడా ఈ పాయింట్ నచ్చింది. కథ మొదలు పెట్టమని చెప్పారట. 

35
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

కానీ ఇదే పాయింట్ తో బాలకృష్ణ కోసం విజయేంద్ర ప్రసాద్ ఒక కథ రాస్తున్నారని తెలిసింది. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే పాయింట్ తో మూవీ చేయడం కరెక్ట్ కాదని చిరంజీవి ఆ చిత్రాన్ని ఆపేశారు. కానీ బాలయ్య చిత్రం మాత్రం రూపొందింది. అదే విజయేంద్ర వర్మ. ఈ చిత్రంలో బాలయ్య గతం మరిచిపోయిన ఆర్మీ అధికారిగా నటించారు. ఈ చిత్రంలో కథ బాగానే ఉంటుంది. 

45

కానీ లాజిక్ లేని కొన్ని సీన్ల వల్ల మూవీ డిజాస్టర్ అయింది.  బాలయ్య ఫ్యాన్స్ ని కూడా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. దేశభక్తి సన్నివేశాలు కూడా అంతగా పండలేదు. ఈ చిత్ర రిలీజ్ టైంలో మామూలు హైప్ లేదు. సినిమా హిట్ అయి ఉంటే చాలా రికార్డులు బ్రేక్ అయ్యేవి. కానీ అలా జరగలేదు. ఈ చిత్రంలో లయ, సంగీత, అంకిత హీరోయిన్లుగా నటించారు. 

55
Vijayendra Varma movie

Vijayendra Varma movie

విజయేంద్ర వర్మ చిత్రం రిలీజ్ టైంలో అరకులోయలో జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు చిత్ర షూటింగ్ జరుగుతోంది. విజేంద్ర వర్మ చిత్రానికి ఉన్న హైప్, అంచనాల దృష్ట్యా ఎలాగైనా ఫస్ట్ షో చూడాలని జూనియర్ ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారు. నరసింహుడు చిత్ర యూనిట్ మొత్తం బాలయ్య చిత్రం చూడాలని అనుకున్నారు. దీనితో అక్కడికే మూవీ ప్రింట్ తెప్పించుకుని చూశారు. బాలయ్య కొండపైకి ఎక్కే ఎంట్రీ సీన్ చూసి ఎన్టీఆర్ ఎగ్జైట్మెంట్ తో విజిల్ కొట్టి గెంతులు వేశాడని అప్పట్లో నరసింహుడు చిత్ర యూనిట్ తెలిపింది. కానీ విజయేంద్ర వర్మ డిజాస్టర్ అయింది. మొత్తంగా చిరంజీవి ఒక బిగ్ ఫ్లాప్ నుంచి ఎస్కేప్ అయ్యారని చెప్పొచ్చు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Recommended image2
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Recommended image3
Folk Song : అందాలను ఇంత అద్భుతంగా వర్ణిస్తే ఏ అమ్మాయైనా ప్లాట్ అవ్వాల్సిందే.. అందుకే ఈ ఫోక్ కు 237M వ్యూస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved