శ్రీజ టార్గెట్ గా కళ్యాణ్ దేవ్ మరొక మరొక సంచలన పోస్ట్... తేల్చి చెప్పేశాడుగా!
కళ్యాణ్ దేవ్-శ్రీజ విడిపోయి చాలా కాలం అవుతుంది. కాగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా ఆయన మరో పోస్ట్ పెట్టారు.

Sreeja-Kalyan Dev
కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అధికారికంగా విడాకులు ప్రకటించనుకున్నప్పటికీ విడిపోయారన్న మాట వాస్తవమేనని, విశ్వసనీయ వర్గాల సమచారం. ఈ వాదన బలపరిచే విధంగా పరిస్థితులు ఉన్నాయి. శ్రీజ-కళ్యాణ్ దేవ్ కలిసి కనిపించి ఏడాది దాటిపోయింది. ఇక వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ విడాకుల మేటర్ ధృవీకరిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ కూతురు నవిష్క శ్రీజా వద్దే పెరుగుతుంది.
ఈ క్రమంలో కూతురుని తలచుకుని కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్స్ పెడుతుంటారు. ఆమెను బాగా మిస్ అయిన భావన వ్యక్తీకరిస్తుంటారు. తాజాగా కళ్యాణ్ దేవ్ ఒక వీడియో షేర్ చేశారు. సదరు వీడియోలో ఓ పాప స్కూల్ కల్చరల్స్ లో పాల్గొంటుంది. వేదిక ముందున్న పేరెంట్స్ ని చూసి ఆమె చాలా ఎగ్జైట్మెంట్ ఫీలవుతుంది. ఈ వీడియోను కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టారు.
ఆ వీడియోకి ఓ కామెంట్ కూడా పెట్టారు. పిల్లలకు తల్లి, తండ్రి ఇద్దరి ప్రేమ కావాలి. నవిష్క, నివ్రితిలను బాగా మిస్ అవుతున్నానని కళ్యాణ్ దేవ్ కామెంట్ పెట్టాడు. నవిష్క తో పాటు నివ్రితిని కూడా తలుచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవిష్క శ్రీజ-కళ్యాణ్ దేవ్ లకు పుట్టిన అమ్మాయి. నివ్రితి మాత్రం శ్రీజ మొదటి భర్త సంతానం.
శ్రీజను వివాహం చేసుకున్నాక నివ్రితిని కూడా కళ్యాణ్ దేవ్ కూతురిగా భావించారు. ఆమెతో అనుబంధం పెంచుకున్నాడు. శ్రీజతో మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. నవిష్క, నివ్రితి శ్రీజ వద్దే పెరుగుతున్నారు. దీంతో వారిని కలిసే అవకాశం కళ్యాణ్ దేవ్ కి లేకుండా పోయింది. ఈ కారణంగా కూతుళ్లను తలచుకుని కళ్యాణ్ దేవ్ భాదపడుతున్నారు.
sreeja kalyan
కాగా 2016లో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకున్నారు. శ్రీజకు ఇది రెండో వివాహం. చిరంజీవి అల్లుడి హోదాలో కళ్యాణ్ దేవ్ హీరోగా మారాడు. ఆయన మొదటి చిత్రం విజేత ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. అనంతరం సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాల్లో కళ్యాణ్ దేవ్ నటించారు.