MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఘనంగా అలీ కూతురు వివాహం... సతీసమేతంగా హాజరైన చిరంజీవి, నాగార్జున!

ఘనంగా అలీ కూతురు వివాహం... సతీసమేతంగా హాజరైన చిరంజీవి, నాగార్జున!

నటుడు అలీ కూతురు ఫాతిమా వివాహం ఘనంగా జరిగింది. చిరంజీవి, నాగార్జునతో పాటు చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Nov 28 2022, 08:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ali Daughter Marriage

Ali Daughter Marriage

ప్రముఖ కమెడియన్ అలీ-జుబేదాల కూతురు ఫాతిమా వివాహం హైదరాబాద్ లో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, నాగార్జున సతీసమేతంగా హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Ali Daughter Marriage

Ali Daughter Marriage

కూతురు జుబేదా వివాహాన్ని అలీ అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరుకున్నారు. దీని కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. పరిశ్రమ ప్రముఖులను, రాజకీయ నేతలను అలీ స్వయంగా కలిసి కూతురు వివాహానికి ఆహ్వానించారు. 
 

35
Ali Daughter Marriage

Ali Daughter Marriage


దీంతో చిరంజీవి, నాగార్జున సతీసమేతంగా హాజరయ్యారు. చిరంజీవి-సురేఖ, నాగార్జున-అమల.. నూతన దంపతులను ఆశీర్వదించారు. వీరిద్దరి రాక పెళ్లి వేడుకను ప్రత్యేకంగా మార్చేసింది. 
 

45
Ali Daughter Marriage

Ali Daughter Marriage

సీనియర్ హీరోయిన్, మంత్రి రోజా ఈ వేడుకకు హాజరయ్యారు. అలీ ఏపీ సీఎం జగన్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన కూతురు వివాహానికి రావాలని కోరారు. అయితే బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆయన ఈ వివాహానికి రాలేదని తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా, అలీ సహ నటిగా రోజా ఫాతిమా పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

55
Ali Daughter Marriage

Ali Daughter Marriage

ప్రముఖుల రాకతో అలీ సంతోషం వ్యక్తం చేశారు. అలీకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఫాతిమా వివాహ బాధ్యత అలీ పూర్తి చేశారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమకు వచ్చిన అలీ ఐదు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhavi latha: నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది.. నా అన్వేష్‌పై మాధవీలత బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Recommended image3
Jananayagan Leak: మేం కోట్లు పెట్టి తీస్తే.. పైరసీ చేస్తారా? సీఎం విజయ్ సినిమా .. ముగ్గురిపై గుండా యాక్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved