ఒకప్పటి హీరో,సన్యాసిలా మారి రిషికేశ్ లో ఉంటే తీసుకొచ్చి వేషం ఇచ్చిన చిరంజీవి
ఎంక్వైరీ చేస్తే రిషికేశ్ లో ఆశ్రమంలో ఆయన ఉన్నారని తెలిసింది. ఈ వయస్సులో ఎందుకమ్మా ఆయన రిషి అయ్యిపోవటం. ఆయన పెద్దోడుని అయ్యిపోయానని ఫీలైపోతున్నారని అని..
సినిమాలకు సంభందించిన కొన్ని విశేషాలు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. గతంలో హీరోలు గా చేసిన నటులు కొందరు మెల్లిగా కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యి, మాయమైపోయి వేరే వ్యాపారాల్లో బిజీ అవుతూండటం చూస్తూంటం. అలాగే ఒకప్పుడు ఒక వెలిగిన హీరోయిన్స్ పెళ్లి చేసుకుని ఔట్ షేప్ అయ్యి చూసేందుకు ఆశ్చర్యంగా కనిపిస్తారు.
వాళ్లు మీడియా ముందుకు రావటానికి కూడా చాలా సార్లు ఇష్టపడరు. సినిమా ప్రపంచం నుంచి తప్పుకుని మీడియా దూరంగా ఉంటూంటారు. అయితే తిరిగి రీ ఎంట్రి ఇస్తే..చిరంజీవి అలాంటి ఓ మాజీ హీరోని తీసుకొచ్చి మళ్లీ తన సినిమాలో వేషం ఇచ్చారు. ఆ హీరో ఎవరు...చూద్దాం.
ఆ హీరో మరవెరో కాదు సర్వదామన్ బెనర్జీ. 1986లో దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాఎథ్ తెరకెక్కించిన సిరివెన్నెల. ఈ మూవీలో సుహాసిని, సర్వదామన్ బెనర్జీ ప్రధాన పాత్రలలో నటించారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల్లో ఈ మూవీ ఒకటిగా నిలిచింది. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ శ్రోతలను ముగ్దులను చేస్తాయి.
సిరివెన్నెల. సినిమాతోనే ప్రముఖ పాటల రచయిత సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. ఇందులో అంధుడిగా నటించి మెప్పించారు సర్వదామన్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి.. ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.
చిరంజీవి ఈ విషయం చెప్తూ.... సర్వదామన్ ని గాడ్ ఫాధర్ లో తీసుకుందామని చూస్తే ఎక్కడున్నారో తెలియలేదు. ఆయనతో చేసిన హీరోయిన్స్ ని అడిగితే..ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు.కృష్ణా రామా అనుకుంటూ ఎక్కడో రిషికేష్ లో ఉన్నారని చెప్పారు. ఎంక్వైరీ చేస్తే రిషికేశ్ లో ఆశ్రమంలో ఆయన ఉన్నారని తెలిసింది.
ఈ వయస్సులో ఎందుకమ్మా ఆయన రిషి అయ్యిపోవటం. ఆయన పెద్దోడుని అయ్యిపోయానని ఫీలైపోతున్నారని అని నేను మనిషిని పంపి అడిగించాను. అప్పుడు బెనర్జీ ..చిరంజీవి అడిగారా అయితే చేస్తానని ఈ పాత్ర చేసారంటూ చెప్పుకొచ్చారు.
సిరివెన్నెల అనే సినిమాలో సర్వదామన్ అంధుడైన కళాకారుడిగా నటించారు. నిజానికి సర్వదామన్ బెనర్జీ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయనకు తెలుగు రాదు అందులో ఒక గుడ్డివాడి పాత్రలో నటించాలంటే చాలా కష్టమైన పని. అయినా చాలా అలవోకగా సిరివెన్నెలలో నటించి మెప్పించారు.
ముందు సంస్కృత భాషలో వచ్చిన ఆదిశంకరాచార్య అనే సినిమాలో కూడా టైటిల్ పాత్రలు పోషించి సర్వదామన్ బెనర్జీ మంచి పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఆ సినిమా చూసే సిరివెన్నెల సినిమాలో ఆయనకు అవకాశం ఇచ్చారు విశ్వనాధ్ ఆ తర్వాత విశ్వనాథ్.
సిరివెన్నెల తరువాత కూడా చిరంజీవితో చేసిన స్వయంకృషి సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర కోసం ఆయనని ఎంపిక చేసుకున్నారు విశ్వనాధ్. సుమలత భర్త పాత్రలో సర్వదామన్ బెనర్జీ నటించారు. తెలుగు సహా హిందీ, బెంగాలీ సినిమాల నుంచి ఆఫర్స్ వస్తున్నా బెనర్జీ మాత్రం రామానంద్ సాగర్ తీసిన కృష్ణ సీరియల్ లో శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు. ఒకరకంగా ఆ పాత్రలో నటించడం ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అప్పటి నుంచే ఆధ్యాత్మిక మార్గం వైపు ఆయన అడుగులు పడ్డాయి.
తరువాత సుబ్బిరామిరెడ్డి నిర్మించిన స్వామి వివేకానంద అనే సినిమాలో కూడా బెనర్జీ వివేకానందుడి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత నుంచి ఆయన హరిద్వార్ రిషికేశ్ అంటూ ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. మరి ఎలా ఒప్పించారో ఏమో తెలియదు గానీ 35 ఏళ్ల తర్వాత గాడ్ ఫాదర్ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి తండ్రి పాత్రలో కనిపించారు. ఆయన గాడ్ ఫాదర్ సినిమాలో తండ్రి పాత్రలో కనిపించారు .
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళం సూపర్ హిట్ లూసీఫర్ చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్ మోహన్ రాజా. దసరా కానుగా అక్టోబర్ 5న ప్రేక్షకుల్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఓ మోస్టరు విజయం సాధించింది. ఈ మూవీలో చిరుతోపాటు.. లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించి మెప్పించారు.