MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • AI Movie : రూ.12 కోట్ల బడ్జెట్.. రూ.8 లక్షల కలెక్షన్.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన తొలి ఏఐ సినిమా

AI Movie : రూ.12 కోట్ల బడ్జెట్.. రూ.8 లక్షల కలెక్షన్.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన తొలి ఏఐ సినిమా

దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో, 100 మందికి పైగా టెక్నీషియన్లు రెండేళ్లు కష్టపడి తొలి ఏఐ సినిమాను రూపొందించారు. దేశవ్యాప్తంగా 10,000 షోలు వేసినా.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం రూ.8 లక్షలు మాత్రమే రావడంతో చిత్రబృందం షాక్ అయింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 26 2026, 06:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.12 కోట్ల బడ్జెట్.. ప్రీ సేల్స్‌లో వచ్చింది రూ.8 లక్షలే!
Image Credit : x

రూ.12 కోట్ల బడ్జెట్.. ప్రీ-సేల్స్‌లో వచ్చింది రూ.8 లక్షలే!

టెక్నాలజీలో చైనా ప్రపంచస్థాయిలో దూసుకుపోతున్నా.. ఆ దేశపు తొలి ఫుల్ లెంగ్త్ ఏఐ సినిమా 'సాన్‌క్సింగ్‌దుయ్: ఫ్యూచర్ పాస్ట్' (Sanxingdui: Future Past) మాత్రం బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. సుమారు 10 మిలియన్ యువాన్ల (మన కరెన్సీలో దాదాపు రూ.12.5 కోట్లు / $1.5 మిలియన్లు) బడ్జెట్‌తో ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. 100 మందికి పైగా టెక్నీషియన్లు రెండేళ్ల పాటు రాత్రింబవళ్లు కష్టపడి ఈ సినిమాను రూపొందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
10,000 షోలు.. కానీ థియేటర్లన్నీ ఖాళీ!
Image Credit : x

10,000 షోలు.. కానీ థియేటర్లన్నీ ఖాళీ!

చైనాలో పాపులర్ మూవీ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ 'మాయోయన్' (Maoyan) లెక్కల ప్రకారం.. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఈ సినిమాకు 10,000కు పైగా షోలు వేశారు. కానీ, జనాల్లో ఈ సినిమాపై ఏమాత్రం ఆసక్తి కనిపించలేదు. గురువారం సాయంత్రం వరకు జరిగిన ప్రీ-సేల్స్‌లో కేవలం 65,000 యువాన్లు (సుమారు రూ.8 లక్షలు / $9,700) మాత్రమే వచ్చాయి. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ 1,00,000 యువాన్లు (సుమారు రూ.12 లక్షలు) కూడా దాటవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్టిన బడ్జెట్‌లో ఇది కనీసం ఒక శాతం కూడా లేకపోవడం గమనార్హం.

35
నిర్మాణ సంస్థ కామెంట్స్..
Image Credit : x

నిర్మాణ సంస్థ కామెంట్స్..

ఈ ఘోర పరాజయాన్ని నిర్మాణ సంస్థ బోనా ఫిల్మ్ గ్రూప్ (Bona Film Group) సీఈఓ జియాంగ్ డెఫు అంగీకరించారు. "చైనాలో ఏఐ టెక్నాలజీతో పూర్తి స్థాయి సినిమాను తీసింది మేమే. థియేటర్లలో రిలీజ్ చేయడానికి సెన్సార్ బోర్డు అనుమతి తెచ్చుకుంది కూడా మేమే. సినిమా ఇండస్ట్రీలో హద్దులు చెరిపేసి ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయడం అంత సులువైన విషయం కాదు" అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

45
అవతార్ రేంజ్‌లో ఉంటేనే డబ్బులిస్తాం - ప్రేక్షకులు
Image Credit : x

అవతార్ రేంజ్‌లో ఉంటేనే డబ్బులిస్తాం - ప్రేక్షకులు

గురువారం వేసిన స్పెషల్ ఫ్రీ షో చూసిన ఐరిస్ యాంగ్ అనే ప్రేక్షకురాలు మాట్లాడుతూ.. "ఈ సినిమా క్వాలిటీ చూశాక, కచ్చితంగా నేను డబ్బులు పెట్టి టికెట్ కొనేదాన్ని కాదు. హాలీవుడ్ 'అవతార్' లాంటి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఏఐతో ఇస్తేనే జనాలు డబ్బులు పెట్టి చూస్తారు" అని కుండబద్దలు కొట్టారు.

చైనా టిక్‌టాక్ యాప్ 'డౌయిన్' (Douyin)లో ఏఐ షార్ట్ ఫిల్మ్స్ సెప్టెంబర్ నెలలోనే 20 వేల కోట్లకు పైగా వ్యూస్ సాధించాయి. కానీ, కేవలం ఏఐతో తీశారన్న ఒకే ఒక్క కారణంతో జనాలు థియేటర్లకు రారని ఏఐ ఫిల్మ్ డైరెక్టర్ జాంగ్ జున్ అన్నారు. ఫ్రీగా ఇంటర్నెట్‌లో వదిలితే జనాలు చూస్తారేమో కానీ, డబ్బులు పెట్టి చూసేంతగా ఈ టెక్నాలజీని ఇంకా యాక్సెప్ట్ చేయలేదని చైనా సోషల్ మీడియా 'వీబో' (Weibo)లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

55
హాలీవుడ్‌ను భయపెడుతున్న ఏఐ సినిమాలు
Image Credit : x

హాలీవుడ్‌ను భయపెడుతున్న ఏఐ సినిమాలు

ఒకపక్క కలెక్షన్స్ రాకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సినిమాల రాక హాలీవుడ్ టెక్నీషియన్లలో భయాన్ని పుట్టిస్తోంది. తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో డిసెంబర్ 4న 'గాడ్స్ డోంట్ గివ్ గిఫ్ట్స్' (Gods Don't Give Gifts) అనే ఫుల్ లెంగ్త్ ఏఐ సైన్స్ ఫిక్షన్ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే, ఇంటర్నెట్‌లో వైరల్ అయిన 'టిల్లీ నార్వుడ్' (Tilly Norwood) అనే వర్చువల్ హాలీవుడ్ హీరోయిన్ నటించిన 'మిస్అలైన్డ్' (Misaligned) సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని ఔట్.. పక్కాగా ప్లాన్ చేసి పంపించిన బిగ్ బాస్, రోహిత్ బుర్రవాడాలన్న దక్షి..
Recommended image2
Feel Good: కుర్రాళ్లని ఊపేస్తున్న మమ్మా మియా సాంగ్‌.. వైరల్‌గా మారిన ఫీల్‌ గుడ్‌ సినిమా పాట
Recommended image3
Rajeev Kanakala: `నువ్వు 116 ఏళ్లు బతకాలి సుమ`.. భార్య గురించి నిజాలు చెబుతూ రాజీవ్ కనకాల ఎమోషనల్‌
Related Stories
Recommended image1
విషపూరిత పామును తిన్నాక కూడా ముంగిస ఎలా బతుకుతుంది? ఆ విషం ఏమవుతుంది?
Recommended image2
ANR: సావిత్రితో నటించడానికి నో చెప్పిన ఏఎన్నార్.. ఎన్టీఆర్ మహానటి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved