మొన్న తండేల్ కి అదే పరిస్థితి, ఇప్పుడు ఛావాకి కూడా చేతులెత్తేశారు
Ibomma: విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఛావా చిత్రం ఆల్రెడీ హిందీలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. 400 కోట్ల వరకు ఈ చిత్రం వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని మార్చి 7న తెలుగులో కూడా రిలీజ్ చేశారు.

Chhaava and Thandel
విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఛావా చిత్రం ఆల్రెడీ హిందీలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. 400 కోట్ల వరకు ఈ చిత్రం వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని మార్చి 7న తెలుగులో కూడా రిలీజ్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని మంచి టాకే వస్తోంది.
అయితే నిర్మాతలకు ఐబొమ్మ లాంటి పైరసీ సైట్లు పెద్ద గుదిబండగా మారాయి. ఐబొమ్మ, మూవీ రూల్స్ లాంటి సైట్లకు చెక్ పెట్టాలని ఎంత ప్రయత్నించినా టాలీవుడ్ నిర్మాతల వల్ల కావడం లేదు. అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించిన నాగ చైతన్య చిత్రానికి కూడా ఇదే సమస్య ఎదురైంది. తండేల్ చిత్రం అలా థియేటర్స్ లో రిలీజ్ అయిందో లేదో ఇలా ఐబొమ్మలో ప్రత్యక్షం అయింది.
దీని గురించి బన్నీ వాసు మీడియాతో కూడా మాట్లాడారు. ఐబొమ్మ లాంటి సైట్లని మనకి సైబర్ సపోర్ట్ లేని ఆఫ్రికా దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు అని తెలిపారు. అందువల్ల ఆ సైట్లని అరికట్టడం కష్టం అవుతోంది అని పేర్కొన్నారు. వీలైనంత వరకు లింకులని బ్లాక్ చేశాం అని చెప్పిన బన్నీ వాసు పూర్తి స్థాయిలో తొలగించడం సాధ్యం కాలేదని చేతులెత్తేశారు.
ఇప్పుడు మరోసారి ఐబొమ్మ గీతా ఆర్ట్స్ సంస్థకి పెద్ద షాక్ ఇచ్చింది. ఛావా తెలుగు మూవీ ఐబొమ్మలో లీక్ అయింది. టాప్ లో ట్రెండ్ అవుతోంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు.