చెమటలు పట్టాయా మాకు?: 'పుష్ప2' కి ఛావా ఫ్యాన్స్ కౌంటర్స్
హిందీలో విడుదలైన 'ఛావా' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మహారాష్ట్రలో పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది, త్వరలోనే 500 కోట్ల మైలురాయిని దాటేసింది.

Chhaava beats Pushpa 2 in Maharashtra in telugu
హిందీలో ఇటీవల విడుదలైన 'ఛావా' బాక్సాఫీస్ వద్ద శివ తాండవం చేస్తూ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు కావస్తున్నప్పటికీ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో వీకెండ్ తో సంబంధం లేకుండా డైలీ రూ.20 నుంచి రూ.30 కోట్లు కలెక్ట్ చేస్తూ దర్శక నిర్మాతలకి లాభాల పంట పండిస్తోంది. అదే సమయంలో పుష్ప 2 రికార్డ్ లను బ్రద్దలు కొట్టింది.
Chhaava beats Pushpa 2 in Maharashtra in telugu
మహారాష్ట్రలో అయితే ఛావా మాస్ ర్యాంపేజ్ మామూలుగా లేదు. అక్కడ ఆల్ టైం కలెక్షన్స్ తో ఎపిక్ రికార్డులను నమోదు చేసిన పుష్ప2 మూవీ టోటల్ రన్ లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది.
కేవలం 15 రోజుల టైం కే బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప2 మూవీ… సాధించిన కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. పుష్ప2 మూవీ టోటల్ రన్ లో మహారాష్ట్ర ఏరియాలో 240 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, ఇప్పుడు ఆల్ మోస్ట్ 15 రోజుల్లో విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ 260 కోట్ల కలెక్షన్స్ తో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసేసింది.
మహారాష్ట్రలో కొద్ది రోజుల క్రితం దాకా పుష్ప 2 చిత్రమే హైయిస్ట్ గ్రాసర్. కానీ ఇప్పుడు ఛావా ఆ ప్లేస్ లోకి వచ్చింది. మహారాష్ట్రలో ఫైనల్ రన్ దాదాపు 300 కోట్లు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.
Chhaava beats Pushpa 2 in Maharashtra in telugu
వాస్తవానికి ఈ ఛావా, పుష్ప 2 రెండు సినిమాలు ఒకే టైమ్ లో రిలీజ్ కు పెట్టారు. డిసెంబర్ 6ని లాక్ చేసుకున్న బాలీవుడ్ భారీ ప్యాన్ ఇండియా మూవీ చావా పుష్పకు వస్తున్న క్రేజ్ చూసి చెమటలు తెచ్చుకుంటోందని మన వాళ్లు మీడియాలో ప్రచారం చేసారు.
అయితే ఏ సినిమాని తక్కువ అంచనా వేయకూడదని పుష్ప 2 లాంటి కమర్షియల్ గ్రాండియర్ ని దాటిన సినిమా మాదే అని విక్కీ కౌశల్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
Chhaava beats Pushpa 2 in Maharashtra in telugu
ఇప్పటివరకూ బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలలో 3వ శనివారం అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో 'ఛావా' టాప్ లో నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్రం చాలా ఫాస్ట్ గా రూ. 500 కోట్ల మైలురాయి ని దాటేసింది. త్వరలోనే బాలీవుడ్ చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక బాలీవుడ్ లో ఈ సినిమా రెస్పాన్స్ చూసి తెలుగు ఆడియన్స్ కోసం "ఛావా" సినిమా ని టాలీవుడ్ లో రిలీజ్ చేసారు. దీంతో డబ్బింగ్ రైట్స్ ని తెలుగు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ దక్కించుకుని రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మార్చ్ 07న థియేటర్స్ లోకి వచ్చింది.
అయితే కేవలం బాలీవుడ్ లో మాత్రమే ఇప్పటివరకూ దాదాపుగా రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి కూడా అదే రేంజ్ లో కనెక్ట్ అయితే మాత్రం కనెక్ట్ కాలేదు. యావరేజ్ గా ఉన్నాయి కలెక్షన్స్.