MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ

Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ

Swetha Naidu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు. అందులో టెలివిజన్ స్టార్, డ్యాన్సర్ ఫైర్ బ్రాండ్ శ్వేతా నాయుడు కూడా ఉన్నారు. ఆమె వచ్చీ రావడంతోనే డ్యాన్స్, సాంగ్స్, మిమిక్రీ అంటూ హడావిడి చేసింది.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 11 2026, 09:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ..
Image Credit : Star Maa

బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ..

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' (Bigg Boss Telugu) సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే అనేక ఉత్కంఠభరితమైన పరిణామాలు, నామినేషన్లు, గొడవలతో హౌస్ హీటెక్కగా, మరింత జోష్ తీసుకురావడానికి మేకర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రంగంలోకి దించారు. ఈ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, డాన్సర్ శ్వేతా నాయుడు కూడా ఉంది. ఆమె వచ్చీరావడంతోనే తన పని మొదలు పెట్టింది. స్టేజ్ మీద నుంచే బిగ్ బాస్ ఇంట్లో హీట్ పెంచేసింది.

బాగా చదువుకుని జాబ్ చేసిన శ్వేతా నాయుడు.. కొంత కాలం తరువాత రిజైన్ చేసి.. డ్యాన్సర్ గా మారింది. పాటలు, మిమిక్రీలో కూడా ఆమెకు మంచి టాలెంట్ ఉంది. బిగ్ బాస్ స్టేజ్ పై కూడా తన టాలెంట్ చూపించింది శ్వేతా నాయుడు. డ్యాన్స్ తో పాటు మన్మధుడు సినిమాలో మంచి పాట కూడా పాడి నాగార్జునను ఇంప్రెస్ చేసింది. అదే స్టేజ్ పై దేబ్జానీకి ఇమిటేట్ చేసి నవ్వించింది కూడా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
షాలినీని టార్గెట్ చేసిన శ్వేతా నాయుడు..
Image Credit : Star Maa

షాలినీని టార్గెట్ చేసిన శ్వేతా నాయుడు..

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు హౌస్ లో వారిపై కొత్త కంటెస్టెంట్ చేత కామెంట్స్ చేయించాడు నాగార్జున. వారి టార్గెట్ ఎవరని ప్రశ్నించాడు. ఈక్రమంలో బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌ ద్వారా అడుగుపెట్టడానికి సిద్ధమైన శ్వేతా నాయుడు, స్టేజ్ మీద హౌస్‌లో కొనసాగుతున్న ఆట తీరుపై గట్టిగానే స్పందించారు. ముఖ్యంగా హౌస్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న షాలిని ఆట తీరును ఆమె ప్రధానంగా టార్గెట్ చేశారు.

షాలిని గేమ్ కంటే కూడా గట్టిగా అరవడానికికే ఇంపార్టెన్స్ ఇస్తుందని విమర్శించింది శ్వేత. అంతే కాదు ఆమె వస్తే సౌండ్ చాలా తక్కువ పెట్టుకుని టీవీ చూస్తానని అన్నారు. కేవలం రోహిత్ చుట్టూనే తిరుగుతోందని, అసలు హౌస్‌లో ఆమె వ్యక్తిగత ఆట ఎక్కడ కనిపిస్తోందని శ్వేతా నాయుడు స్టేజ్ మీదనే ప్రశ్నించారు. కేవలం అరుపులు, కేకలతో సరిపెట్టకుండా అసలైన గేమ్‌ను ఆడాలని, బయట నుంచి చూస్తున్న ప్రేక్షకులకు కంటెస్టెంట్ల అసలు నైజం అర్థమవుతుందని ఆమె పదునైన విమర్శలు గుప్పించారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది.

35
అసలు ఎవరీ శ్వేతా నాయుడు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
Image Credit : Swetha Naidu/ FaceBook

అసలు ఎవరీ శ్వేతా నాయుడు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

శ్వేతా నాయుడు కేవలం ఒక సాధారణ కంటెస్టెంట్ మాత్రమే కాదు, తెలుగు డిజిటల్ స్పేస్ మరియు టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక బలమైన ముద్ర వేసుకున్న ఫైర్‌బ్రాండ్. ఈటీవీలో ప్రసారమయ్యే అత్యంత ప్రజాదరణ పొందిన డాన్స్ రియాలిటీ షో 'ఢీ' (Dhee) ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువయ్యారు. కేవలం ఒక కంటెస్టెంట్‌గానే కాకుండా, అటు డాన్సర్‌గా, ఇటు టీమ్ లీడర్‌గా వ్యవహరించి తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా 'ఢీ 17' సీజన్‌లో రన్నరప్‌గా నిలిచి శ్వేతా నాయుడు అందరి ప్రశంసలు అందుకున్నారు.

45
డ్యాన్సర్‌గా, పర్ఫార్మర్‌గా ప్రత్యేక గుర్తింపు
Image Credit : Swetha Naidu/ FaceBook

డ్యాన్సర్‌గా, పర్ఫార్మర్‌గా ప్రత్యేక గుర్తింపు

డ్యాన్స్ రంగంలో రాణిస్తూనే కామెడీ టైమింగ్‌తోనూ ప్రేక్షకులను అలరించడంలో శ్వేతా నాయుడుది అందె వేసిన చేయి. 'ఢీ' షోలో భాగంగా హైపర్ ఆది వంటి స్టార్ కమెడియన్లతో కలిసి ఆమె చేసిన స్కిట్లు, వేసిన పంచ్‌లు యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కేవలం టెలివిజన్ షోలకే పరిమితం కాకుండా సోషల్ మీడియాలోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. విభిన్న రీల్స్, కవర్ సాంగ్స్, డ్యాన్స్ వీడియోలతో యూట్యూబ్ , ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సేతో కలిసి ఆమె చేసిన కొన్ని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి.

55
బిగ్ బాస్ లో గోల పెరగబోతోందా?
Image Credit : Swetha Naidu/ FaceBook

బిగ్ బాస్ లో గోల పెరగబోతోందా?

అటు బుల్లితెర డ్యాన్స్ షోలతో నూతన ఒరవడి సృష్టిస్తూ, ఇటు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన శ్వేతా నాయుడు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఈ ఫైర్‌బ్రాండ్ ఎంట్రీ ఎలాంటి సవాళ్లను విసురుతుందో, ఆమె ఆటతో ఏ విధంగా మైండ్ గేమ్‌లు ఆడబోతుందో వేచి చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Neethu Natraj: నటరాజ్ మాస్టర్ తో ప్రేమ,పెళ్లి.. తెలుగు అమ్మాయి కాదు కానీ.. నీతూ గురించి ఈ విషయాలు తెలుసా
Recommended image2
Dakkshi: కాస్టింగ్ కౌచ్ కష్టాలు దాటుకుని ఆర్జీవీ సినిమాలో ఛాన్స్.. బిగ్ బాస్ లోకి కరోనా వైరస్ బ్యూటీ దక్షి
Recommended image3
Shivakumar Marihal: బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్ ప్రియుడు, షాలినీకి ఇచ్చిపడేసిన శివకుమార్
Related Stories
Recommended image1
Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్
Recommended image2
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved