MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Gunji Gunji Vulgar Song:అది నోరా?డ్రైనేజా?పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా?చంద్రహాస్ పై నెటిజన్లు ఫైర్

Gunji Gunji Vulgar Song:అది నోరా?డ్రైనేజా?పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా?చంద్రహాస్ పై నెటిజన్లు ఫైర్

తాజాగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పాడిన పాట నెట్టింట రచ్చలేపుతోంది. చంద్రహాస్ పై సినీ ప్రముఖులు, నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం అంతలా దిగజారాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇంతకీ ఆ రచ్చ ఏంటో చూద్దామా..

2 Min read
Author : Kavitha G
Published : Feb 05 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chandrahass controversy
Image Credit : YouTube Nivriti Extras

Chandrahass controversy

ఒకప్పుడు వేషాలు.. నాటకాలు, సినిమాల్లోనే వేసేవారు. కానీ ఇప్పుడు కొందరు నటులు ఎక్కడ పడితే అక్కడే వేస్తున్నారు. స్థాయి తగ్గించుకునే మాటలు మాట్లాడుతున్నారు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతారుతున్నారు. సరిగ్గా అలాంటి పనితో మరోసారి ట్రోల్ అవుతున్నారు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.

ఆయన తన బరాబర్ ప్రేమిస్తా.. సినిమా ఈవెంట్ లో పాడిన ఓ పాట, ఆ పాటలో వాడిన భాష, పదాలు ఎంత జుగుప్సకరంగా ఉన్నాయంటే.. పలకడానికే కాదు.. వినడానికి కూడా అసహ్యం పుట్టిస్తున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతపెద్ద స్టేజ్ పై చంద్రహాస్ ఆ పాటను ఎందుకు పాడారు. ఇప్పటికే కాంట్రవర్సీకి, యాటిట్యూడ్ కి కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న చంద్రహాస్.. స్పృహ లేకుండా ఆ పాట పాడారా?  అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చప్పట్టు కొట్టి ఎంకరేజ్..
Image Credit : YouTube Nivriti Extras

చప్పట్టు కొట్టి ఎంకరేజ్..

అంత పెద్ద ఈవెంట్లో, అంతమంది సినీ ప్రముఖుల ముందు.. అంత అసహ్యంగా పాట పాడితే చూసి ఆపేవాళ్లు లేకపోగా.. చప్పట్లు కొట్టి కొందరు, నవ్వుతూ మరికొందరు చంద్రహాస్ ను ఎంకరేజ్ చేశారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంటే ఆ తప్పు పదాలు వాడినా సమస్యలేదని వాళ్లు అనుకుంటున్నారా? అని నిలదీస్తున్నారు.

Related Articles

Related image1
Saruku, Samanlu: సరుకు, సామాన్లు అనే పదాలు బూతులుగా ఎందుకు మారాయి? వాటి అర్థాలను మార్చిందెవరు?
Related image2
Samanlu Controversy: శివాజీ, అనసూయ, రాశిలో ఎవరు కరెక్ట్? వీరి గొడవలో అసలు విషయం పక్కదారి పట్టిందా?
35
సమాజానికి ఏం చెప్తారు?
Image Credit : YouTube Nivriti Extras

సమాజానికి ఏం చెప్తారు?

నిజానికి మన మాటలు, పాటలు, పదాలు మన మనసులోని భావాలకు ప్రతిబింబాలు. అంటే చంద్రహాస్ మనసులో ఏం ఉన్నట్లు? సినిమా సంగతి పక్కనపెడితే అసలు ఈ పాట ద్వారా ఆయన సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అని నెటిజన్లు మండిపడుతున్నారు.

45
స్పృహ లేకుండా మాట్లాడుతారా?
Image Credit : YouTube Nivriti Extras

స్పృహ లేకుండా మాట్లాడుతారా?

ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటోంది. ఒక చిన్న పాపో, బాబో ఆ సాంగ్ చూసి, ఆ పదాలకు అర్థమేంటి నాన్న అని ఒక తండ్రిని అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఏం చెప్పాలి? ఇది ఎందుకు కొందరు నటులు ఆలోచించట్లేదు. స్టేజ్ పైకి ఎక్కి మైక్ పట్టుకుంటే వారిని వారు మర్చిపోతారా? అంత స్పృహ లేకుండా మాట్లాడుతారా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

చంద్రహాస్ లాంటి వ్యక్తులు కేవలం పబ్లిసిటీ కోసం అసభ్య పదాలను ఉపయోగించడం, వాళ్ల స్థాయిని దిగజార్చుకోవడమే కాదు.. భాషను దిగజార్చడం, మన సంస్కృతిని దిగజార్చడమని నెటిజన్లు అంటున్నారు.

55
పబ్లిసిటీ కోసం ఇంత చేయాలా?
Image Credit : YouTube Nivriti Extras

పబ్లిసిటీ కోసం ఇంత చేయాలా?

పాటలు అనేక సందర్భాల్లో మన సంస్కృతి, మన భావాలను ప్రతిబింబిస్తాయి. అలాంటి ప్రతిభను కేవలం ఇతరుల దృష్టి ఆకర్షించడం కోసం దుర్వినియోగం చేయడం ఎంతవరకు కరెక్ట్. ఒక సినిమా ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏంటి? అని చంద్రహాస్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

భాష, సంగీతం, అభినయం వంటివి మన సమాజాన్ని మార్చి, మన ఆలోచనలను ప్రేరేపించే శక్తివంతమైన సాధనాలు. అవి సమాజానికి మంచి సందేశాలు అందించే విధంగా ఉండాలి. కానీ కేవలం పబ్లిసిటీ కోసం విలువలను తక్కువ చేసేలా ఉండకూడదని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Saruku, Samanlu: సరుకు, సామాన్లు అనే పదాలు బూతులుగా ఎందుకు మారాయి? వాటి అర్థాలను మార్చిందెవరు?
Recommended image2
Samanlu Controversy: శివాజీ, అనసూయ, రాశిలో ఎవరు కరెక్ట్? వీరి గొడవలో అసలు విషయం పక్కదారి పట్టిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved