`భగవంత్ కేసరి`పై `చంద్రబాబు` దెబ్బ.. బాలయ్య సినిమాకిది రాంగ్ టైమే..?
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న `భగవంత్ కేసరి` మూవీ పై పెద్దగా బజ్ లేదు. అక్కడ చంద్రబాబు జైల్లో ఉన్నారు, ఇక్కడ ఎన్నికలున్నాయి. ఇవన్నీ బాలయ్య సినిమాపై ప్రభావం చూపించబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది మరో సినిమాతో వస్తున్నారు. సంక్రాంతికి `వీరిసింహారెడ్డి` చిత్రంతో సందడి చేశాడు. దానితో పెద్ద హిట్ అందుకున్నారు. ఇప్పుడు `భగవంత్ కేసరి` చిత్రంతో వస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. రేపు(అక్టోబర్ 19)న దసరా కానుకగా విడుదల అవుతుంది. జనరల్‌గా బాలకృష్ణ సినిమా అంటే సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. వారం పది రోజుల ముందు నుంచే అభిమానుల హడావుడి, అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు కనిపిస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది పక్కన పెడితే ప్రారంభంలో మాత్రం ఆ రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది.
Bhagavanth Kesari
కానీ విచిత్రంగా `భగవంత్ కేసరి`కి మాత్రం అలాంటి సందడి కనిపించడం లేదు. ఎలాంటి హడావుడీ లేదు. సినిమా ప్రమోషన్స్ పరంగా ఏం చేసినా దీనికి హైప్ రావడం లేదు. కాజల్ సైతం ఇంటర్వ్యూలిచ్చింది. అలాగే శ్రీలీల మొదట్నుంచి ప్రమోషన్స్ లో యాక్టివ్‌గా పాల్గొంది. మరోవైపు అనిల్ రావిపూడి సైతం తన స్టయిల్‌లో ప్రమోట్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈవెంట్‌తోపాటు ప్రెస్‌మీట్‌కి కూడా వచ్చారు. దీంతోపాటు `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` మూడో సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కూడా `భగవంత్ కేసరి` టీమే పాల్గొంది. ఈ ప్రోమోకి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఎపిసోడ్‌కి కూడా క్రేజ్ లేదు.
అయితే దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉండటం, రెండు నందమూరి ఫ్యాన్స్ విడిపోవడం, మూడు తెలంగాణలో ఎన్నికలు, నాలుగు సినిమాలో బాలకృష్ణ మార్క్ ఎలిమెంట్లు పెద్దగా కనిపించకపోవడం, అనిల్ రావిపూడి ప్రభావం కనిపించడం. ఇవన్నీ ఈ చిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉండటంతో టీడీపీ శ్రేణులు హ్యాపీగా లేరు. వాళ్లు సినిమాలు చూసే పరిస్థితి, ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేరు. దీంతో ఆ హడావుడి కనిపించడం లేదు. బాలయ్య అంటే సగం మంది టీడీపీ అభిమానులే ఉంటారు. వారంతా ఇప్పుడు నిరుత్సాహంలో ఉన్నారు.
దీనికితోడు నందమూరి ఫ్యాన్స్ విడిపోయారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు, బాలయ్య ఫ్యాన్స్ వేరు అయిపోయారు. ఇటీవల పరిణామాలతో ఆ స్పష్టత బాగా కనిపిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలు ఎన్టీఆర్‌ని దూరం చేశాయి. దీంతో ఆ ప్రభావం నందమూరి హీరోల సినిమాలపై పడబోతుందని స్పష్టమవుతుంది. మరో వైపు ఎన్నికల వేడి కూడా సినిమాపై గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. అంతా ఏపీలో చంద్రబాబు ఎఫెక్ట్ అయితే, తెలంగాణలో ఎన్నికల వేడి `భగవంత్ కేసరి`పై కనిపిస్తుంది. ఫ్యాన్స్ రాజకీయ ప్రచారాలతో బిజీ అవుతుంది. కేవలం హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్పితే, జనరల్ ఆడియెన్స్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అది నైజాంలో `భగవంత్ కేసరి`పై స్పష్టంగా కనిపిస్తుంది.
దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యని ఆయన రేంజ్‌లో చూపించాడా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. బాలయ్య సినిమాలంటే ఊరమాస్‌గా, ఎలివేషన్లతో, బీజీఎం మోతతో, పవర్‌ఫుల్ డైలాగ్‌లతో ఉంటాయి. కానీ `భగవంత్ కేసరి`లో ఆ పాళ్లు తగ్గినట్టు అర్థమవుతుంది. పైగా తాము ప్రయోగం చేశామని, కొత్తగా ట్రై చేశామని దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతూ వస్తున్నారు. ఇదే ఇప్పుడు ఈ చిత్రంపై గట్టిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతోపాటు ఎమోషనల్ సీన్లు ఉంటాయంటున్నారు. ఇదే తేడా కొడుతుంది. సినిమాకి హైప్ రాకపోవడానికి కారణమవుతుంది. దీనికితోడు సినిమా ఔట్ పుట్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదంటున్నారు. ఇవన్నీ సినిమాపై ప్రభావం చూపిస్తున్నాయి. హైప్ లేకుండా చేస్తున్నాయి. అయితే రిలీజ్ పరంగా ఇది రాంగ్ టైమ్ అనే అభిప్రాయం వినిపిస్తుంది.
`భగవంత్ కేసరి` ప్రీ రిలీజ్ బిజినెస్ 70 కోట్లకుపైగా అయ్యిందట. అంటే ఈ సినిమా విషయంలో బయ్యర్లు సేఫ్‌గా ఉండాలంటే 150కోట్ల గ్రాస్ చేయాలి. బ్లాక్ బస్టర్ మూవీ `అఖండ`నే 130కోట్లు చేసింది. మరి ఇన్ని అడ్డంకుల మధ్య రిలీజ్ అవుతున్న `భగవంత్ కేసరి` 150కోట్లు చేస్తుందా? అనేది ఇప్పుడు పెద్ద రచ్చ. పైగా ఇది మలయాళంలో మమ్ముట్టి నటించిన ఓ సినిమాకి రీమేక్ అని కూడా వినిపస్తున్నాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. ఏదేమైనా బాలయ్యకిది పరీక్షా కాలమే. మరి ఇది నిలబడి సక్సెస్ అవుతుందా? బోల్తా కొడుతుందా? అనేది చూడాలి.
`భగవంత్ కేసరి` కథేంటంటే.. బాలకృష్ణ ఓ పోలీస్ ఆఫీసర్. ఆయన్ని కొందరు కుట్ర చేసి జైల్లో పెట్టిస్తారు. అక్కడ జైలర్ పరిచయం అవుతారు. ఆ జైలర్ కూతురుకి ప్రత్యర్థుల నుంచి థ్రెట్ ఉంటుంది. దీంతో జైల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తన కూతురుని సేవ్ చేసే బాధ్యతని బాలకృప్ణకి అప్పగిస్తారు జైలర్. జైలర్ కూతురు శ్రీలీల బాలయ్య వద్ద పెరుగుతుంది. ఆమెని ఆర్మీ అధికారిగా ప్రిపేర్ చేస్తాడు బాలయ్య. ఎవరు వచ్చినా ఎదుర్కొనేలా, మహిళా కూడా స్ట్రాంగ్‌గా ఉంటూ, హార్డ్ సిచ్యువేషన్స్ నిఫేస్ చేసేలా ఆమెని తీర్చిదిద్దుతాడు. అనంతరం ప్రత్యర్థులను ఎదుర్కోవడమే `భగవంత్ కేసరి` అసలు కథ అని తెలుస్తుంది.