- Home
- Entertainment
- తెలుగు హీరోయిన్ ని వేధించిన నిర్మాత.. ఎవరికి చెప్పుకోను, నన్ను మసి చేస్తారు అంటూ చాందిని చౌదరి ఆవేదన
తెలుగు హీరోయిన్ ని వేధించిన నిర్మాత.. ఎవరికి చెప్పుకోను, నన్ను మసి చేస్తారు అంటూ చాందిని చౌదరి ఆవేదన
తెలుగు బ్యూటీ చాందిని చౌదరి చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది. తన హాట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ వైజాగ్ అమ్మాయి.. నటిగా కూడా ఎదగాలని భావిస్తోంది.

తెలుగు బ్యూటీ చాందిని చౌదరి చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది. తన హాట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ వైజాగ్ అమ్మాయి.. నటిగా కూడా ఎదగాలని భావిస్తోంది. ప్రస్తుతం చాందిని చౌదరి.. కిరణ్ అబ్బవరం సరసన 'సమ్మతమే' అనే రొమాంటిక్ మూవీలో నటిస్తోంది.
జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ప్రమోషనల్ షురూ చేశారు. తాజాగా కిరణ్ అబ్బవరం, చాందిని ఇద్దరూ కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరించే ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో కిరణ్, చాందిని అనేక విషయాలు పంచుకున్నారు.
హీరోయిన్ చాందిని ఓ సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఇండస్ట్రీలో తనకు ఎదురైనా వేధింపులని బయట పెట్టింది. ఏ విషయం గురించి అలీ ప్రశ్నించగా చాందిని వివరించింది. ఈ టాక్ షో ప్రోమో మాత్రమే విడుదలయింది. పూర్తి ఎపిసోడ్ లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
ప్రోమోలో చూపించిన అంశాల మేరకు.. ఓ నిర్మాత సినిమా కోసం తనతో సైన్ చేయించుకున్నారు అని చాందిని తెలిపింది. కానీ తనతో సినిమా చేయకుండా కెరీర్ నాశనం చేసే ప్రయత్నం చేశాడు. నిన్ను ఇండస్ట్రీలోనే కనిపించకుండా చేస్తాను అని బెదిరించాడు అని చాందిని పేర్కొంది.
కానీ ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే.. ఆ నిర్మాత నాతో సైన్ చేయించుకున్న అగ్రిమెంట్ చెల్లదు. ఇంత జరుగుతున్నా ఎవరికీ ఎందుకు చెప్పుకోలేదు అని అలీ ప్రశ్నించారు. దీనికి చాందిని బదులిస్తూ.. ఎవరికి చెప్పుకోను సర్.. వాళ్ళు నా ఫ్యామిలీని కూడా బెదిరించారు. నన్ను నేను రక్షించుకోవడాని నాదగ్గర ఏముంది.. వాళ్ళు తలుచుకుంటే నన్ను చిటికెలో మసి చేస్తారు అంటూ చాందిని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక ఈ షోలో అనేక సరదా విషయాలు కూడా చర్చకు వచ్చాయి. కిరణ్ అబ్బవరం మంచి జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చిన విషయాన్ని, కాలేజీ రోజులని గుర్తు చేసుకున్నాడు. సమ్మతమే విజయం కోసం ఈ జంట ప్రస్తుతం ఎదురుచూస్తోంది.