MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చమ్మక్ చంద్ర జబర్దస్త్ వైఫ్ సత్య రీఎంట్రీ... తెరపైకి పలు ఊహాగానాలు!

చమ్మక్ చంద్ర జబర్దస్త్ వైఫ్ సత్య రీఎంట్రీ... తెరపైకి పలు ఊహాగానాలు!

చమ్మక్ చంద్ర టీమ్ ద్వారా జబర్దస్త్ లో ఫేమస్ అయ్యింది సత్య.చమ్మక్ చంద్రతో పాటు జబర్దస్త్ వదిలేసిపోయిన సత్య మళ్ళీ కనిపించలేదు. చాలా కాలం తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు .  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 01 2022, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Jabardasth

Jabardasth

జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో శ్రీసత్య ఒకరు. బాగా పాపులారిటీ తెచ్చుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్ ఆమె. అలాగే ట్రెండ్ సెట్టర్ కూడా. సత్య ఎంట్రీ వరకు అబ్బాయిలే లేడీ గెటప్స్ వేసేవారు. అయితే సత్య ఆ రోల్స్ కోసం ప్రత్యేకంగా దిగారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Chammak Chandra

Chammak Chandra


చమ్మక్ చంద్ర తన టీమ్ ద్వారా సత్యను పరిచయం చేశాడు. చమ్మక్ చంద్ర స్కిట్స్ దాదాపు అన్నీ ఫ్యామిలీ డ్రామాలే. మొగుడు పెళ్ళాల గిల్లికజ్జాల మీద స్కిట్స్ చేసేవాడు. తన స్కిట్స్ లోని లేడీ క్యారెక్టర్స్ కోసం సత్యను తెచ్చుకున్నాడు. ఆమె సూపర్ గా సక్సెస్ అయ్యారు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న సత్య చమ్మక్ చంద్ర స్కిట్స్ కి ప్లస్ అయ్యింది. 

37
Chammak Chandra

Chammak Chandra


అయితే జడ్జి నాగబాబు 2019 చివర్లో జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. విబేధాల కారణంగా ఆయన షో నుండి తప్పుకున్నారు. పోతూపోతూ తనతో పాటు జబర్దస్త్ డైరెక్టర్స్ తో పాటు కొందరు టీమ్ లీడర్స్ ని తీసుకుపోయాడు. వారిలో చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ ఉన్నారు. జబర్దస్త్ కి పోటీగా నాగబాబు స్టార్ట్ చేసిన 'అదిరింది' షోకి చంద్ర వెళ్ళాడు. 

47
Jabardasth

Jabardasth

చంద్ర శిష్యురాలిగా పేరు తెచ్చుకున్న సత్య కూడా జబర్దస్త్ మానేసింది. జబర్దస్త్ కి నన్ను తీసుకొచ్చింది చంద్రగారు. ఆయన లేని చోట నేను ఉండలేకపోయాను. అందుకే జబర్దస్త్ మానేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో సత్య చెప్పారు. కొన్నాళ్ళు సాగిన 'అదిరింది' షోలో సత్య చేసినట్లు ఉన్నారు. అదిరింది సక్సెస్ కాకపోవడంతో ఆపేశారు. 
 

57
Jabardasth

Jabardasth

తర్వాత సత్య అసలు బుల్లితెరపై కనిపించలేదు. సడన్ గా ఆమె జబర్దస్త్ లో ప్రత్యక్షమయ్యారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో తాగుబోతు రమేష్ టీమ్ లో సత్య చేశారు. దీంతో ఆమె రీఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. సత్య రీ ఎంట్రీ నేపథ్యంలో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

67
Jabardasth

Jabardasth

అదే సమయంలో సత్య రీఎంట్రీకి కారణం ఏమిటనే ఊహాగానాలు మొదలయ్యాయి. చమ్మక్ చంద్రతో విబేధాలు తలెత్తడం కారణంగానే మరలా జబర్దస్త్ కి వచ్చారని అంటున్నారు. కాగా సత్య-చంద్ర మధ్య ఎఫైర్ ఉండనే ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలకు సత్య ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు. 
 

77
Jabardasth

Jabardasth

మా మధ్య కేవలం గురు శిష్యుల సంబంధం మాత్రమే ఉంది. మా పేరెంట్స్ దృష్టికి కూడా ఈ రూమర్స్ వెళ్లాయి. నువ్వేమిటో మాకు తెలుసు. ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని ప్రోత్సహించారు . మా టీమ్ సభ్యుల ముందు ఒకటి రెండు సార్లు ఈ రూమర్స్ గురించి చంద్ర, నేను మాట్లాడుకొని నవ్వుకున్నాం... అని సత్య వెల్లడించారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image2
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image3
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved