- Home
- Entertainment
- Guppedantha Manasu: మొత్తానికి గట్టి నిర్ణయానికి వచ్చిన ఏంజెల్.. రిషిని బ్రతిమాలుకుంటున్న చక్రపాణి!
Guppedantha Manasu: మొత్తానికి గట్టి నిర్ణయానికి వచ్చిన ఏంజెల్.. రిషిని బ్రతిమాలుకుంటున్న చక్రపాణి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ప్రేమిస్తున్న వ్యక్తి మనసు తెలుసుకోలేక సతమతమవుతున్న ఒక ప్రేమికురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 29 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రిషి గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది ఏంజెల్. అంతలోనే అక్కడికి వచ్చిన విశ్వనాథం ఏం ఆలోచిస్తున్నావో నాకు చెప్పు. నాకు చేతనైతే నీ సమస్యని తీరుస్తాను అంటాడు. ఇన్నాళ్లు నాకోసం కష్టపడింది చాలు ఇకమీదట నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటే అంతే చాలు అంతే అని అతనికి టాబ్లెట్స్ ఇచ్చి బీపీ చెక్ చేసి అంతా బానే ఉందని చెప్పి రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకోమంటుంది. ఆ తర్వాత మళ్లీ ఆలోచనలో పడుతుంది.
అసలు రిషి మనసులో ఏముందో అర్థం కావటం లేదు. వసుధార, రిషి ప్రేమించుకుంటున్నారా.. ఆ విషయం నాకు తెలిస్తే బాధపడతానని చెప్పడం లేదా ఈరోజు ఎలాగైనా విషయం కనుక్కోవాలి. రిషి మనసులో ఎవరున్నారో కనుక్కోవాలి తన మనసులో ఎవరూ లేకపోతే పెళ్లి చేసుకునే వరకు వదిలి పెట్టకూడదు అని ఒక నిర్ణయానికి వస్తుంది ఏంజెల్. మరోవైపు ఆఫీసులో కూర్చున్న రిషి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడడు. అటెండర్ వచ్చి అందరూ వెళ్లిపోయారు సార్ అని చెప్తాడు.
నాకు కొంచెం పని ఉంది నేను వెళ్లేటప్పుడు మీకు చెప్తాను అప్పుడు ఈ రూమ్ లాక్ చేసుకుందువు గాని అని చెప్తాడు రిషి. సరే అని వెళ్ళిపోతాడు అటెండర్. కాసేపటి తర్వాత వసుధార అటువైపుగా వెళుతూ ఇంకా ఇంటికి వెళ్ళలేదేమి అని రిషి ని అడుగుతుంది. నాకు పని ఉంది అంటాడు రిషి. నన్ను హెల్ప్ చేయమంటారా అంటుంది వసుధార. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది. పక్క వాళ్ళ పనుల్లో జోక్యం చేసుకుంటేనే పరిస్థితులు ఇంతవరకు వచ్చాయి అంటాడు రిషి.
అది జోక్యం అని ఎందుకు అనుకుంటారు సాయం అని అనుకోవచ్చు కదా అంటుంది వసుధార. వాళ్ళిద్దరి మధ్య చాలా సేపు ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత నన్ను డిస్టర్బ్ చేయకండి మీరు వెళ్ళండి అని చెప్పటంతో రిషివైపు తీక్షనంగా చూస్తుంది వసుధార. ఆ కళ్ళను చూసి మైమరిచిపోతాడు రిషి. తను వెళ్ళిపోయిన తర్వాత ఆ కళ్ళతోనే నన్ను తన ప్రేమలో పడేసింది ఇప్పుడు నా ప్రాణం అయిపోయింది అనుకుంటూ ఆమె కళ్ళను గీస్తూ కూర్చుంటాడు రిషి.
మరోవైపు ఏంజెల్ రిషి రాలేదని కంగారు పడుతూ ఉంటుంది. అతనికి ఫోన్ చేద్దామనుకుంటుంది మళ్ళీ కోప్పడతాడని ఊరుకుంటుంది. చాలా రాత్రి వరకు కాలేజీలోనే ఉంటాడు రిషి. కరెంటు పోవడంతో అక్కడినుంచి బయలుదేరుతాడు. రిషి కారులో వస్తుండగా ఇంక ఉండబట్ట లేక ఏంజెల్ రిషికి ఫోన్ చేస్తుంది కానీ తను ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటుంది ఏంజెల్. ఇంటికి వెళ్లకుండా దారిలోనే ఆగిపోయి నాకు ఇంటికి వెళ్లాలని లేదు.
ఏంజెల్ కి ఎదురుపడాలని లేదు కానీ వెళ్ళక తప్పదు ఏంటి నాకీ పరిస్థితి అని బాధపడుతాడు రిషి. కారు అక్కడే వదిలేసి ఆలోచించుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. తను ఆలోచనల నుంచి బయటికి వచ్చేసరికి వసుధార ఇంటిముందు ఉంటాడు. అదేంటి ఆలోచించుకుంటూ ఇంత దూరం ఎలా నడిచి వచ్చేసాను అనుకుంటాడు. అసలు వసుధార ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో కనుక్కుందాం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడే భోజనానికి కూర్చుంటారు వసుధార వాళ్ళు.
ఆ టైంలో వచ్చిన రిషి ని చూసి షాక్ అవుతారు తండ్రి కూతుర్లు. వసుధార రిషి ని భోజనానికి కూర్చోమంటుంది. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అంతేకానీ భోజనం చేయడానికి కాదు అంటాడు రిషి. అప్పుడు చక్రపాణి రిషి ని భోజనం చేయమని బ్రతిమాలుకుంటాడు. పెద్దవారు మీకోసం భోజనం చేస్తాను అని చెప్పి భోజనానికి కూర్చుంటాడు రిషి. వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని భోజనం చేస్తుంటే బాగా ఎమోషనల్ అవుతాడు చక్రపాణి.
అదే సమయంలో ఏంజెల్ వసుధార వాళ్ళ ఇంటికి వస్తుంది. ఒకసారిగా కంగారు పడతారు రిషి వాళ్ళు. నన్ను ఇక్కడ చూస్తే అనుమానం పడుతుంది నేను ఇక్కడికి వచ్చినట్టు చెప్పొద్దు అని చెప్పి వెళ్లి దాక్కుంటాడు రిషి. ఇంట్లోకి వచ్చిన ఏంజెల్ ని ఈ టైంలో వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది పసుధార. ఏం లేదు రిషి ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. రిషి ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలిసేమో అడుగుదామని వచ్చాను అంటుంది ఏంజెల్. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.